breaking news
kps gill passes away
-
మాజీ డీజీపీ కేపీఎస్ గిల్ కన్నుమూత
-
మాజీ డీజీపీ కేపీఎస్ గిల్ కన్నుమూత
పంజాబ్ మాజీ డీజీపీ కేపీఎస్ గిల్ (82) మరణించారు. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన పలు రకాల వ్యాధులతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. రెండుసార్లు పంజాబ్ డీజీపీగా పనిచేసిన ఆయన.. అక్కడ ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలించి వేశారని పేరుపొందారు. 1995లో ఆయన ఐపీఎస్ నుంచి రిటైరయ్యారు. సివిల్ సర్వీసెస్లో ఆయన చేసిన సేవలకు గాను 1989లో ఆయనను ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ ప్రెసిడెంటుగా చేసిన గిల్, ఆ తర్వాత ఇండియన్ హాకీ ఫెడరేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. కార్డియాక్ ఆరిత్మియా కారణంగా సంభవించిన కార్డియాక్ అరెస్టుతో ఆయన మరణించారని సర్ గంగారామ్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. కొంత కాలంగా ఆయన తీవ్రమైన ఇషెమిక్ హార్ట్ డిసీజ్తోను, కిడ్నీ వ్యాధితోను బాధపడుతున్నారు. వాటితో పాటు ఉదరానికి సంబంధించిన ఒక సమస్యతో కూడా బాధపడి, దాన్నుంచి కోలుకుంటున్నారు. చివరకు కార్డియాక్ అరెస్టుతో మరణించారు.