breaking news
Korean diplomat
-
కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు
సియోల్: కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉభయ కొరియా దేశాలు పరస్పరం కవ్వింపు చర్యలకు దిగాయి. వివాదాస్పద సముద్ర సరిహద్దు వద్ద శుక్రవారం ఉదయం ఇరు దేశాల సైన్యాలు సముద్రంలోకి పెద్ద సంఖ్యలో ఆరి్టలరీ షెల్స్‌ను ప్రయోగించాయి. 2018లో కుదిరిన ఇంటర్–కొరియన్ మిలటరీ ఒప్పందాన్ని ఉత్తర కొరియా, దక్షిణ కొరియా ఉల్లంఘించాయి. తమ పశి్చమ సరిహద్దు వద్ద ఉత్తర కొరియా దాదాపు 200 ఆరి్టలరీ షెల్స్ ప్రయోగించిందని దక్షిణ కొరియా సైనికాధికారులు వెల్లడించారు. ఉత్తర కొరియా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని, శాంతికి విఘాతం కలిగిస్తోందని ఆరోపించారు. గత ఏడాది కాలంలో కిమ్ జోంగ్ ఉన్ సైన్యం ఈ స్థాయిలో ఫైరింగ్‌కు పాల్పడడం ఇదే మొదటిసారి. ఉత్తర కొరియాకు దక్షిణ కొరియా సైన్యం సైతం ధీటుగా బదులిచి్చంది. ఆరి్టలరీ షెల్స్ ప్రయోగించింది. తాజా ఘటనతో రెండు దేశాల నడుమ ఉద్రిక్తతలు పెచ్చరిల్లే ప్రమాదం కనిపిస్తోంది. ఆయుధ పరీక్షలను ఉత్తర కొరియా మరింత ఉధృతం చేసే అవకాశం ఉందంటున్నారు. కొరియా ద్వీపకల్ప పశి్చమ తీరంలో సముద్ర సరిహద్దును పూర్తిగా నిర్ధారించలేదు. ఇక్కడ ఘర్షణలు జరగడం పరిపాటిగా మారింది. 1999, 2002, 2009, 2010లో రెండు దేశాల నడుమ కాల్పులు చోటుచేసుకున్నాయి. -
నగరంలో హిందూస్తాన్ ఇంటర్నేషనల్ స్కూల్!
- నర్సరీ టూ ఆరు వరకు తరగతులు - నేటి నుంచి అడ్మిషన్లు సాక్షి, చెన్నై : రాష్ట్ర రాజధాని నగరంలో హిందూస్తాన్ గ్రూప్ విద్యా సంస్థకు చెందిన ఇంటర్నేషనల్ స్కూల్‌ను శుక్రవారం ఏర్పాటు చేశారు. కొరియ రాయబారి క్యూంగ్సూ కిం ఈ స్కూల్‌ను లాంఛనంగా ప్రారంభించారు. విద్యారంగంలో హిందూస్తాన్ గ్రూప్ దూసుకెళ్తోన్న విషయం తెలిసిందే. ఈ గ్రూపు పరిధిలో నావిగేషన్, ఇంజినీరింగ్ తదితర విద్యాలయాలెన్నో ఉన్నాయి. ఉన్నత విద్యారంగంలో మెరుగైన సేవల్ని అందిస్తూ ముందుకు సాగుతున్న ఈ గ్రూప్ అంతర్జాతీయ ప్రమాణాలతో నర్సరీ నుంచే విద్యార్థులకు విద్యనందించడమే లక్ష్యంగా ఇంటర్నేషనల్ స్కూల్‌ను ఏర్పాటు చేసింది. సెయింట్ థామస్ మౌంట్లోని హిందూస్థాన్ కార్యాలయ ఆవరణలో ఎకరా విస్తీర్ణంలో ఈ స్కూల్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఇంటర్నేషనల్ స్కూల్‌ను కొరియ రాయబారి క్యూంగ్ సూ కిం ప్రారంభించారు. హిందూస్తాన్ విద్యా సంస్థల సేవల్ని గుర్తుచేస్తూ తన ప్రసంగంలో క్యూంగ్ సూ కిం ప్రశంసలతో ముంచెత్తారు. విదేశాల్లోని విద్యావిధానం, ఉద్యోగ అవకాశాల్ని గుర్తుచేశారు. హిందూస్తాన్ గ్రూప్ చైర్పర్సన్ ఎలిజబెత్ వర్గీస్ మాట్లాడుతూ తన భర్త దివంగత కేసీజీ వర్గీస్ ఓ సామన్యుడని గుర్తుచేశారు. ఆయన నాటిన ఈ విద్యా సంస్థ నేడు మహా వృక్షంగా అవతరించిందని పేర్కొన్నారు. ఆయన పడ్డ శ్రమకు, సమాజ హితాన్ని కాంక్షిస్తూ ఆయన చేసిన సేవల్ని తాము కొనసాగిస్తూ వస్తున్నామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను చిన్న నాటి నుంచి విద్యార్థులకు అందించడమే లక్ష్యంగానే ఇంటర్నేషనల్ స్కూల్‌ను ఏర్పాటు చేశామని వివరించారు. నర్సరీ నుంచి ఆరో తరగతి వరకు ఈ స్కూల్లో విద్యాబోధనను అందించనున్నామని, కాల క్రమేనా పదో తరగతి వరకు విస్తరణ జరుగుతుందన్నారు. శనివారం నుంచి అడ్మిషన్లు ఆరంభం కానున్నాయని ప్రకటిస్తూ, అనుభవజ్ఞులైన అధ్యాపకుల్ని ఈ స్కూల్లో పనిచేయడానికి ఎంపికచేసినట్టు తెలిపారు. హిందూస్తాన్ గ్రూప్ డెరైక్టర్, సీఈవో ఆనంద్ జాకబ్ వర్గీస్, డెరైక్టర్ అశోక్ వర్ధన్, ఆ స్కూల్ ప్రిన్స్‌పాల్ రేనుదత్తా పాల్గొన్నారు.