breaking news
Juan Manuel Santos
-
కొలంబియాలో కాల్పుల విరమణ
బొగోటా: కొలంబియాలో చారిత్రక కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. దీంతో గత 52 ఏళ్లుగా రివల్యూషనరీ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ కొలంబియా (ఎఫ్ఏఆర్సీ) తిరుగుబాటు దారులకు, ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న సాయుధ పోరుకు తెరపడింది. ఈ పోరులో ఇంతవరకు 2 లక్షల 50 వేలమందికి పైగా మరణించారు. పూర్తిస్థాయి కాల్పుల విరమణ ఒప్పందం ఆగస్టు 29 అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తుందని కొలంబియా అధ్యక్షుడు జువాన్ మాన్యుయల్, ఎఫ్ఏఆర్సీ అధినేత తిమోలియన్ జిమినెజ్ ప్రకటించారు. ‘మేము తుపాకులకు విశ్రాంతి కల్పిస్తున్నాం. ఎఫ్ఏఆర్సీతో యుద్ధం ముగిసిపోయింది’ అంటూ అధ్యక్షుడు మాన్యుయెల్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. -
'జికా' ఉచ్చులో 3వేల గర్భిణులు
బొగోటా: గతేడాది బ్రెజిల్ ను వణికించిన ప్రమాదకర జికా వైరస్ ఇప్పుడు కొలంబియా వాసులను హడలెత్తిస్తోంది. 3వేల మందికి పైగా గర్భిణులకు జికా వైరస్ వ్యాపించిందని కొలంబియా ప్రభుత్వ అధికారులు శనివారం అధికారికంగా ప్రకటించారు. మొత్తంగా దేశవ్యాప్తంగా 25,645 జికా కేసులు నమోదైనట్లు అధ్యక్షుడు జువాన్ మాన్యుయెల్ శాంటోస్ వెల్లడించారు. అమెరికాలో ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో వైద్యులకు జికా నిర్మూలనపై ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఇప్పటికే ఈ వ్యాధి కారణంగా అక్కడ ముగ్గురు మరణించిన విషయం తెలిసిందే. గర్భిణులకు ఈ వైరస్ సోకితే పుట్టే పిల్లలు చిన్న తలతో పుట్టడం జికా లక్షణాల్లో మరొకటి. దీనిపై ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సంఘం స్పందిస్తూ.. జికా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న లాటిన్ అమెరికా దేశాల్లో గర్భిణులకు అబార్షన్, గర్భనిరోధక విధానాలను పాటించాలని అధికారులకు సూచించింది. జికాను అరికట్టడానికి ఎలాంటి వ్యాక్సిన్ గాని, నిర్మూలనకు మందులు గానీ ఇప్పటికీ కనిపెట్టలేదు. దీంతో ప్రత్యామ్నాయ విధానాలవైపు దృష్టిసారించాలని కొలంబియా భావిస్తోంది.