breaking news
Kabir Dahan Singh
-
నో డూప్
గాల్లో తేలియాడుతున్నారు హీరోయిన్ సాయిధన్సిక. ఊహల్లో కాదండీ బాబు! నిజంగానే. అయ్యో... ఆమెకు ఎందుకంత కష్టం. అంటారా? కష్టం కాదు ఇష్టం. కన్నడ చిత్రం ‘ఉద్ఘర్ష’ కోసం ఆమె డూప్ లేకుండా రియల్‌గా స్టంట్స్ చేస్తున్నారు. సునైల్ కుమార్ దేశాయ్ దర్శకత్వంలో అనూప్‌సింగ్ థాకూర్, సాయి ధన్సిక, తాన్యా హోప్, కబీర్ దుహాన్ సింగ్, కిశోర్, హర్షికా పోనాచా ముఖ్య తారలుగా నటిస్తున్న ఈ సినిమాను తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. తమిళంలో ఈ చిత్రాన్ని డబ్ చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. ఈ చిత్రం కోసమే రియల్‌గా స్టంట్స్ చేస్తున్నారు ధన్సిక. ‘‘కొన్నిసార్లు జీవితంలో రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది’’ అని పేర్కొన్నారు ధన్సిక. రజనీకాంత్ ‘కబాలి’ సినిమాలో యోగి పాత్రలో ఆమె చేసిన యాక్షన్‌కు ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు. మరి.. ఈ ‘ఉద్ఘర్ష’ లో «ధన్సిక చేసిన యాక్షన్ ఆడియన్స్‌కి ఏ మాత్రం నచ్చుతుందో చూడాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే. -
తొమ్మిది చుట్టూ...
అశ్వనీ కుమార్ దర్శకత్వంలో శ్వేతాసింగ్ నిర్మిస్తున్న చిత్రం ‘9’. అతుల్ కులకర్ణి, కబీర్ దుహన్ సింగ్, అర్చన శాస్త్రి, పావనీ గంగిరెడ్డి, ఆషిమా నర్వాల్, శ్రిత చందన ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమా టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ– ‘‘నాకు రెండు నిర్మాణ సంస్థలు ఉన్నాయి. అందులో ఏకా ఆర్ట్ ప్రొడక్షన్లో వస్తున్న తొలి చిత్రం ‘9’. సినిమాను 32 రోజుల్లో తెరకెక్కిద్దామనుకున్నాం. అయితే 27రోజుల్లోనే కంప్లీట్ చేయగలిగాం’’ అన్నారు. నలుగురు ఘోస్ట్ హంటర్స్ ఓ హంటెడ్ హౌస్‌లో దెయ్యాలున్నాయా..? లేవా అని సెర్చ్ చేయడానికి వెళ్లినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయన్నదే చిత్రకథ. సినిమాలో అనేక అంశాలు 9 చుట్టూ తిరుగుతుంటాయి’’ అన్నారు అశ్వనీ కుమార్.