breaking news
Kalyani koduri
-
ఆ పాటను భయపడుతూ చిత్రీకరించా : నందినీ రెడ్డి
‘‘దామోదర్‌రెడ్డిగారు మంచి అభిరుచి గల నిర్మాత. స్క్రిప్ట్‌ను నమ్మి సినిమా తీసే నిర్మాతల్లో ఆయనొకరు. ‘అలా మొదలైంది’ హిట్ మళ్లీ ఈ సినిమాతో రిపీట్ కావాలని కోరుకుంటున్నా’’ అని హీరో రామ్ అన్నారు. నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా నందినీ రెడ్డి దర్శకత్వంలో కేఎల్ రామోదర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘కళ్యాణ వైభోగమే’. కల్యాణి కోడూరి స్వరాలందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ సినిమా పాటల సీడీని హీరో రామ్ ఆవిష్కరించారు. నాగశౌర్య మాట్లాడుతూ- ‘‘దామోదర్‌రెడ్డిగారు కథను నమ్ముకుని ధైర్యంగా సినిమా తీసే నిర్మాత. నా నెక్ట్స్ సినిమా కూడా నందినీ రెడ్డిగారితోనే చేస్తాను. కల్యాణి కోడూరిగారితో నాకిది రెండో సినిమా. మంచి పాటలిచ్చారు’’ అని చెప్పారు. ‘‘కల్యాణి ఈ సినిమాకు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ముఖ్యంగా ‘కల్యాణం...’ సాంగ్ అయితే అద్భుతం. దానికి సరిపడే విజువల్ ఇస్తానా? లేదా అనే డౌట్ వచ్చింది. ఆ పాట మాత్రం భయపడుతూ చేశాను. నాగశౌర్య, మాళవిక వయసులో చిన్నవాళ్లయినా యాక్టింగ్‌లోనూ, బిహేవియర్‌లోనూ చాలా మెచ్యూరిటీ, డెడికేషన్ చూపించారు. అందరం ప్రేమించి చేసిన సినిమా ఇది’’ అని నందినీ రెడ్డి తెలిపారు. కేఎల్ దామోదర్‌ప్రసాద్ మాట్లాడుతూ- ‘‘అందరం కుటుంబ సభ్యుల్లా కలిసి మెలిసి పనిచేశాం. ఈ చిత్రం ద్వారా రాజు అనే సినిమాటోగ్రఫర్‌ను ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. నాగశౌర్య, మాళవిక మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు’’ అని చెప్పారు. ఈ వేడుకలో హీరోలు రాజ్‌తరుణ్, సుమంత్ అశ్విన్, సంగీత దర్శకుడు కల్యాణి కోడూరి, రచయిత లక్ష్మీ భూపాల్, దర్శకులు దశరథ్, ఇంద్రగంటి మోహనకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
తేజతో హోరాహోరీ నిజమే!
‘‘తేజ వర్కింగ్ స్టైల్ ఇబ్బంది అని పించింది. మా ఇద్దరి మధ్య మనస్పర్థలొచ్చిన మాట నిజమే. కానీ, టెక్నీషియన్స్‌తో ఎలా పని చేయించు కోవాలో తెలిసినవాడు. అవన్నీ గుర్తొ చ్చినప్పుడు తనతో మళ్లీ ఇంకో సినిమా చేయాలనిపిస్తుంది. కానీ, గొడవలు తలుచుకుంటే మాత్రం వద్దు అనిపిస్తుంది’’ అని సంగీత దర్శకుడు కల్యాణి కోడూరి చెప్పారు. దిలీప్, దక్ష జంటగా శ్రీరంజిత్ మూవీస్ పతాకంపై తేజ దర్శకత్వంలో కె.ఎల్. దామోదర ప్రసాద్ నిర్మించిన ‘హోరాహోరీ’కి ఆయన పాటలు స్వరపరిచారు. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రం గురించి కళ్యాణి కోడూరి విలేకరులతో మాట్లా డుతూ - ‘‘ఇందులో పాటలు కొత్తగా ఉంటాయి. నాకు తెలిసినవారు, తెలియని వారు అందరూ ఫోన్ చేసి అభినందించారు. నేను మా అన్నయ్య కీరవాణి సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు సహకరిస్తానని అంటూ ఉంటారు. కానీ అది బ్యాడ్ గాసిప్. కేవలం సౌండ్ సూపర్విజన్ చేస్తూ ఉంటా. నేను నేపథ్యసంగీతం ఇచ్చేంత దౌర్భాగ్యం అన్నయ్య కీరవాణికి పట్టలేదని నా ఫీలింగ్’’ అన్నారు.