breaking news
k acham naidu
-
'నిరుద్యోగ భృతి ఇస్తామన్న మాట వాస్తవమే'
హైదరాబాద్ : రాష్ట్రంలోని నిరుద్యోగులకు భృతి ఇస్తామన్న మాట వాస్తవమే అని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు గురువారం అసెంబ్లీలో స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇవ్వాలంటే ఒక్క ప్రభుత్వం వల్లే సాధ్యం కాదన్నారు. ప్రైవేట్ రంగంలోనూ వెతుకాలి ఆయన ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఉద్యోగాల భర్తీకి ఈ ఏడాది చర్యలు తీసుకుంటామని అచ్చెన్నాయుడు సభకు వెల్లడించారు. కొత్తగా ఎంపికైన టీచర్లకు ఏప్రిల్ నాటికి పోస్టింగ్లు ఇస్తామన్నారు. అలాగే నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించి. త్వరలో వాటిని నిరుద్యోగులకు చెల్లిస్తామని కె. అచ్చెన్నాయుడు చెప్పారు. -
మంత్రిగారిపై పార్టీ ఎమ్మెల్యే ఫైర్
-
మంత్రిగారిపై పార్టీ ఎమ్మెల్యే ఫైర్
శ్రీకాకుళం జిల్లాలో అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల మధ్య ఏర్పడిన వైరం తారస్థాయికి చేరింది. దాంతో ఆ పంచాయతీ కాస్తా పార్టీ అధ్యక్షుడి చంద్రబాబు నాయుడు వద్దకు చేరింది. జిల్లాకు చెందిన మంత్రి కె.అచ్చెన్నాయుడు వైఖరీపై అదే జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే కళా వెంకటరావు పార్టీ అధ్యక్షడుకి ఫిర్యాదు చేశారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు తనను ఆహ్వానించకుండా మంత్రి పర్యటిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై తాను మాట్లాడతానని కళా వెంకటరావుకు బాబు హమీ ఇచ్చారని సమాచారం. గత ఏడాది ఆసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో శ్రీకాకుళంలో జిల్లా నుంచి సీనియర్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికైనా... పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏరికోరి మరీ తన కేబినెట్లో కె. అచ్చెన్నాయుడికి చోటు కల్పించారు. జిల్లాకు చెందిన సీనియర్లను పక్కన పెట్టి అచ్చెన్నాయుడికి మంత్రి పదవి ఇవ్వడంపై సదరు నేతలంతా ఆగ్రహంతో ఉన్నారు. అప్పుడే బాబు వద్ద వీరంతా తమ ఆవేదనను వెళ్లకక్కారు. దాంతో వారందరిని బాబు సముదాయించారు. అచ్చెన్నాయుడి వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు తాను హామీ ఇస్తానని పచ్చ తమ్ముళ్లు బాబు హమీ ఇచ్చారు. దాంతో వీరంతా మిన్నకుండి పోయారు. అయితే జిల్లాలో పార్టీకి చెందిన ఏ కార్యక్రమమైనా బాబాయి, అబ్బాయి కనుసన్నల్లో జరుగుతుండంతో పచ్చ తమ్ముళ్లు లోలోపల ఆగ్రహంతో రగిలిపోతున్న సంగతి తెలిసిందే.