breaking news
Juwellars
-
క్లియోపాత్రా నుంచి ప్రేరణ పొందిన నెయిల్ రింగ్స్ ఇవి..
నెయిల్ ఆర్ట్ గురించి మనకు తెలిసిందే. ఎన్నో డిజైన్లు మన చూపు తిప్పుకోనివ్వవు. ఆర్టిఫిషియల్ నెయిల్స్ని అతికించి మరీ చూడచక్కని డిజైన్లతో చేసే ఆ అలంకారం వేలి కొసలలో మెరుపులుగా కనువిందు చేస్తుంది. ఇప్పుడు వాటి స్థానాన్ని నెయిల్ జువెలరీ ఆక్రమిస్తోంది. ఫింగర్ క్లారింగ్స్గా ఈ నెయిల్ జ్యువెలరీ ఆధునికమైన టచ్‌తో అందంగా రూపుకడుతుంది. ప్రాచీనకాలంలో రక్షణలో భాగంగా చేరిన ఈ ఆభరణం ఇప్పుడు సొగసైన అలంకార జాబితాలో చేరి ప్రత్యేకతను చాటుతోంది. బంగారు, వెండి, ఇతర లోహాలలోనూ ఈ నెయిల్ జ్యువెలరీ అందుబాటులో ఉంది. సంప్రదాయం, ఆధునికం ఏ వేడుకైనా కొత్తగా వెలిగిపోవాలని కోరుకునే వారికి ఈ నెయిల్ రింగ్స్ సరైన ఎంపిక అవుతాయి. లోహపు డిజైన్లలో ముత్యాలు, రత్నాలు, ఎనామిల్.. వంటివి జతచేసిన డిజైన్ల ఎంపిక మనదైన ప్రత్యేకతను చాటుతుంటుంది. లోహాన్ని బట్టి, డిజైన్‌ను బట్టి ధరలు వందల రూపాయల నుంచి అందుబాటులో ఉన్నాయి. చరిత్రలో నెయిల్ జువెలరీ.. ప్రాచీన చైనా, ఈజిప్ట్ రాజులు, రాణుల ఈ నెయిల్ క్లా జ్యువెలరీ విరివిగా ధరించేవారు. పొడవాటి గోర్లు సంపదకు చిహ్నంగా భావించేవారు. వాటి వల్ల శారీర శ్రమæ చేయవలసి అవసరం లేదు. అలా శ్రమ చేయాల్సిన అవసరం లేని వారు, స్థితిమంతులుగా జాబితాలో ఉండేవారు. అంతేకాదు, నెయిల్ గార్డ్‌గా పిలిచే ఈ ఆభరణాన్ని ధరించడం ప్రాచీన చైనీస్ మహిళలు శక్తికి, అందానికి చిహ్నంగా భావించేవారు. నెయిల్ క్లా లేదా గార్డుల తయారీలో సాధారణంగా లోహాలు లేదా సముద్ర తీరాల్లో లభించే ఆల్చిప్పల పెంకులను కూడా ఉపయోగించేవారు. అయితే, ఎక్కువగా బంగారం, వెండి, కాంస్య లేదా పోత పోసిన లోహంతో తయారు చేస్తారు. ముత్యాలు, విలువైన రాళ్లను వాటిలో పొదుగుతారు. వేలిగోళ్ల గార్డు ధరించిన వారి సామాజిక స్థితిని తెలియజేసేది. 3సెం.మీ నుండి దాదాపు 15 సెంటీ మీటర్ల వరకు ఉండేలా డిజైన్ చేయించేవారు. కొన్నిసార్లు చిటికెన వేలు, ఉంగరపు వేలికి సరిపోయేలా డిజైన్ చేయించుకునేవారు. కుడిచేతి, ఎడమ చేతి డిజైన్లు భిన్నంగా ఉండేవి. తమ దేశ సంప్రదాయ ఆభరణాలలో భాగంగా ఉన్నా, రక్షణ కోసం ఉపయోగించేవిగా పేరొందాయి. వారి వారి దేశాల్లోని నాణేలు, జంతువులు, పక్షులు, మొక్కల బొమ్మలను నెయిల్ గార్డ్స్‌పైన డిజైన్ చేయించేవారు. మహారాణి కళ.. జువెలరీ డిజైన్ సృష్టి, ఎంపిక అనేవి మన భావ వ్యక్తీకరణ పట్ల నుండి పుట్టుకు వచ్చిన ఆలోచన. నా డిజైన్స్ ఎక్కువగా బంజారా సంస్కృతికి అద్దం పడతాయి. ఎన్నో ఏళ్లుగా చూసిన వివిధ జాతుల సంస్కృతి, కళలు నా డిజైన్స్‌లో కనిపిస్తాయి. క్లియోపాత్రా నుంచి ప్రేరణ పొందిన నెయిల్ రింగ్స్ అలంకరణ మహారాణి కళను తీసుకువస్తుంది. – భవ్య రమేష్, జ్యువెలరీ డిజైనర్ -
సమ్మె విరమణ బాటలో జువెలర్స్!
న్యూఢిల్లీ: దేశంలోని చాలా ప్రాంతాల్లో బంగారు ఆభరణాల క్రయవిక్రయాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. చాలా మంది జువెలర్స్ సమ్మె బాట వదిలి తిరిగి మంగళవారం బంగారు షాపులను తెరచారు. కేంద్ర ప్రభుత్వపు ఎక్సైజ్ సుంకం విధింపునకు నిరసనగా జువెలర్స్ 6 వారాల నుంచి సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. న్యూఢిల్లీ, ముంబైలలో చాలా చోట్ల జువెలర్స్ బంగారు షాపులను తెరిచారు. ఏపీ, తమిళనాడులోని బంగారు షాపులు పునఃప్రారంభమయ్యాయి. ఇక ఎక్సైజ్ సుంకం అమలును సరళతరం చేస్తామన్న ప్రభుత్వపు హామీతో రాజస్తాన్‌లోనూ బంగారు షాపులు యథావిథిగా పనిచేస్తోన్నాయని రాజస్తాన్ సరాఫా సంఘం ప్రెసిడెంట్ సుభాశ్ మిట్టల్ తెలిపారు. మహారాష్ట్ర జువెలర్స్ ఏప్రిల్ 14 నుంచి 24 వరకు సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ప్రకటించారు. జువెలరీ పరిశ్రమ సమస్యలపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో కలిసి చర్చించామని, అందుకే ప్రస్తుతం సమ్మెను తాత్కాలికంగా విరమించామని మహారాష్ట్ర రాజ్య సరాఫా సువర్ణకార్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఫతేచంద్ రాంకా తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేసిన కమిటీ.. జువెలర్స్ డిమాండ్లను పరిగణలోకి తీసుకుంటుందన్న ప్రభుత్వపు హామీతో జువెలర్స్ రానున్న రోజుల్లో సమ్మె విరమించవ త చ్చని అసోచామ్ నేషనల్ కౌన్సిల్ (జెమ్స్ అండ్ జువెలరీ) చైర్మన్ శంకర్ సేన్ తెలిపారు.