breaking news
Kirkuk
-
ఐఎస్ ఉగ్రవాదులకు ఎదురుదెబ్బ
బాగ్దాద్: ఇరాక్‌లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు భారీ నష్టం కలిగింది. కిర్కుక్ నగరంలో ఇరాక్ భద్రత దళాలు చేసిన మెరుపు దాడిలో కనీసం 48 మంది ఐఎస్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ విషయాన్ని ఐఎస్ గ్రూపుతో పాటు కిర్కుక్ నగరం పోలీస్ చీఫ్ నిర్ధారించారు. కిర్కుక్ నగరంలో ప్రజల ఇళ్లల్లోకి చొరబడ్డ ఐఎస్ ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు ప్రత్యేక కౌంటర్ టెర్రరిజం, ఇంటలిజెన్స్ దళాలు రంగంలోకి దిగి చుట్టుముట్టాయి. భద్రత దళాలు కొందరు ఉగ్రవాదులను కాల్చిచంపగా, మరికొందరు ఉగ్రవాదులు వారంతటవారే బాంబులతో పేల్చేసుకున్నట్టు బ్రిగేడియర్ జనరల్ ఖట్టబ్ ఒమర్ చెప్పారు. బాగ్దాద్‌కు ఉత్తరాన 240 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిర్కుక్ నగరంలో భద్రత దళాలకు, ఉగ్రవాదులకు మధ్య భీకర పోరు సాగుతోంది. ఐఎస్ దాడుల్లో కనీసం 46 మంది మరణించినట్టు ఇరాక్ అంతర్గత వ్యవహారాల శాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. వీరిలో ఎక్కువగా భదత్ర సిబ్బంది ఉన్నారని తెలిపారు. ఈ ప్రాంతాన్ని భద్రత బలగాలు అదుపులోకి తీసుకున్నా, ఇంకా కొన్ని ప్రాంతాల్లో జిహాదీలు దాక్కున్నట్టు చెప్పారు. -
ఐఎస్ చెర నుంచి 200 మంది బందీలు విడుదల
బాగ్దాద్: గతంలో అపహరించిన ఇజ్ది తెగకు చెందిన దాదాపు 200 మందిని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ విడుదల చేసిందని స్థానిక మీడియా వెల్లడించింది. బాగ్దాద్‌కు 250 కిలోమీటర్లు దూరంలోని కిరిక్ పట్టణంలో వీరిందరిని శనివారం వదిలిపెట్టారని తెలిపింది. పట్టణంలోని వివిధ ఆసుపత్రుల్లో వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. విడుదలైన బందీలలో అత్యధికులు వృద్ధులు ఉన్నారు. గత ఏడాది ఆగస్టులో సింజర్ పట్టణంలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఇజ్ది తెగకు చెందిన వారిపై దాడి చేసి చంపారు. అనంతరం వందలాది మందిని అపహరించుకుని పోయిన సంగతి తెలిసిందే. గతేడాది జూన్ 10వ తేదీ నుంచి ఇరాక్‌లో ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు నరమేథం సృష్టిస్తున్నా విషయం విదితమే.