breaking news
kodajuturu
-
పరిశ్రమల పేరుతో భూదందా
– కొండజూటూరులో కెమికల్ ఫ్యాక్టరీ వద్దు – సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పాణ్యం: పరిశ్రమల పేరుతో పేదల భూములు లాక్కొంటూ తన అనుచరులకు సీఎం చంద్రబాబు నాయుడు కట్టబెడుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆరోపించారు. బుధవారం మండల పరిధిలోని కొండజూటూరు గ్రామంలో పంట పొలాలను ఆయన పరిశీలించారు. గ్రామ సమీపంలో శాంతిరాం నిర్మించ తలపెట్టిన నానో కెమికల్ పరిశ్రమను తాత్కలింకంగా కాకుండా శాశ్వతంగా విరమించుకోవాలన్నారు. పచ్చటి గ్రామంలో కెమికల్ ఫ్యాక్టరీ పెట్టి.. ప్రజలను, పాడి పశువులను నాశనం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. గ్రామం కంఠంగా పిలుచుకోనే ప్రభుత్వ భూములను గ్రామస్తుల అనుమతి లేకుండా కెమికల్ పరిశ్రమకు ఎలా కట్టబెడతారని ప్రశ్నించారు. పరిశ్రమలు వస్తే రాష్ట్రం బాగుపడుతుందనే భ్రమను సీఎం చంద్రబాబు వీడాలన్నారు. ఇప్పటికే ఓర్వకల్లు మండలంలో దాదాపుగా 7500 ఎకరాల భూమిని పరిశ్రమలకు కేటాయించినట్లు ప్రభుత్వం ప్రకటన చేసిందన్నారు. అరకొర పరిహారం రైతులకు ఇచ్చి రాష్ట్రవ్యాప్తంగా 4.70లక్షల ఎకరాల భూమిని బలవంతంగా లాక్కున్నారన్నారు. పరిశ్రమలు పేరుతో సీఎం ఏమి చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. కొండజూటూరు గ్రామంలో పరిశ్రమకు కేటాయించిన 150 ఎకరాల భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో ధర్నాలు చేపడతామన్నారు. ప్రభుత్వం 150 ఎకరాలు ఇస్తే యజమాన్యంఅదనంగా మరో 150 ఎకరాలను దౌర్జన్యంగా తీసుకున్నదని.. ఇది మంచి పద్ధతి కాదన్నారు. తక్షణమే ఆ స్థలంలో గ్రామస్తులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం వడ్డుగండ్ల, జూటూరు చెరువులను పరిశీలించారు. కార్యకమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు షడ్రక్, జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, నాయకులు రామకష్ణ, ఉసేన్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
మా అందరిపై కేసులు పెట్టండి
– పోలీసు చర్యలను నిరసిస్తూ కొండజూటూరు వాసులు స్టేషన్ ఎదుట బైఠాయింపు పాణ్యం: కొండజూటూరు గ్రామ సమీపంలో శాంతిరాం నానో కెమికల్ పరిశ్రమ ఏర్పాటులో భాగంగా ఈనెల 14న కలెక్టర్ విజయమోహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం రణరంగంగా మారింది. గ్రామస్తులు ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ వాహనాలపై రాళ్లు విసిరారు. దీన్ని పోలీసులు సుమోటోగా తీసుకొని గ్రామస్తులపైన 8మందిపై కేసులు నమోదు చేయడానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగా గ్రామ పెద్దలను పోలీస్ స్టేషన్‌కు రమ్మని పిలిపించడంతో ఊరి జనమంతా మంగళవారం రాత్రి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఆ రోజు నిరసన కార్యక్రమంలో తామందరం పాల్గొన్నామని, అందరిపై నమోదు చేయాలని లేదంటే ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. గ్రామ పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని పోలీసులు చెప్పినా శాంతించలేదు. గంటకు పైగా స్టేషన్ ఎదుటనే బైఠాయించి పోలీసుల తీరుపై నిరసన తెలిపారు. ప్రజాభిప్రాయసేకరణ సమావేశానికి సంబంధించిన వీడియోను గ్రామంలో చూపించిన తర్వాతే బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని సీఐ పార్థసారథిరెడ్డి, ఎస్ఐ మురళీమోహన్రావు నచ్చజెప్పేందుకు యత్నించారు. జిల్లా అధికారులు కుట్రపన్ని తమపై అక్రమ కేసులు పెడితే సహించేది లేదని మహిళలు, గ్రామస్తులు హెచ్చరిస్తూ ఆందోళన విరమించారు.