breaking news
katamarayudu movie shooting
-
సంగారెడ్డిలో ‘కాటమరాయుడు’ సందడి
-
కొత్త నోటుతో పవన్ ఏం చేశారు?
ప్రస్తుతం కాటమరాయుడు సినిమా షూటింగులో బిజీబిజీగా ఉన్న పవన్ కల్యాణ్ వద్దకు కొత్త రెండువేల రూపాయల నోటు వచ్చింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఇప్పటివరకు కొత్త నోటును అసలు చూడలేదో.. లేక చూసే తీరిక లేదో గానీ, షూటింగ్ విరామ సమయంలో పవన్ ఆ నోటును చాలా పరిశీలనగా చూశారు. పాత వంద రూపాయల నోటుతో దాన్ని పోల్చి చూసి.. ఏవేం అంశాలు అందులో ఉన్నాయి, ఏం లేవన్న అంశాలను గమనించి చూసినట్లు కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన రెండు ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా వ్యాపిస్తున్నాయి. పక్కనే పలు రకాల కూల్ డ్రింక్ సీసాలు, సోడాలు, మంచినీళ్ల బాటిళ్లు ఒక టేబుల్ మీద పెట్టి ఉండగా.. పవన్ రెండు వేల రూపాయల నోటును చేత్తో పట్టుకుని పరిశీలనగా పైకి, కిందకు చూస్తున్నారు.