breaking news
Kaimur
-
లైంగికంగా వేధిస్తూ.. వీడియో తీసి..
పట్నా: అమ్మాయిలపై వేధింపులు రోజురోజూకి పెరిగిపోతున్నాయి. బిహార్‌లో అయితే ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కైమూర్ జిల్లాకు చెందిన కొంతమంది దుండగులు ఓ అమ్మాయిని లైంగికంగా వేధించారు. ఇంతటితో ఆగకుండా ఆ దారుణాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు. కైమూర్ జిల్లాలోని భగవాన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మసాహి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకరం.. మసాహి గ్రామానికి చెందిన కొంతమంది యువకులు గత నెల 27న ఒక అమ్మాయిపై లైగింక వేధింపులకు పాల్పడ్డారు. అంతటి ఆగకుండా ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దుండగులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేశామని, త్వరలోనే మిగతా వారిని అరెస్ట్ చేస్తామని భగవాన్‌పూర్ పోలీసులు తెలిపారు. కాగా, గత రెండు నెలల్లో ఇలాంటి ఘటనలు బిహార్‌లో అనేకం చోటు చేసుకున్నాయి. ఈ నెల 12న నలందా జిల్లాలో చెందిన కొంత మంది యువకులు, యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు వీడియోలో ఉన్న వారిని అరెస్ట్ చేశారు. గయా జిల్లాలో ఓ యువతిని వేధిస్తూ తీసిన వీడియో వైరల్ కావడంతో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. గయా జిల్లాలోని సోనిదిహ్ గ్రామంలో ఈనెల 13న ఓ వైద్యుడ్ని తుపాకితో బెదిరించి చెట్టుకు కట్టేసి.. అతడి భార్య, కూతురిపై 20 మంది సామూహిక అత్యాచారం చేశారు. -
పాట్నా బాధితులకు మోడీ బాసట
పాట్నా నగరంలో గత ఆదివారం వరుస బాంబు పేలుళ్ల ఘటనలో మృత్యువాత పడిన ఆరుగురు కుటుంబ సభ్యులను గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ శనివారం వరుసగా పరామర్శిస్తున్నారు. మొదటగా మృతుల్లో ఒకరైన రాజ్ నారాయణ్ సింగ్ స్వగ్రామమైన పాట్నా జిల్లాలోని గౌరిచౌక్ సమీపంలోని కమార్జి గ్రామానికి శనివారం ఉదయం మోడీ చేరుకున్నారు. రాజ్ నారాయణ్ సింగ్ కుటుంబాన్ని మోడీ పరామర్శించారు. అనంతరం ఆ కుటుంబానికి రూ.5 లక్షల చెక్కును ఆయన అందజేశారు. అనంతరం మరో మృతుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు మోడీ కైమురు జిల్లాకు పయనమైయ్యారు. అక్కడి నుంచి నలందా, బెగుసరాయి, సుపాల్, గోపాల్‌గంజ్‌లోని మృతుల కుటుంబాలను మోడీ పరామర్శించనున్నారు. అయితే మోడీ పర్యటించే ప్రాంతాల్లో భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. అందుకోసం భారీగా భద్రత దళాలను మోహరించారు. గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ గత ఆదివారం పాట్నా నగరంలో గాంధీ మైదాన్ల హూంకార్ ర్యాలీ బహిరంగ నిర్వహించారు. అయితే ఆ రోజు ఉదయం పాట్నా రైల్వే స్టేషన్ వద్ద బాంబు పేలుడుతోపాటు... గాంధీ మైదాన్ వద్ద వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఆ దుర్ఘటనలో మొత్తం ఆరుగురు మరణించారు. మరో 83 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఆ ఘటనతో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ఇండియన్ ముజాహిదీన్ ఈ పేలుడుకు బాధ్యులని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ పేలుళ్లకు సంబంధించి ఇప్పటివరకు నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా పాట్నా రైల్వే స్టేషన్లో బాంబు అమర్చుకుంటుండగా ప్రమాద వశాత్తు బాంబు పేలి ఒక నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడు. దాంతో పోలీసులు అతడిని పాట్నాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించారు. తీవ్ర గాయాలతో నిందితుడు కోమాలోకి వెళ్లాడు. ఆ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిందితుడు నిన్న ఉదయం మరణించిన సంగతి తెలిసిందే. మోడీ పర్యటనలో ఆయన వెంటన ఆ పార్టీ సీనియర్ నేత నంద కిషోర్ యాదవ్ ఉన్నారు.