breaking news
Ketireddy Jagadeeswara Reddy
-
అది ప్రభుత్వ విధాన నిర్ణయం
సాక్షి, అమరావతి: జిల్లాకు ఏ పేరు పెట్టాలన్నది ప్రభుత్వ విధాన నిర్ణయమని హైకోర్టు తేల్చి చెప్పింది. జిల్లాకు ఫలానా వ్యక్తి పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించడం న్యాయస్థానం పని కాదని స్పష్టం చేసింది. కొత్తగా ఏర్పాటైన నంద్యాల జిల్లాకు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి పేరు పెట్టేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సామాజిక కార్యకర్త కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్‌ను) హైకోర్టు మంగళవారం కొట్టేసింది. ఏదైనా జిల్లాకు లేదా పట్టణానికి రాజకీయ నేత, స్వాతంత్య్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, యోగి, ఇతర ప్రఖ్యాత వ్యక్తి పేరు పెట్టడం పూర్తిగా ప్రభుత్వ పరిధిలోనిదని స్పష్టంచేసింది. ఒకవేళ కోర్టు అలాంటి ఆదేశం ఇవ్వాలంటే, రాష్ట్ర ప్రభుత్వం చట్ట ఉల్లంఘనకు లేదా ప్రజల చట్టబద్ధ హక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్లు పిటిషనర్ నిరూపించాల్సి ఉంటుందని తెలిపింది. జిల్లాలకు పేరు పెట్టే విషయంలో నిర్దిష్ట ప్రమాణాలతో కూడిన చట్టం ఏదీ లేదని చెప్పింది. కాబట్టి ఈ వ్యాజ్యాన్ని కొట్టేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీవీఎస్ సోమయాజులు ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. -
కేతిరెడ్డి జీవిత సాఫల్యం
సినీ దర్శక -నిర్మాత, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తెలుగు సినీ పరిశ్రమకు అందించిన సేవలకు గానూ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. నెల్లూరులో 25 కళా సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కే తిరెడ్డి మాట్లాడుతూ- ‘‘నెల్లూరులో పుట్టడం నాకు ఆ దేవుడిచ్చిన వరం. తెలుగు భాషాపరిరక్షణ ఉద్యమ నాయకునిగా నెల్లూరు జిల్లా నన్ను నిలబెట్టింది. అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా తమిళనాడులో పాఠశాల స్థాయిలో తెలుగు భాషా బోధన రద్దుకు నిరసనగా ఉత్తరాల ద్వారా ఉద్యమం చేయనున్నాం. అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.