breaking news
julia morley
-
భారత్లో మిస్ వరల్డ్ 2023
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అందాల పోటీ మిస్ వరల్డ్–2023కు భారత్ వేదిక కానుంది. దాదాపు మూడు దశాబ్దాల అనంతరం మన దేశం ఈ పోటీకి వేదికవుతుండటం గమనార్హం. మిస్ వరల్డ్ 71వ ఎడిషన్ వచ్చే నవంబర్లో జరిగే అవకాశాలున్నాయి. తేదీలు ఖరారు కావాల్సి ఉంది. చివరిసారిగా 1996లో ఈ పోటీకి భారత్ వేదికైంది. ‘71వ మిస్ వరల్డ్ ఫైనల్కు భారత్ వేదికైనట్లు ప్రకటిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. మీ ప్రత్యేకమైన, విభిన్న సంస్కృతి, ప్రపంచ స్థాయి ఆకర్షణలను ప్రపంచంతో పంచుకోవడానికి మేం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఈ పోటీలో 130 దేశాల చాంపియన్లు అద్భుతమైన భారత్లో తమ నెల రోజుల ప్రయాణంలో సాధించిన విజయాలను మిస్వరల్డ్ ఫైనల్లో ప్రదర్శించనున్నారు’అని మిస్ వరల్డ్ సంస్థ చైర్ పర్సన్, సీఈవో జులియా మోర్లే గురువారం మీడియాకు తెలిపారు. భారత్ తరఫున ఈ ఏడాది పోటీల్లో మిస్ ఇండియా వరల్డ్ సిని షెట్టి ఈ పోటీల్లో పాల్గొంటారు. #WATCH | Miss World 2022 Karolina Bielawska speaks on Miss World 2023 to be held in India. pic.twitter.com/fPxIK736MU — ANI (@ANI) June 8, 2023 -
బికినీయే కారణం కాదు!
‘మిస్ వరల్డ్’ కిరీటం సొంతం చేసుకోవడం అంత సులువు కాదు. చక్కటి శరీర కొలతలతో పాటు సమయ స్ఫూర్తి, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ... ఇలా ఎన్నో విషయాల్లో మార్కులు సంపాదిస్తేనే ఆ బిరుదు సొంతం అవుతుంది. అలాగే, ఈ పోటీల్లో భాగంగా ‘బికినీ రౌండ్’ ఒకటుంటుంది. ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ పోటీలో నిలిచే భామలు ఈత దుస్తులు ధరించాల్సిందే. అయితే, ఇక ఈత దుస్తులు ధరించాల్సిన అవసరంలేదు. ‘మిస్ వరల్డ్’ పోటీలకు అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న జూలియా మోర్లీ ఈ విషయాన్ని ప్రకటించారు. ఈత దుస్తుల వల్ల అమ్మాయికి ఒరిగేదేమీ లేదనీ, ఆ మాటకొస్తే దానివల్ల ఎవరికీ ఏమీ ఒరగదని ఈ సందర్భంగా జూలియా పేర్కొన్నారు. దీని గురించి ఐశ్వర్యా రాయ్ స్పందిస్తూ -‘‘1994లో నేను ప్రపంచ సుందరి కిరీటం గెల్చుకున్నాను. వాస్తవానికి ఆ సమయంలో నాతో పాటు పోటీలో నిలిచిన 87 మంది అమ్మాయిలతో పోలిస్తే నా శరీరాకృతి ఈత దుస్తులకు అనువుగా ఉండేది కాదు. కానీ, స్విమ్ సూట్ ధరించాలనే నిబంధన ఉండటంతో ఏమీ చేయలేకపోయాను. అయినప్పటికీ నేను ప్రపంచ సుందరి కిరీటం సాధించగలిగాను. ఈ కిరీటాన్ని ఎవరికి ఇవ్వాలో నిర్ణయించేది బికినీ రౌండే అని చాలామంది భావిస్తారు. కానీ, అదొక్కటే కాదు. ఆత్మవిశ్వాసం, ప్రవర్తన.. ఇలా చాలా విషయాలు పరిగణనలోకి తీసుకుంటారు. ఏదేమైనా బికినీ రౌండ్ తీసేసినందుకు చాలా ఆనందంగా ఉంది’’ అని చెప్పారు.