breaking news
kethireddy jagadishreddy
-
ఒక రాజకీయ పార్టీకి కొమ్ముకాసేలా ‘నోటా’!
సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘నోటా’ సినిమా విడుదలకు ఆటంకాలు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఈ సినిమాకు వ్యతిరేకంగా సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్‌రెడ్డి సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్‌కుమార్‌ను కలిశారు. ‘నోటా’ చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని, ఇది ఒక రాజకీయ పార్టీకి కొమ్ముకాసేవిధంగా తెరకెక్కించారని కేతిరెడ్డి ఫిర్యాదు చేశారు. తెలంగాణ సచివాలయంలో ఎన్నికల ప్రధానాధికారిని కలిసిన అనంతరం కేతిరెడ్డి మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఈ చిత్రాన్ని మొదట ఎన్నికల కమిషనర్, డీజీపీ చూసిన తర్వాతే విడుదలకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఎన్నికల సమయం కావడంతో ‘నోటా’ సినిమా ప్రభావం ఉంటుందన్నారు. ఈ సినిమా వల్ల శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశముంటుందని ఆయన పేర్కొన్నారు. ‘నోటా’ అన్న ఈ సినిమా టైటిల్ కూడా వివాదాస్పదం అయ్యే అవకాశముందని చెప్పారు. ఇలాంటి టైటిల్ ఈసీ నిబంధనలకు విరుద్ధమని ఆయన చెప్పారు. వరుస విజయాలతో జోరుమీదున్న విజయ్ దేవరకొండ ఈ నెల 5వ తేదీన ‘నోటా’ సినిమా విడుదల కానుంది. -
డ్రగ్స్ విక్రయదారులను దేశ ద్రోహులుగా ప్రకటించాలి
హైదరాబాద్: సినీ పరిశ్రమను ఒక కుదుపు కుదుపుతున్న డ్రగ్స్ వ్యవహారంపై సినీ నిర్మాత, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీష్ రెడ్డి స్పందించారు. మాదక ద్రవ్యాల మత్తులో మానవ సమాజం అనే అంశంపై సోమజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన చర్చా వేదికలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ విక్రయదారులను దేశద్రోహులుగా పరిగణించే విధంగా కఠిన చట్టాన్ని తీసుకురావాలని కేంద్రాన్ని కోరారు. డ్రగ్స్ మాఫియాను తీవ్రవాదులుగా పరిగణించి, వారిపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోదీని కోరారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్ కేసు దర్యాప్తు నత్తనడకగా జరుగుతోందన్నారు. డ్రగ్స్ అనర్థాలపై యువజన కాంగ్రెస్, స్వచ్ఛంద సంస్థలు యువతకు అవగాహన కల్పించాలని కోరారు. డ్రగ్స్ కేసులో ప్రభుత్వం రోజుకో సీనీనటులను దర్యాప్తు పేరుతో కాలయాపన చేస్తోందని అంతే తప్ప కేసులో పురోగతి లేదన్నారు. కేసులో పురోగతికి సిట్ అడుగులేయాలని పొంగులేటి చూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాస్, సూర్యప్రకాష్ రావు, మాజీ పోలీస్ అధికారి గోపీనాథ్ రెడ్డి, సినిమా రంగానికి చెందిన జొన్నవిత్తుల, త్రిపుర నేని చిట్టి, తెలంగాణ యువజన కాంగ్రెస్ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్, తెలంగాణ ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు వెంకట్, ఏఐఎస్ఎఫ్ తెలంగాణ అధ్యక్షుడు వేణు, పీడీఎస్‌యూ అధ్యక్షుడు ప్రభులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.