breaking news
Kharif loans
-
కౌంటర్ తెరవలే..!
♦ 26 బ్యాంకు శాఖల్లో షురూ కాని పంట రుణ మంజూరు ప్రక్రియ ♦ 12 శాతం దాటని ఖరీఫ్ రుణాలు ♦ జిల్లాలో 33 శాతం పూర్తయిన సాగు విస్తీర్ణం ♦ ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతన్నలు జిల్లాలోని బ్యాంకు శాఖలు 255 ఖరీఫ్ సీజను పంట రుణ మంజూరు లక్ష్యం రూ.1,560.82 కోట్లు మంజూరు చేసిన రుణం రూ.172.65 కోట్లు (11 శాతం) రుణ మంజూరు ప్రక్రియను షురూ చేయనివి : 26 బ్యాంకు శాఖలు ఖరీఫ్ సాగు విస్తీర్ణం అంచనా 4.89 లక్షల ఎకరాలు ఇప్పటి వరకు అయిన సాగు 1.33 లక్షల ఎకరాలు (31శాతం) సాక్షి, నిజామాబాద్: బ్యాంకర్ల తీరు మారడం లేదు. రైతన్నలకు పంట రుణాల మంజూరులో ఆలసత్వం వీడటం లేదు. జిల్లాలో ఖరీఫ్ సాగు మూడో వంతు పూర్తయినప్పటికీ, 26 బ్యాంకుల శాఖలు ఇప్పటి వరకు పంట రుణాల మంజూరు ప్రక్రియను అసలు షురూ చేయలేదంటే రైతుల పట్ల బ్యాంకర్ల తీరును అర్థం చేసుకోవచ్చు. మరికొన్ని బ్యాంకుల శాఖలు సైతం నామమాత్రంగా రుణం మంజూరు చేశాయి. జిల్లాలో ఖరీఫ్ పనులు ఊపందుకున్నాయి. బోధన్, వర్ని తదితర మండలాల్లో పక్షం రోజుల క్రితమే వరి నాట్లు వేసుకున్నారు. ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల పరిధిలో సోయా, పసుపు వంటి పంటలు విత్తుకున్నారు. ఈ సీజనులో 4.89 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా కాగా, ఇప్పటికే 33 శాతం (1.33 లక్షల ఎకరాల్లో) పంటలు వేసుకున్నారు. కానీ పంట రుణాలు మాత్రం 12 శాతానికి మించలేదు. ఈసారి ఖరీఫ్‌లో సుమారు 2.38 లక్షల మంది రైతులకు రూ.1,560.82 కోట్ల మేరకు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. కానీ జూన్ నెలాఖరు వరకు కేవలం 26 వేల మంది రైతులకు రూ.172.65 కోట్లు మాత్రమే రుణం ఇవ్వగలిగారు. అంటే ఖరీఫ్ పనులు ప్రారంభమై నెల రోజులు దగ్గర పడుతున్నప్పటికీ కనీసం 12 శాతం కూడా రుణాలు ఇవ్వలేదన్నట్లు స్పష్టమవుతోంది. ఏటా జూన్ నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు బ్యాంకులు ఖరీఫ్ రుణాలు మంజూరు చేస్తాయి. అయితే నిర్దేశించిన గడువులో నెల రోజులు ముగిసినప్పటికీ రుణ మంజూరు ప్రక్రియ ఊపందుకోకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వడ్డీ వ్యాపారులే దిక్కు.. ఎప్పటిలాగే ఈసారి కూడా ఖరీఫ్ సాగు అవసరాల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించక తప్పడం లేదు. చాలా చోట్ల రైతులు వరి నాట్లు వేసుకుంటున్నారు. ఇందులో దుక్కులు దున్నడం కోసం ట్రాక్టర్, అరక ఖర్చులకు డబ్బులు అవసరం ఉంటాయి. అలాగే ఎరువులు, విత్తనాల కొనుగోలుకు పెట్టుబడులు కావాలి. వీటికి తోడు కూలీలకు డబ్బులు చెల్లించాల్సిన అవసరం తప్పనిసరి. ఈ పరిస్థితుల్లో బ్యాంకులు రుణాలివ్వక పోవడంతో రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు రుణ ప్రక్రియ ప్రారంభించని బ్యాంకుల పరిధిలోని రైతుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఆన్లైన్ పహణీలతోనే ఇబ్బందిగా ఉంది పంటరుణాలు తీసుకోవడమేమోగాని, ఆన్లైన్ పహణీలతోనే రైతులకు తీవ్ర ఇబ్బంది ఉంది. వేల్పూర్ మండలంలో చాలా మంది రైతులకు సంబంధించి ఆన్లైన్లో భూముల వివరాలు ఉండడం లేదు. ఆన్లైన్ పహణీ లేకుంటే బ్యాంకు వారు ఒప్పుకోవడం లేదు. బ్యాంకు వారిని ఎంతో బతిమాలితే రాతపూర్వక పహణీకి ఒప్పుకుంటున్నారు. రాత పూర్వక పహణీ కోసం కనీసం నాలుగైదు రోజుల సమయం తీసుకుంటోంది. వీఆర్వోలకు రెవెన్యూ సర్వే ఉండడం వల్ల వారు సర్వేకే వెళ్తున్నారు. ఆన్లైన్ పహణీలే ప్రధాన సమస్యగా మారింది. దీనికి తోడు పచ్చలనడ్కుడ గ్రామీణ బ్యాంకులో మేనేజరు లేక రుణాల ప్రక్రియ ఆగిపోయింది. ఇటీవల ఒక అధికారిని ఇన్చార్జిగా పంపించారు. భూములకు ఆన్లైన్ సమస్యను తీర్చడానికి జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలి. – నవీన్‌రెడ్డి, రైతు,వాడి మేనేజరు లేక సతమతం వేల్పూర్ ఎస్బీహెచ్ బ్యాంకు మేనేజరు బదిలీ అయి సుమారు నెలరోజులవుతోంది. కొత్త మేనేజరు ఇంతవరకు రాలేదు. సిబ్బంది తక్కువగా ఉన్నారు.పంట రుణాల రెన్యూవల్‌కు చాలా సమయం తీసుకుంటోంది. పంటరుణం రెన్యూవల్ చేయించుకోవడం రైతులకు కష్టంగా మారింది. గంటల తరబడి బ్యాంకులో ఉండాల్సి వస్తోంది. భూములకు సంబంధించి ఎటువంటి తాకట్టు లేదని నిరూపించుకోడానికి మీసేవా నుంచి ఈసీ తెమ్మంటున్నారు. ఇది అదనంగా రైతులకు భారంగా మారింది. మేనేజరును, సిబ్బందిని నియమించి, పంటరుణాలు తొందరగా రెన్యూవల్ చేయాలి. – గడ్డం సత్యం. రైతు, వేల్పూర్ -
కౌంటర్ తెరవలే..!
► 26 బ్యాంకు శాఖల్లో షురూ కాని పంట రుణ మంజూరు ప్రక్రియ ► 12 శాతం దాటని ఖరీఫ్ రుణాలు ► జిల్లాలో 33 శాతం పూర్తయిన సాగు విస్తీర్ణం ► ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతన్నలు సాక్షి, నిజామాబాద్: బ్యాంకర్ల తీరు మారడం లేదు. రైతన్నలకు పంట రుణాల మంజూరులో ఆలసత్వం వీడటం లేదు. జిల్లాలో ఖరీఫ్ సాగు మూడో వంతు పూర్తయినప్పటికీ, 26 బ్యాంకుల శాఖలు ఇప్పటి వరకు పంట రుణాల మంజూరు ప్రక్రియను అసలు షురూ చేయలేదంటే రైతుల పట్ల బ్యాంకర్ల తీరును అర్థం చేసుకోవచ్చు. మరికొన్ని బ్యాంకుల శాఖలు సైతం నామమాత్రంగా రుణం మంజూరు చేశాయి. జిల్లాలో ఖరీఫ్ పనులు ఊపందుకున్నాయి. బోధన్, వర్ని తదితర మండలాల్లో పక్షం రోజుల క్రితమే వరి నాట్లు వేసుకున్నారు. ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల పరిధిలో సోయా, పసుపు వంటి పంటలు విత్తుకున్నారు. ఈ సీజనులో 4.89 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా కాగా, ఇప్పటికే 33 శాతం (1.33 లక్షల ఎకరాల్లో) పంటలు వేసుకున్నారు. కానీ పంట రుణాలు మాత్రం 12 శాతానికి మించలేదు. ఈసారి ఖరీఫ్‌లో సుమారు 2.38 లక్షల మంది రైతులకురూ.1,560.82 కోట్ల మేరకు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. కానీ జూన్ నెలాఖరు వరకు కేవలం 26 వేల మంది రైతులకు రూ.172.65 కోట్లు మాత్రమే రుణం ఇవ్వగలిగారు. అంటే ఖరీఫ్ పనులు ప్రారంభమై నెల రోజులు దగ్గర పడుతున్నప్పటికీ కనీసం 12 శాతం కూడా రుణాలు ఇవ్వలేదన్నట్లు స్పష్టమవుతోంది. ఏటా జూన్ నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు బ్యాంకులు ఖరీఫ్ రుణాలు మంజూరు చేస్తాయి. అయితే నిర్దేశించిన గడువులో నెల రోజులు ముగిసినప్పటికీ రుణ మంజూరు ప్రక్రియ ఊపందుకోకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వడ్డీ వ్యాపారులే దిక్కు.. ఎప్పటిలాగే ఈసారి కూడా ఖరీఫ్ సాగు అవసరాల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించక తప్పడం లేదు. చాలా చోట్ల రైతులు వరి నాట్లు వేసుకుంటున్నారు. ఇందులో దుక్కులు దున్నడం కోసం ట్రాక్టర్, అరక ఖర్చులకు డబ్బులు అవసరం ఉంటాయి. అలాగే ఎరువులు, విత్తనాల కొనుగోలుకు పెట్టుబడులు కావాలి. వీటికి తోడు కూలీలకు డబ్బులు చెల్లించాల్సిన అవసరం తప్పనిసరి. ఈ పరిస్థితుల్లో బ్యాంకులు రుణాలివ్వక పోవడంతో రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు రుణ ప్రక్రియ ప్రారంభించని బ్యాంకుల పరిధిలోని రైతుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఆన్లైన్ పహణీలతోనే ఇబ్బందిగా ఉంది పంటరుణాలు తీసుకోవడమేమోగాని, ఆన్లైన్ పహణీలతోనే రైతులకు తీవ్ర ఇబ్బంది ఉంది. వేల్పూర్ మండలంలో చాలా మంది రైతులకు సంబంధించి ఆన్లైన్లో భూముల వివరాలు ఉండడం లేదు. ఆన్లైన్ పహణీ లేకుంటే బ్యాంకు వారు ఒప్పుకోవడం లేదు. బ్యాంకు వారిని ఎంతో బతిమాలితే రాతపూర్వక పహణీకి ఒప్పుకుంటున్నారు. రాత పూర్వక పహణీ కోసం కనీసం నాలుగైదు రోజుల సమయం తీసుకుంటోంది. వీఆర్వోలకు రెవెన్యూ సర్వే ఉండడం వల్ల వారు సర్వేకే వెళ్తున్నారు. ఆన్లైన్ పహణీలే ప్రధాన సమస్యగా మారింది. దీనికి తోడు పచ్చలనడ్కుడ గ్రామీణ బ్యాంకులో మేనేజరు లేక రుణాల ప్రక్రియ ఆగిపోయింది. ఇటీవల ఒక అధికారిని ఇన్చార్జిగా పంపించారు. భూములకు ఆన్లైన్ సమస్యను తీర్చడానికి జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలి. – నవీన్‌రెడ్డి, రైతు,వాడి మేనేజరు లేక సతమతం వేల్పూర్ ఎస్బీహెచ్ బ్యాంకు మేనేజరు బదిలీ అయి సుమారు నెలరోజులవుతోంది. కొత్త మేనేజరు ఇంతవరకు రాలేదు. సిబ్బంది తక్కువగా ఉన్నారు.పంట రుణాల రెన్యూవల్‌కు చాలా సమయం తీసుకుంటోంది. పంటరుణం రెన్యూవల్ చేయించుకోవడం రైతులకు కష్టంగా మారింది. గంటల తరబడి బ్యాంకులో ఉండాల్సి వస్తోంది. భూములకు సంబంధించి ఎటువంటి తాకట్టు లేదని నిరూపించుకోడానికి మీసేవా నుంచి ఈసీ తెమ్మంటున్నారు. ఇది అదనంగా రైతులకు భారంగా మారింది. మేనేజరును, సిబ్బందిని నియమించి, పంటరుణాలు తొందరగా రెన్యూవల్ చేయాలి. – గడ్డం సత్యం. రైతు, వేల్పూర్ -
బ్యాంకుల్లో డబ్బుల్లేవ్
♦ రుణ పంపిణీలో ఇబ్బందులు.. ♦ లక్ష్యం కొండంత.. పంపిణీ గోరంత.. ♦ అప్పుల కోసం అన్నదాత అగచాట్లు.. ♦ పట్టించుకోని బ్యాంకర్లు.. ఆదిలాబాద్‌టౌన్: ఖరీఫ్ బ్యాంకు రుణాల పంపిణీలో నత్తేనయం అన్నట్లు ఉంది. ఈ సీజన్లో సకాలంలో వర్షాలు కురిసినప్పటికీ బ్యాంకు రుణాలు అందకపోవడంతో అన్నదాతలు అగచాట్లు పడాల్సి వస్తోంది. బ్యాంకుల ముందు రోజు గంటల తరబడి వేచి ఉంటున్నా డబ్బులు చేతికి అందని దుస్థితి నెలకొంది. జిల్లాలోని చాలా బ్యాంకుల్లో నో క్యాష్ బోర్డు దర్శనమిస్తోంది. అవసరమైన మేరకు నగదు లేకపోవడం.. ఇచ్చే అరకొర రుణాలు కూడా ఖాతాలో జమ చేస్తున్నారు. ఏటీఎంలలో సైతం డబ్బులు లేకపోవడంతో అన్నదాతల కష్టాలు వర్ణణాతీతం. గత ఏడాది కంటే ఈ ఏడాది 42 శాతం రుణ లక్ష్యం పెంచినప్పుటికీ పంపిణీ నత్తనడకన సాగుతుండడంతో కష్టాలు తప్పడం లేదు.. జిల్లాలో.. జిల్లాలో లక్షా 40 వేల మంది రైతులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 96 గ్రామీణ ప్రాంత బ్యాంకులు ఉన్నాయి. గత ఏడాది ఖరీఫ్ పంట రుణ లక్ష్యం రూ.842.30 కోట్లు కాగా ఈ ఏడాది వార్షిక ప్రణాళిక రుణ లక్ష్యం రూ.1328.53 కోట్లు.. ఇప్పటి వరకు కేవలం రూ.115 కోట్లు పంపిణీ చేశారు. గత ఏడాది కంటే ఈ ఏడాది రూ.400 కోట్ల వరకు పెంచినప్పటికీ రుణ పంపిణీ ముందుకు సాగడం లేదు. ఈ ఏడాది కనీసం 50 శాతం కూడా పూర్తవుతుందో లేదోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది కూడా పూర్తి స్థాయిలో బ్యాంకు రుణాలు పంపిణీ చేయలేదు. రుణæ పంపిణీ కాగితాల్లోనే కనిపిస్తోంది. పంపిణీ చేసేదెప్పుడు.. ఇప్పటికే 60 శాతం పైగా రైతులు పంటలు విత్తుకున్నారు. బ్యాంకు రుణాలు ఇవ్వకపోవడంతో దళారులను ఆశ్రయించి అధికవడ్డీకి డబ్బులు తీసుకుంటున్నారు. జిల్లాలో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్నప్పటికీ బ్యాంకు రుణం జాప్యం అవుతోంది. ఇప్పటికే వేసిన విత్తనాలు మొలకెత్తాయి. ఎరువులు, కలుపు, ఇతర పనుల కోసం డబ్బులు అవసరం ఉండగా.. చేతిలో చిల్లి గవ్వ లేకపోవడంతో మొలకెత్తుతున్న పంటను చూస్తూ దిగాలు పడడమే తప్ప ఏమీ చేయని పరిస్థితి నెలకొంది. వాస్తవంగా ప్రతి ఖరీఫ్ సీజన్లో జూన్ నుంచి మొదలు పెడితే జూలై నెలాఖరు వరకు రైతులకు పూర్తి స్థాయిలో డబ్బులు ఇచ్చే వారు కానీ ఈసారి అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. కొంత మొత్తంలోనే నగదు జిల్లాలోని చాలా బ్యాంకుల్లో నోక్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు రుణాల పంపిణీ ప్రారంభించినప్పటికీ కొంత మొత్తంలోనే డబ్బులను ఇస్తున్నారు. మిగతావి అకౌంట్లలో జమ చేస్తున్నారు. రుణ పంపిణీలో గ్రామీణ బ్యాంకులు కొంచెం ముందు వరుసలో ఉన్నా, సహకార బ్యాంకులు 20 శాతం కూడా పంపిణీ చేయలేదు. మరికొన్ని బ్యాంకులు ఇప్పుడిప్పుడే రుణాలను ప్రారంభిస్తున్నాయి. ఏటీఎంలలో సైతం డబ్బులు అందుబాటులో లేవు. ఒక్కో రైతు ఐదారు సార్లు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. 2017–18 సంవత్సరానికి గానూ బ్యాంకుల వార్షిక ప్రణాళికను రెండు, మూడు రోజుల క్రితం అధికారులు ప్రకటించారు. తెలంగాణ గ్రామీణ బ్యాంకు లక్ష్యం రూ.251.39 కోట్లు, సహకార బ్యాంకు రూ.149.43 కోట్లు, ఎస్బీఐ రూ.289.39 కోట్లు, మహారాష్ట్ర బ్యాంకు రూ.96.80 కోట్లు, ఆంధ్రాబ్యాంకు రూ.78.68 కోట్లు, ఇతర బ్యాంకులు రూ.443.53 కోట్లు రుణాలు అందించేందుకు లక్ష్యం ప్రకటించారు. గత ఏడాది కంటే 42 శాతం పెంచినా అందించే లక్ష్యం ముందుకు సాగడం లేదు. రెండు విడతల్లో రూ.30 వేలు.. నాకు ఎనిమిది ఎకరాల వ్యవసాయం ఉంది. ఇచ్చోడలోని దక్క¯Œన్ గ్రామీణ బ్యాంకు వ్యవసాయ రుణం రూ.లక్షా 30 వేలు మంజూరు చేసింది. ఇప్పటి వరకు రెండు విడతల్లో రూ.30 వేలు మాత్రమే ఇచ్చింది. మిగతా డబ్బుల కోసం చెప్పులరిగేలా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న. అధికారులు స్పందించి రుణాలు త్వరగా ఇప్పిస్తే మంచిగుంటది. – నాందేవ్, గ్రామం : కిన్నెరపల్లి, మం : బజార్హత్నూర్ 15 రోజులుగా బ్యాంకు చుట్టూ తిరుగుతున్న.. ఇచ్చోడలోని దక్కన్ గ్రామీణ బ్యాంకు చుట్టూ రుణం కోసం తిరుగుతున్న. నాకు రూ.30 వేల రుణం మంజూరు కాగా ఇప్పటి వరకు రూ.10 వేలు మాత్రమే ఇచ్చారు. రూ.20 వేల కోసం గత 15 రోజులుగా బ్యాంకుకు తిరుగుతున్న. అధికారులు పట్టించుకోవడం లేదు. రేపు మాపు అనడంతో ఎవుసం కోసం డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న. – ఇక్బాల్, గ్రామం : గుండాల, మం : ఇచ్చోడ -
63% మించని ఖరీఫ్ రుణాలు
రుణమాఫీ జాప్యం వల్లేనన్న రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి రబీలో 96% పంట రుణాలు వ్యవసాయ రుణ బకాయిలు రూ. 13,629 కోట్లు సాక్షి, హైదరాబాద్: రుణమాఫీ మొదటి విడత సొమ్మును సర్కారు ఆలస్యంగా విడుదల చేయడం వల్లే గత ఖరీఫ్‌లో రైతులకు పంట రుణాలు ఇవ్వడంలో వెనుకబడ్డామని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) సమావేశం అభిప్రాయపడింది. సోమవారం హైదరాబాద్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) కార్యాలయంలో జరిగిన ఎస్ఎల్బీసీ సమావేశంలో వ్యవసాయశాఖ మం త్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొం డయ్య, ఎస్బీహెచ్ ఎండీ ముఖర్జీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన నివేదికలో రుణప్రణాళికను సమీక్షించారు. గత సెప్టెంబర్ వరకు రుణమాఫీ మొదటి విడత సొమ్మును విడుదల చేశారని... దీంతో రైతు లు రుణాలు తీసుకోవడానికి వీలు కాలేదని వివరించారు. గత ఖరీఫ్ పంట రుణ లక్ష్యం రూ. 12,389.70 కోట్లు కాగా కేవలం రూ.7,816.84 కోట్లు(63.09%) మేర రుణాలు ఇచ్చామని నివేదికలో వెల్లడించారు. ఎస్ఎల్బీసీ నివేదికాంశాలివీ... రబీలో రూ. 6,328.25 కోట్లు లక్ష్యం నిర్దేశిం చుకోగా... గత డిసెంబర్ 31 నాటికి రూ. 6,109.77 కోట్లు (96.55%) ఇచ్చామన్నారు. ఖరీఫ్, రబీ పంట రుణాల మొత్తం లక్ష్యం రూ. 18,717.95 కోట్లు కాగా... రూ. 13,926.61 కోట్లు (74.40%) ఇచ్చినట్లు వెల్లడించారు. ఇవిగాక వ్యవసాయ టర్మ్ రుణాల లక్ష్యం రూ. 6,238.48 కోట్లు కాగా... గత డిసెంబర్ నాటికి రూ. 3,885.84 కోట్లు (62.29%) ఇచ్చారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ. 2,277.16 కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా... గత డిసెంబర్ నాటికి రూ. 4,177.02 కోట్లు (183.43%) ఇచ్చారు. అనుకున్న లక్ష్యం కంటే అత్యధికంగా ఇచ్చినట్లు పేర్కొన్నారు. మొత్తంగా అన్నీ కలుపుకొని వ్యవసాయ రుణాలు 80.74 శాతం ఇచ్చినట్లు వివరిం చారు. ఇవిగాక విద్యారుణాల లక్ష్యం 2014-15లో రూ. 662.52 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా... గత డిసెంబర్ నాటికి రూ. 317.16 కోట్లు (47.8%) ఇచ్చా రు. ఇంత తక్కువ విద్యా రుణాలు ఇవ్వడంపై ఎస్ఎల్బీసీ అసహనం వ్యక్తంచేసింది. బ్యాం కు బ్రాం చీలు విద్యా రుణాలను తిరస్కరించవద్దని విజ్ఞప్తి చేసింది. ఇంటి రుణాల లక్ష్యం రూ. 2,102.15 కోట్లు కాగా... గత డిసెంబర్ నాటికి రూ. 4,184.10 (199.04%) ఇవ్వడం గమనార్హం. అంటే 200 శాతం వరకు ఇచ్చారన్నమాట. మొత్తం అన్ని రుణాలు కలిపి 2014-15 రుణ ప్రణాళిక లక్ష్యం రూ. 63,047.62 కోట్లు కాగా... గత డిసెంబర్ నాటికి రూ. 84,339.35 కోట్లు (133.77%) ఇచ్చినట్లు ఎస్ఎల్బీసీ నివేదిక వెల్లడించింది. గత డిసెంబర్ నాటికి వ్యవసాయ రుణ బకాయిలు రూ. 13,629 వరకు ఉన్నాయని ఎస్ఎల్బీసీ నివేదిక స్పష్టంచేసింది. అందులో రూ. 4,431.14 కోట్లు నిరర్ధక ఆస్తులుగా గుర్తించినట్లు వివరించింది. ప్రభుత్వానికి మూడు ప్రాధాన్యాలు... రాష్ట్ర ప్రభుత్వానికి మూడు ప్రాధాన్యాలు ఉన్నాయని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎస్ఎల్బీసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేదల సంక్షేమం, వ్యవసాయరంగం, పరిశ్రమలపై కేంద్రీకరిస్తుందన్నారు. నెలకు రూ. 50 వేలకు పైగా మహిళలు సంపాదించే విధం గా కృషి చేస్తామన్నారు. పాలీహౌస్‌కు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్నారు. అందు లో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. 200 కోట్ల చేప విత్తనాలను సరఫరా చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామన్నా రు. ముందు గా 6 ప్రాజెక్టుల్లో పెలైట్ ప్రాజెక్టు కింద కేజ్ కల్చర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ మా ట్లాడుతూ రుణమాఫీలో ప్రభుత్వం విజయవంతమైందన్నారు. వచ్చేవారంలోగా రుణ మాఫీ ఎంతవరకు పూర్తి అయింది? ఎంత సొమ్ము మిగిలిందో వివరాలు ఇవ్వాలన్నారు. -
ఆర్బీఐ లేఖపై ఏపీ సర్కారు మల్లగుల్లాలు
-
ఆర్బీఐ లేఖపై ఏపీ సర్కారు మల్లగుల్లాలు
రీ షెడ్యూల్ అయితే గట్టెక్కొచ్చని భావించిన సర్కారు ప్రభుత్వంపై నమ్మకం లేక గత ఖరీఫ్ వివరాలు రాబట్టిన ఆర్బీఐ! సీఎంకు అందుబాటులోకి రాని ఆర్బీఐ గవర్నర్ హైదరాబాద్: రుణాల రీషెడ్యూల్‌పై రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నుంచి వచ్చిన తాజా లేఖతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. గత ఖరీఫ్ రుణాలు రీ షెడ్యూల్ అయితే రుణ మాఫీపై కొంతకాలం గట్టెక్కొచ్చన్న ఆలోచనలో ఉన్న ప్రభుత్వానికి ఆర్బీఐ లేఖ శరాఘాతంలా తగిలింది. రుణాలు రీషెడ్యూల్ అయితే వాటినే రుణ మాఫీకి ఉపయోగించుకోవచ్చని భావించిన ప్రభుత్వం ఇప్పుడు ఆర్బీఐకి ఏమి సమాధానమివ్వాలో తేల్చుకోలేకపోతోంది. రాష్ట్ర అర్థ గణాంక శాఖ నుంచి సేకరించిన పంటల దిగుబడి వివరాల ఆధారంగా గత ఖరీఫ్‌లో పంటల దిగుబడి సాధారణానికంటే 50 శాతానికి తగ్గలేదని, అందువల్ల ప్రకృతి వైపరీత్యంగా పరిగణించి రుణాల రీ షెడ్యూల్‌కు అనుమతి సాధ్యం కాదని ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ దీపావలి పంత్ జోషి ఆ లేఖలో స్పష్టంచేసిన విషయం తెలిసిందే. అయితే జోషి పేర్కొన్న పంటల దిగుబడి వివరాలు రాష్ట్ర ప్రభుత్వానికి చెందినవే అయినందున ఇప్పుడు ఆ సమాచారాన్ని ఖండించలేని పరిస్థితి నెలకొందని వ్యవసాయ శాఖ ఉన్నతస్థాయి వర్గాలు చెబుతున్నాయి. ఆర్బీఐ లేఖ చూస్తే రుణాల రీ షెడ్యూల్‌కు దారులు మూసుకుపోయినట్లేనని అధికారవర్గాలు అంటున్నాయి. ఆర్బీఐ గవర్నర్‌తో మాట్లాడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదని తెలిసింది. రుణ మాఫీ చేయకుండా కరువు, తుఫాను పేరుతో గత ఖరీఫ్‌లో రైతుల రుణాలు రీ షెడ్యూల్ చేసి చేతులు దులుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే అభిప్రాయం ఆర్బీఐ అధికారుల్లో గట్టిగా ఉందని, అందుకే రీ షెడ్యూల్ విషయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సమాచారం కోరుతోందని ఉన్నతాధికార వర్గాలు పేర్కొంటున్నారు. -
రుణాలేవి బాబూ..?
సాక్షి ప్రతినిధి, కర్నూలు: దేవుడు కరుణించినా.. పూజారి వరమివ్వని చందంగా మారింది రైతుల పరిస్థితి. జిల్లాలో రెండు రోజుల క్రితం ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఇప్పటికే వేసిన పైర్లు దెబ్బతినగా కొత్తగా విత్తనం వేయాలనుకునే వారికి రుణ సమస్య అడ్డువస్తోంది. రుణమాఫీపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు ఏ విషయం తేల్చలేదు. కమిటీలంటూ కాలయాపన చేస్తూ వస్తున్నారు. దీంతో రైతులకు ఖరీఫ్ రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు రావడం లేదు. గత శనివారం కర్నూలులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సైతం రుణమాఫీపై స్పష్టత ఇవ్వలేకపోయారు. రైతులకు ఆమోదయోగ్యంగా కొంత వరకు మాఫీ ఉంటుందని ప్రభుత్వ పెద్దల ఆలోచనను బయటపెట్టారు. వర్షాలు రానందున ఖరీఫ్ రుణాలు ఇవ్వలేదని, వానలు పడితే ఇప్పించే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో పలు మండలాల్లో 6,7 తేదీల్లో వర్షాలు కురిశాయి.. అయితే ప్రభుత్వం నుంచి రుణాల పంపిణీపై ఎటువంటి ప్రకటన రాలేదు. హామీ ఇచ్చిన మంత్రి కూడా దీనిపై నోరు మెదపడంలేదు. జూలై మొదటి వారానికే జిల్లాలో పొలాలన్నీ పచ్చని పైర్లతో కళకళలాడాల్సి ఉంది. ఈ సారి వర్షాభావ పరిస్థితులతో చేలన్నీ బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం వానలు పడటంతో వ్యవసాయ పనుల్లో రైతులు బిజీ అయ్యారు. ఈ పరిస్థితుల్లో రైతులకు అండగా ఉండి బ్యాంకుల చేత విరివిగా రుణాలు ఇప్పించాల్సిన ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంబిస్తోంది. రుణాలు మాఫీ కాక, అప్పులు దొరక్క రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటు వ్యక్తుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకుని సాగుకు సమాయత్తం అవుతున్నారు. అస్తులు జప్తు చేస్తాం.. జిల్లాలో 6,32,902 మంది రైతులు ఉన్నారు. ఇందులో గతేడాది 4 లక్షల మంది రైతులు బ్యాంకుల నుంచి పంట రుణాలు పొందారు. మరో 1.20 లక్షల మంది రైతులు బ్యాంకుల్లో బంగారం పెట్టి వ్యవసాయ రుణాలు తీసుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ అమలు అవుతుందనే ఉద్దేశంతో రైతులెవ్వరు రుణాలను చెల్లించలేదు. టీడీపీ ప్రభుత్వం ఏర్పాటై నెలరోజులవుతున్నా రుణాలపై స్పష్టత లేదు. రుణాలకు సంబంధించి నోటీసులు ఇవ్వొద్దని ప్రభుత్వం చెపుతున్నా.. బ్యాంకర్లు మాత్రం తమపని తాము చేసుకొని వెళ్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా రైతులకు నోటీసులు జారీ చేస్తున్నారు. మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండలంలో 450 మంది రైతులకు బ్యాంకర్లు నోటీసులు జారీ చేశారు. వెంటనే తీసుకున్న బకాయిలను చెల్లించాలని ఒత్తిళ్లు తెస్తున్నట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంత్రాలయం, ఎమ్మిగనూరు, ఆలూరు, కోడుమూరు తదితర ప్రాంతాల్లో రైతులకు ఫోన్లు చేసి రుణాలు చెల్లించాలని బ్యాంకర్లు ఒత్తిడి తెస్తున్నారు. ‘రుణమాఫీ కాదు. రీషెడ్యులు చేస్తే అప్పు భారం పెరుగుతుంది. వెంటనే తీసుకున్న అప్పు చెల్లించండి. లేకపోతే అపరాధ రుసుం, చక్రవడ్డీ వేస్తాం. అవసరమైతే ఆస్తులు జప్తు చేస్తాం’ అంటూ భయపెడుతున్నట్లు రైతులు ఆందోళన చెందుతున్నారు. -
త్వరలో ఖరీఫ్ రుణాలు
- రైతుల శ్రేయస్సే ప్రభుత్వ ఎజెండా - నాయకుల్లా కాదు.. సేవకుల్లా పనిచేస్తాం - మంత్రి హరీష్‌రావు వెల్లడి మెదక్: త్వరలో బ్యాంకుల ద్వారా రైతులకు ఖరీఫ్ రుణాలు ఇప్పిస్తామని, ఈ మేరకు రెండు, మూడు రోజుల్లో ప్రకటన చేయనున్నట్లు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి టి. హరీష్‌రావు ప్రకటించారు. గురువారం ఘనపురం కాల్వల ఆధునికీకరణ పనులను ప్రారంభించిన అనంతరం మెదక్‌లోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రూ.18వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేస్తున్నామని, దీంతో 35 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. మరోవైపు ఖరీఫ్ సీజన్ ఇప్పటికే ప్రారంభమైనందున త్వరలో కొత్త రుణాలు ఇప్పిస్తామన్నారు. గతంలో కేవలం రూ.3,318 కోట్ల రుణాలను మాత్రమే మాఫీ చేశారన్నారు. కాని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రా సీఎం చంద్రబాబులాగా ఎలాంటి కమిటీలు వేయకుండానే రుణమాఫీని ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. రైతుల శ్రేయస్సే తమ ఎజెండా అన్నారు. సాగునీటి రంగంలో జిల్లాకు పెద్ద పీట వేస్తామన్నారు. తెలంగాణలో వలసలు, రైతు ఆత్మహత్యలు అధికంగా చోటు చేసుకుంటున్నందునా ప్రాజెక్టులు నిర్మించి ప్రతి నీటిబొట్టును ఒడిసి పడతామని చెప్పారు. జైకా నిధులతో ఘనపురం కాల్వల ఆధునికీకరణ పనులు త్వరలో పూర్తి చేయిస్తామన్నారు. ప్రతి వారం పనుల అభివృద్ధిపై అధికారులతో రివ్యూ నిర్వహిస్తామన్నారు. గొలుసు చెరువులను పునరుద్ధరించి జలవనరులను అభివృద్ధి చేస్తామని చెప్పారు. మెదక్ మార్కెట్ యార్డ్‌లో సీసీ రోడ్లు, రైతుల విశ్రాంతి గృహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. వ్యాపారులు సహకరిస్తే షాపింగ్ కాంప్లెక్స్ కూడా నిర్మిస్తామన్నారు. నియోజకవర్గంలో ఐదు ఐకేపీ సెంటర్లకు రూ.1.25కోట్లు మంజూరు చేసినట్లు ప్రకటించారు. మంజీర నది వెంట పాదయాత్ర చేసి జలవనరుల వినియోగానికి అవసరమైన ప్రాజెక్టులను రూపొందిస్తామన్నారు. పాపన్నపేటలో మార్కెట్ కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ వెనకబడిన మెదక్ ప్రాంతంపై మంత్రి ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. గుండువాగు ప్రాజెక్టును పూర్తిచేయాలని, హల్దివాగుపై చెక్‌డ్యాం నిర్మించాలని, బొల్లారం మత్తడి నుంచి కోంటూర్ చెరువుకు ఎత్తిపోతలు చేపట్టాలన్నారు. నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ మంజీర నీరు జిల్లాకు అందేలా చూడాలన్నారు. ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ శరత్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించడం అభినందనీయమన్నారు. పారిశుద్ధ్య వారోత్సవాలు, బడిబాటను విజయవంతం చేసేందుకు అధికారులు కృషి చేయాలని కోరారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రపాల్ మాట్లాడుతూ మెదక్ మార్కెట్ కమిటీలోని ఉల్లి గోదాములను ఆధునికీకరించాలని, రైతుల విశ్రాంతి భవనాన్ని, షాపింగ్ కాంప్లెక్స్‌ను నిర్మించాలని కోరారు. సమావేశంలో ఆర్డీఓ వనజాదేవి పీఏసీఎస్ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, ఇరిగేషన్ సీఈ మధుసూదన్, జపాన్ దేశపు, జైకా ప్రతినిధి కామియ, జెడ్పీటీసీ లావణ్యరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు మల్లికార్జున్‌గౌడ్, ఏ.కృష్ణారెడ్డి, రాగి అశోక్, జీవన్‌రావు, మాజీ మంత్రి కుమారుడు కరణం సోమశేఖర్, మాజీ ఎంపీపీ పద్మారావు, ఎస్సీ సెల్ జిల్లా నాయకులు గంగాధర్, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు బాలాగౌడ్, విద్యావేత్త సుభాష్ చందర్‌గౌడ్, ఎంపీటీసీ గురుమూర్తిగౌడ్, టి.రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
అదనులో దన్ను దక్కేనా?
మండపేట, న్యూస్‌లైన్ :జిల్లాలో వరి, కొబ్బరి తదితర పంటలు సాగు చేసే రైతులు సుమారు ఆరు లక్షల మంది ఉండగా, వీరిలో 60 శాతానికి పైగా అంటే సుమారు 3.60 లక్షల మందికి పైగా కౌలు రైతులని అంచనా. వీరిలో చాలా మంది స్వయంగా పొలంలో దిగి చెమటోడ్చి కష్టించే వారే. వీరికి సాధారణ రైతులకులా రుణాలు, రాయితీలు, వడ్డీ మాఫీ పథకాలు, పంట నష్టపరిహారం అందకుండా పోతున్నాయి. అప్పులు చేసి సాగు చేయడం, తుపానులకు, వరదలకు పంట నష్టపోతే తిరిగి అప్పులు చేయడం సర్వసాధారణమవుతోంది. రుణ బాధ తాళలేక కొందరు ప్రాణత్యాగం చేసుకుంటున్న విషాదాలూ పరిపాటి అవుతున్నాయి. దీనిని గుర్తించిన దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి కౌలురైతులతో ఉమ్మడిగా పూచీ పడే బృందాలను (జేఎల్‌జీ) ఏర్పాటు చేసి రుణ సౌకర్యం కల్పించారు. ఆయన మృతితో జేఎల్‌జీ కొండెక్కిపోయింది. కౌలు రైతుల కోసం 2011లో ప్రభుత్వం కౌలుదారుల చట్టం తెచ్చింది. దీని ప్రకారం కౌలు రైతులకుగుర్తింపు కార్డులు మంజూరు చేయాలి. సాధారణ రైతుల్లా బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు చేయించడంతో పాటు సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు ఇవ్వాలి. అయితే అధికారులు, బ్యాంకర్ల నిర్లక్ష్యంతో ఈ ప్రక్రియ సక్రమంగా అమలు కావడం లేదు. అందరికీ అందని కార్డులు గుర్తింపు కార్డు దరఖాస్తులో కౌలుదారుని సమాచారంతో పాటు కౌలుకు చేస్తున్న భూమి వివరాలు నిక్షిప్తం చేయాల్సి ఉంది. వీటితో భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఆందోళనలో వివరాలు తెలిపేందుకు భూమి సొంతదారులు వెనుకాడటంతో ఎక్కువ మంది కౌలు రైతులకు గుర్తింపుకార్డులు అందడం లేదు. ఈ చట్టం ప్రారంభమైన మొదటి సంవత్సరంలో సుమారు 50 వేల మంది కౌలు రైతులకు గుర్తింపుకార్డులు ఇవ్వగా, 2012-13లో 74,904 మందికి, 2013-14లో 82,298 మందికి కార్డులు వచ్చాయి. జిల్లాలో సుమారు 3.6 లక్షల మంది కౌలు రైతులు ఉంటే వారిలో అరకొర మందికి మాత్రమే గుర్తింపుకార్డులు అందాయి. రుణసాయం నామమాత్రమే గుర్తింపుకార్డులు పొందిన వారిలో కొద్దిమందికి మాత్రమే రుణాలందుతున్నాయి. అప్పటికే అసలు రైతు రుణం తీసుకుని ఉండటం, తాము పూచీ చూపించలేక పోవడంతో బ్యాంకర్ల నిరాకరణ వంటి కారణాలతో ఆశించిన ప్రయోజనం నెరవేరడం లేదని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చట్టం ద్వారా 2012-13లో 27,290 మంది కౌలు రైతులకు రూ.38.27 కోట్ల రుణాలు మంజూరు చేయగా, 2013-14లో 20,018 మందికి సుమారు రూ.30.82 కోట్ల రుణం మాత్రమే మంజూరైంది. మిగిలిన వారికి బ్యాంకర్ల నుంచి మొండిచెయ్యే ఎదురైంది. మరో వారం రోజుల్లో తొలకరి పనులు ప్రారంభం కానున్నా కౌలురైతుల పాత గుర్తింపు కార్డుల రెన్యువల్‌తో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కార్డులు మంజూరు చేసే చర్యలు కానరావడం లేదు. రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించి కౌలు రైతులను గుర్తించి కార్డులు మంజూరు చేయాలి. గత మూడు నెలలుగా ఎన్నికల హడావుడితో రెవెన్యూ శాఖ కౌలు రైతుల ఊసే మరిచింది. గుర్తింపుకార్డులు లేకపోతే రుణసాయం అందదు. దాంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో కౌలు రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. అధికారులు స్పందించి తమ కోసం చేసిన చట్టం తమకు ఉపకరించేలా చూడాలని అభ్యర్థిస్తున్నారు. రుణాల మంజూరుకు అధికారులు చర్యలు తీసుకోవాలి కొంత మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చినా రుణాలు మాత్రం ఇవ్వటం లేదు. కౌలు రైతులకు ఖరీఫ్‌కు రుణాలు ఇచ్చే విధంగా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలి. - కొండేపూడి శ్రీనివాసరావు, కౌలు రైతు, భట్లపాలిక, కె.గంగవరం మండలం గుర్తింపు కార్డులు ఇవ్వలేదు కౌలు రైతులకు గుర్తింపు కార్డులు పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. గతంలో కొంత మందికి మాత్రమే ఇచ్చారు. గుర్తింపు కార్డులు ఇచ్చినా రుణాలు మాత్రం ఇవ్వలేదు. కౌలు రైతులందరికీ కార్డులిచ్చేలా చూడాలి. - తోకల శ్రీను, కౌలురైతు, తామరపల్లి, కె.గంగవరం మండలం