breaking news
JEE main 2017
-
జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల
న్యూఢిల్లీ: ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే ఇతర జాతీయ స్థాయి సాంకేతిక విద్యా కాలేజీల్లో ప్రవేశాల కోసం ఈ నెల 2న నిర్వ హించిన జేఈఈ మెయిన్ ఫలితాలు నేడు (గురువారం) విడుదలయ్యాయి. ఈ పరీక్షకు తెలంగాణ వ్యాప్తంగా 65 వేల మంది విద్యార్థులు హాజరు కాగా, ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 78 వేల మంది హాజరయ్యారు. ఈ నెల 28 నుంచి మే 2 వరకు మెయిన్‌లో అర్హత సాధించిన టాప్ 2.20 లక్షల మంది నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తులను స్వీకరించనున్నారు. -
నేడు వెబ్సైట్లో జేఈఈ మెయిన్ కీ
- వెబ్సైట్లో విద్యార్థుల ఓఎంఆర్ జవాబు పత్రాల స్కాన్ కాపీలు - పొరపాట్లపై ఈనెల 22 వరకు అభ్యంతరాల స్వీకరణ - ఆన్లైన్లో రాసిన వారికి నో చాన్స్ - సీబీఎస్ఈ వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు ఈనెల 2న ఆఫ్‌లైన్‌లో నిర్వహించిన జేఈఈ మెయిన్ రాత పరీక్షకు హాజరైన విద్యార్థుల ఓఎంఆర్ జవాబు పత్రాలను, ‘కీ’లను మంగళవారం నుంచి ఈనెల 22 వరకు తమ వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) తెలిపింది. జేఈఈ మెయిన్ వెబ్సైట్లో విద్యార్థులు జవాబుల కీలను, ఓఎంఆర్ జవాబు పత్రాల స్కాన్ కాపీలను పొందవచ్చని పేర్కొంది. విద్యార్థులు ఓఎంఆర్ కాపీలను చూసుకొని, కీలలో పేర్కొన్న జవాబులపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ప్రత్యేకంగా ఇచ్చే లింకు ద్వారా ఆన్లైన్లో ఛాలెంజ్ చేయవచ్చని వెల్లడించింది. 22వ తేదీ అర్ధరాత్రి 11.59 గంటల వరకు వాటిని ఆన్లైన్ ద్వారా చేయాల్సి ఉంటుందని పేర్కొంది. అయితే విద్యార్థులు ఇందుకు రూ. 1,000 చెల్లించాల్సి ఉంటుందని, వాటిని నెట్ బ్యాంకింగ్/క్రెడిట్‌కార్డు/డెబిట్‌కార్డు ద్వారా చెల్లించవచ్చని వివరించింది. అభ్యర్థి చేసిన ఛాలెంజ్ సరైంది అయితే, కీలలో పొరపాట్లు ఉంటే వాటిపై నిఫుణుల కమిటీతో పరిశీలన జరిపించి బోర్డు నిర్ణయం తీసుకుంటుందని పేర్కొంది. వాటిని ఛాలెంజ్ చేసిన విద్యార్థులు చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తామని వివరించింది. ఈనెల 8, 9 తేదీల్లో నిర్వహించిన ఆన్లైన్ పరీక్షలకు హాజరైన విద్యార్థులకు ప్రశ్న పత్రాలు, జవాబులకు సంబంధించిన వివరాలను విద్యార్థుల రిజిస్టర్డ్ మెయిల్ ఐడీలకు పంపించినట్లు తెలిపింది. అయితే వారి నుంచి ఛాలెంజ్‌ను స్వీకరించబోమని సీబీఎస్ఈ పేర్కొంది.