breaking news
kotanka
-
వేడుకగా సుబ్రహ్మణ్యుడి కల్యాణం
గార్లదిన్నె : కోటంక సుబ్రహ్మణ్యేశ్వరుడి బ్రహ్మోత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. ఆదివారం స్వామివారి కల్యాణాన్ని అత్యంత వైభవంగా జరిపించారు. కల్యాణాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. -
నేడు సుబ్రహ్మణ్యుడి రథోత్సవం
గార్లదిన్నె : మండల పరిధిలోని కోటంక సుబ్రమణ్యస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామి వారి రథోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. రథోత్సవం తిలకించడానికి చుట్టు ప్రక్కల గ్రామాల నుంచే కాక జిల్లా నలుములాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. శుద్ధపౌర్ణమి సందర్భంగా ఉదయం నుంచే పలు పూజలు రాత్రి 8గంటలకు రథోత్సవం ప్రారంభం కానుంది. అలాగే ఆదివారం ఉదయం సుబ్రమణ్య స్వామి ఆలయంలో శ్రీవల్లీ, దేవసేన, శ్రీవారి కల్యాణం ఉంటుంది. రథోత్సవం సందర్భంగా స్వామిని దర్శించుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈడీ సుబ్రమణ్యం పేర్కొన్నారు. అలాగే అనంతపురం నుంచి ప్రత్యేక బస్సులు కోటంక ఆలయం వరకూ నడుపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.