
63% మించని ఖరీఫ్ రుణాలు
రుణమాఫీ మొదటి విడత సొమ్మును సర్కారు ఆలస్యంగా విడుదల చేయడం వల్లే గత ఖరీఫ్‌లో రైతులకు పంట రుణాలు ఇవ్వడంలో వెనుకబడ్డామని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశం అభిప్రాయపడింది.
రుణమాఫీ జాప్యం వల్లేనన్న రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి
రబీలో 96% పంట రుణాలు
వ్యవసాయ రుణ బకాయిలు రూ. 13,629 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీ మొదటి విడత సొమ్మును సర్కారు ఆలస్యంగా విడుదల చేయడం వల్లే గత ఖరీఫ్‌లో రైతులకు పంట రుణాలు ఇవ్వడంలో వెనుకబడ్డామని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశం అభిప్రాయపడింది. సోమవారం హైదరాబాద్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బీహెచ్) కార్యాలయంలో జరిగిన ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో వ్యవసాయశాఖ మం త్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొం డయ్య, ఎస్‌బీహెచ్ ఎండీ ముఖర్జీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన నివేదికలో రుణప్రణాళికను సమీక్షించారు. గత సెప్టెంబర్ వరకు రుణమాఫీ మొదటి విడత సొమ్మును విడుదల చేశారని... దీంతో రైతు లు రుణాలు తీసుకోవడానికి వీలు కాలేదని వివరించారు. గత ఖరీఫ్ పంట రుణ లక్ష్యం రూ. 12,389.70 కోట్లు కాగా కేవలం రూ.7,816.84 కోట్లు(63.09%) మేర రుణాలు ఇచ్చామని నివేదికలో వెల్లడించారు.
ఎస్‌ఎల్‌బీసీ నివేదికాంశాలివీ...
రబీలో రూ. 6,328.25 కోట్లు లక్ష్యం నిర్దేశిం చుకోగా... గత డిసెంబర్ 31 నాటికి రూ. 6,109.77 కోట్లు (96.55%) ఇచ్చామన్నారు. ఖరీఫ్, రబీ పంట రుణాల మొత్తం లక్ష్యం రూ. 18,717.95 కోట్లు కాగా... రూ. 13,926.61 కోట్లు (74.40%) ఇచ్చినట్లు వెల్లడించారు. ఇవిగాక వ్యవసాయ టర్మ్ రుణాల లక్ష్యం రూ. 6,238.48 కోట్లు కాగా... గత డిసెంబర్ నాటికి రూ. 3,885.84 కోట్లు (62.29%) ఇచ్చారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ. 2,277.16 కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా... గత డిసెంబర్ నాటికి రూ. 4,177.02 కోట్లు (183.43%) ఇచ్చారు. అనుకున్న లక్ష్యం కంటే అత్యధికంగా ఇచ్చినట్లు పేర్కొన్నారు. మొత్తంగా అన్నీ కలుపుకొని వ్యవసాయ రుణాలు 80.74 శాతం ఇచ్చినట్లు వివరిం చారు. ఇవిగాక విద్యారుణాల లక్ష్యం 2014-15లో రూ. 662.52 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా... గత డిసెంబర్ నాటికి రూ. 317.16 కోట్లు (47.8%) ఇచ్చా రు.
ఇంత తక్కువ విద్యా రుణాలు ఇవ్వడంపై ఎస్‌ఎల్‌బీసీ అసహనం వ్యక్తంచేసింది. బ్యాం కు బ్రాం చీలు విద్యా రుణాలను తిరస్కరించవద్దని విజ్ఞప్తి చేసింది. ఇంటి రుణాల లక్ష్యం రూ. 2,102.15 కోట్లు కాగా... గత డిసెంబర్ నాటికి రూ. 4,184.10 (199.04%) ఇవ్వడం గమనార్హం. అంటే 200 శాతం వరకు ఇచ్చారన్నమాట. మొత్తం అన్ని రుణాలు కలిపి 2014-15 రుణ ప్రణాళిక లక్ష్యం రూ. 63,047.62 కోట్లు కాగా... గత డిసెంబర్ నాటికి రూ. 84,339.35 కోట్లు (133.77%) ఇచ్చినట్లు ఎస్‌ఎల్‌బీసీ నివేదిక వెల్లడించింది. గత డిసెంబర్ నాటికి వ్యవసాయ రుణ బకాయిలు రూ. 13,629 వరకు ఉన్నాయని ఎస్‌ఎల్‌బీసీ నివేదిక స్పష్టంచేసింది. అందులో రూ. 4,431.14 కోట్లు నిరర్ధక ఆస్తులుగా గుర్తించినట్లు వివరించింది.
ప్రభుత్వానికి మూడు ప్రాధాన్యాలు...
రాష్ట్ర ప్రభుత్వానికి మూడు ప్రాధాన్యాలు ఉన్నాయని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేదల సంక్షేమం, వ్యవసాయరంగం, పరిశ్రమలపై కేంద్రీకరిస్తుందన్నారు. నెలకు రూ. 50 వేలకు పైగా మహిళలు సంపాదించే విధం గా కృషి చేస్తామన్నారు. పాలీహౌస్‌కు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్నారు. అందు లో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. 200 కోట్ల చేప విత్తనాలను సరఫరా చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామన్నా రు. ముందు గా 6 ప్రాజెక్టుల్లో పెలైట్ ప్రాజెక్టు కింద కేజ్ కల్చర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ మా ట్లాడుతూ రుణమాఫీలో ప్రభుత్వం విజయవంతమైందన్నారు. వచ్చేవారంలోగా రుణ మాఫీ ఎంతవరకు పూర్తి అయింది? ఎంత సొమ్ము మిగిలిందో వివరాలు ఇవ్వాలన్నారు.