breaking news
in jntuk
-
పైసా ఇచ్చేది లేదు..
తేల్చిచెప్పిన రాష్ట్ర ప్రభుత్వం జేఎ¯ŒSటీయూకేలో ఆర్థిక సంక్షోభం నిధులు లేక నిలిచిన పనులు పూర్తయిన భవనాలు ప్రారంభం కాని దుస్థితి బాలాజీచెరువు (కాకినాడ సిటీ) : ఎనిమిది జిల్లాలో ఉన్న ఇంజినీరింగ్, ఫార్మసీ మేనేజ్మెంట్ కళాశాలలకు వేదికగా ఉన్న జేఎ¯ŒSటీయూకేలో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. వర్సిటీగా ఆవిర్భవించి దాదాపు పదేళ్లు కావస్తున్నా ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు అభివృద్ధి కావడం లేదు. వర్సిటీగా ప్రకటించిన మూడో సంవత్సరంలో విడుదలైన నిధులతో కొన్ని ఆధునిక భవనాలను నిర్మించారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్థిక లోటు పేరుతో వర్సిటీకి నిధులు ఇవ్వలేమని, ఉన్న వనరులతో అభివృద్ధి చేసుకోవాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో అభివృద్ధి విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని పరిíస్థితి ఏర్పడింది. దాదాపు మూడేళ్ల క్రితం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన భవనాలను వినియోగంలోకి తీసుకురాగలిగితే గొప్ప విషయంగా వర్సిటీ వర్గాలు భావిస్తున్నాయి. ఇంజినీరింగ్ విద్యార్థులు వ్యాపారవేత్తలుగా రాణించేలా వారిని తీర్చిదిద్దడానికి జేఎ¯ŒSటీయూకేలో ఏర్పాటు చేసిన డిజై¯ŒS ఇన్నోవేష¯ŒS రీసెర్చ్ కేంద్రం నేటికీ ప్రారంభం కాలేదు. విద్యార్థులు ఉత్తమ వ్యాపార వేత్తలుగా ఎదిగేందుకు అవసరమయ్యే సలహాలను ఇవ్వడానికి ఈ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో సుమారు రూ.3.50 కోట్ల విలువైన పరికరాలు సమకూర్చారు. ఆంధ్రా ఎలక్ట్రానిక్స్, టీసీఎస్ తదితర సంస్థలు శిక్షణకు ముందుకు వచ్చాయి. ఈ భవన నిర్మాణం పూర్తయి ఎనిమిది నెలలైనా ప్రారంభించలేదు. దీంతో కొనుగోలు చేసిన పరికరాలు నిరుపయోగంగా మారాయి. విద్యార్థుల సౌకర్యార్థం స్టూడెంట్ ఎమినిటీ భవనం నిర్మించారు. బ్యాంకు, క్యాంటీన్, రీడింగ్‌రూమ్, బుక్‌స్టాల్ తదితర సదుపాయాలన్నీ ఒకేచోట ఉండేలా ఈ భవనాన్ని నిర్మించారు. అయితే ఈ భవనంలో కేవలం బ్యాంకు మాత్రమే ఏర్పాటు చేశారు. మరే సదుపాయాలు కల్పించకపోవడంతో ఆ భవనం నిరుపయోగంగా ఉంది. ప్రస్తుతం క్యాంటిన్, బుక్‌స్టాల్ పాత భవనంలో ఇరుకుగదిలోనే నిర్వహిస్తున్నారు. వర్సిటీ అధికారులు ఇప్పటికైనా స్పందించి నిర్మించిన భవనాలనైనా వినియోగంలోకి తేవాలని విద్యార్థులు కోరుతున్నారు. అందుబాటులోకి తెస్తాం.. డిజై¯ŒS ఇన్నోవేష¯ŒS సెంటర్‌ను ముఖ్యమంత్రితో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాం. నిర్మించిన స్టూడెంట్ ఎమినిటీ భవనంలో ప్రస్తుతానికి బ్యాంకు కార్యకలాపాలు నిర్వహిస్తునాం. మిగతావన్నీ ఇక్కడికి వచ్చేలా ఏర్పాట్లు చేస్తాం. – వీఎస్ఎస్ కుమార్, జేఎ¯ŒSటీయూకే ఉపకులపతి -
నిఘా నేత్రం
జేఎన్టీయూకేలో సీసీ కెమెరాల పటిష్ట నిర్వహణ ∙ బయోమెట్రిక్ ఏర్పాటుకు కసరత్తులు విద్యాలయాల్లో ర్యాగింగ్ వికృత క్రీడకు చరమగీతం పాడేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే అన్ని యూనివర్సిటీలు, కళాశాలల్లో సీసీ కెమెరాలను, బయోమెట్రిక్‌ను పటిష్టంగా అమలు చేయాలంటూ ఏపీ ఉన్నత విద్యామండలి జీఓ జారీ చేసింది. బాలాజీచెరువు (కాకినాడ) : ర్యాగింగ్ భూతాన్ని విద్యాలయాలనుంచి తరిమికొట్టే సత్సంకల్పంతో ఏపీ ఉన్నత విద్యామండలి జారీ చేసిన ఆదేశాల మేరకు గతేడాది జేఎన్టీయూ కాకినాడలో వర్సిటీ ఆవరణ, వివిధ విభాగాలు, వసతి గృహాల్లో అక్కడక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు వాటిని మరింత విస్తృతం చేసి విద్యార్థుల కదలికలపై నిఘా మరింత పెడుతున్నారు. విద్యార్థులకు ఎలక్ట్రానిక్ ఐడెంటీటీ కార్డులను మంజూరు చేయాలంటూ ఉన్నత విద్యామండలి వర్సిటీలకు మార్గదర్శకాలను జారీ చేసింది. గతంలో కళాశాలలో చదువు పూర్తయిన విద్యార్థులు ఏళ్ల తరబడి కళాశాలలో తిష్టవేసేవారు. ర్యాగింగ్‌కు కొందరు పాల్పడేవారు. ఇప్పుడు చేపట్టిన చర్యలతో అలాంటివారి ఆటలు సాగవు. ర్యాగింగ్‌కు ఎవరైనా పాల్పడితే సర్వర్ రి మోట్ సిస్టంలో విద్యార్థి ఆధారాలతో సహా పట్టుబడతాడు. అప్పుడు ర్యాగింగ్ కేసుల నమోదు, రౌడీషీట్ వంటి కేసులు సైతం ప్రత్యేక పరిస్థితుల్లో నమోదవుతాయి. అలా జరిగితే ఆ విద్యార్థి భవిష్యత్‌కు తీవ్ర విఘాతం కలుగుతుంది. అందుకే విద్యార్థులు వాటికి దూరంగా ఉంటారు. వసతి గృహాలపై ప్రత్యేక దృష్టి ప్రస్తుతం వర్సిటీలో 1,500 మందికి పైగా విద్యార్థులు బీటెక్, ఎంటెక్ చదువుతున్నారు. వసతి గృహాల్లోనే ర్యాగింగ్‌కు అవకాశం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వాటిపైనే ప్రత్యేక దృష్టి సాధించారు. సీనియర్లను జూనియర్లు సార్, మేడమ్ అంటూ సంబోధించడం, సీనియర్లకు ప్లేటులో అన్నం పెట్టించుకుని జూనియర్లు అందించడం, అనధికారికంగా హాస్టల్లో బస చేయడం వంటివి ఎన్నో ఏళ్లుగా సాగుతున్నాయి. అటువంటి పరిస్థితి నుంచి విముక్తి కలిగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. వసతి గృహం, ఇతర విభాగాల్లో బయోమెట్రిక్ ఏర్పాటు చేసేందుకు కావాల్సిన పరికరాలు త్వరలో రానున్నాయి. అప్పుడు విద్యార్థుల హాజరు కఠినతరం చేయడం, విద్యార్థులు తరగతి, వసతి గృహంలో ఉన్న సమయం, బయటకు వెళ్లే సమయం నమోదవుతుంది. దాంతో దురాగతాలకు చెక్ పడుతుంది. రాత్రివేళలో ప్రత్యేక నిఘా రాత్రులు సైతం వర్సిటీలో నిఘా పెట్టాం. రాత్రి 9 గంటల తరువాత నిఘా బృందాలు వర్సిటీలో తనిఖీలు నిర్వహిస్తున్నాయి. సీసీ కెమెరాల ఏర్పాటులో మిగిలిన వర్సిటీలతో పోలిస్తే ముందున్నాం. ఇప్పటికే వర్సిటీలోకి ప్రధానరహదారిన వచ్చే వాహనాల నెంబర్లను సెక్యూరిటీ సిబ్బంది నమోదు చేస్తున్నారు. అక్కడ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. – వెల్లంకి సాంబశివకుమార్, వైస్ చాన్సలర్, జేఎన్టీయూకే