చంద్రబాబు మోసం చేశాడంటూ..
కల్యాణదుర్గం టౌన్: ఎస్సీ వర్గీకరణపై సీఎం చంద్రబాబు మోసం చేశాడంటూ ఎంఆర్పీఎస్ కార్యకర్తలు శనివారం అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో సెల్‌టవర్ ఎక్కారు. ఎరుకల కాలనీ సమీపంలో ఉన్న సెల్‌టవర్‌పైకి ఐదుగురు ఎంఆర్పీఎస్ కార్యకర్తలు ఎక్కగా, మిగిలిన వారు కిందనుంచే నిరసన తెలిపారు. సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిల్లా కేంద్రంలో ఉన్న ఎంఆర్పీఎస్ కార్యక్రమానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.