breaking news
kayyum
-
అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో...
‘‘స్టార్ హీరోలు ఉన్న సినిమాలనే చూడాలని ఇప్పటి ప్రేక్షకులు అనుకోవడంలేదు. కొత్త కథలతో వచ్చే సినిమాలనూ ఆదరిస్తున్నారు. చిన్న సినిమానా? పెద్ద సినిమానా? అని కాకుండా బాగున్న సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. అందుకు నిదర్శనం ‘క్షణం, పెళ్లి చూపులు, ఆర్ఎక్స్ 100’ వంటి చిత్రాలు. మా ‘దేశంలో దొంగలు పడ్డారు’ చిత్రం ఈ కోవకు చెందినదే’’ అని గౌతమ్ రాజ్‌కుమార్ అన్నారు. ఖయూమ్, తనిష్క్ రాజన్, షానీ, పృథ్వీరాజ్, సమీర్, లోహిత్ ప్రధాన పాత్రలలో రమా గౌతమ్ నిర్మించిన చిత్రం ‘దేశంలో దొంగలు పడ్డారు’. గౌతమ్ రాజ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం యూఎస్‌లోని మిల్‌ఫోర్డ్‌లో జరగనున్న ‘బ్లాక్ బీర్’ ఫిల్మ్ ఫెసివల్‌కి ఎంపికైంది. దర్శకుడు మాట్లాడుతూ – ‘‘హ్యూమన్ ట్రాఫికింగ్ నేపథ్యంలో తీసిన చిత్రం ఇది. అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధి పొందిన బ్లాక్ బీర్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి అధికారికంగా నామినేట్ కావడం హ్యాపీగా ఉంది. అక్టోబర్‌లో జరిగే ఈ చిత్రోత్సవాల్లో పలు అంతర్జాతీయ చిత్రాల మధ్య మా సినిమా ప్రదర్శితం అవుతుంది. త్వరలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి, చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: సాయికుమార్ పాలకూరి, సహ నిర్మాత: సంతోష్ డొంకాడ. -
కయూమ్ అజేయ డబుల్ సెంచరీ
► మాంచెస్టర్ 461/6 డిక్లేర్డ్ ► ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్ సాక్షి, హైదరాబాద్: కయూమ్ (262 బంతుల్లో 218 నాటౌట్; 31 ఫోర్లు) అజేయ డబుల్ సెంచరీ సాధించడంతో మాంచెస్టర్ భారీ స్కోరు చేసింది. ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్‌లో డెక్కన్ బ్లూస్‌తో గురువారం మొదలైన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేపట్టిన మాంచెస్టర్ 6 వికెట్లకు 461 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. రాజ్ కుమార్ (126) సెంచరీ చేశాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన డెక్కన్ బ్లూస్ మొదటి రోజు ఆట నిలిచే సమయానికి వికెట్ నష్టానికి 17 పరుగులు చేసింది. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు కొసరాజు: 162/9 (విశ్వజిత్ మహాపాత్ర 66; సోమశేఖర్ 4/29), శ్రీచక్ర: 88/2 (సోమశేఖర్ 40). నేషనల్ సీసీ: 107 (త్రిశాంత్ గుప్తా 7/51), గ్రీన్‌టర్ఫ్: 99 (సయ్యద్ అస్కారి 43; సుమిత్ జోషి 8/39). అగర్వాల్ సీనియర్స్: 303 (సాయివ్రత్ రెడ్డి 186, మహ్మద్ అబిద్ 3/93), బాలా జీ కోల్ట్స్: 59/5 (ఫయాజ్ 31 బ్యాటింగ్). ఆక్స్ఫర్డ్ బ్లూస్: 160 (నర్సింహ 5/45), క్లాసిక్: 8/1. హైదరాబాద్ టైటాన్స్: 111/9 (రవూఫ్ 31; సురేశ్ 5/36), ఉదయ్ 3/29). బ్రదర్స్ ఎలెవన్: 147 (అజీమ్ వార్సి 45; సాయిపూర్ణానంద్ 5/52, అలంకృత్ 5/42), క్రౌన్ సీసీ: 81/6 (రాజశేఖర్‌రెడ్డి 30; నొమన్ అఫ్సర్ 3/28). బడ్డింగ్ స్టార్స్: 137/8 (భరత్ 64 బ్యాటింగ్; సైఫుద్దీన్ 5/48). జిందా తిలిస్మాత్: 285 (మధు కుమార్ 68, అజారుద్దీన్ 75; అఖిల్ 3/58, ఆదిత్య 3/47). ఉస్మానియా: 199 (మోజెస్ 64; అర్జున్ 3/58), అవర్స్ సీసీ: 24/2 సాయిసత్య: 207/6 (నారాయణ 60, అరవిం ద్ 61 బ్యాటింగ్; ఆశిష్ 3/38), గెలాక్సీతో మ్యాచ్.