breaking news
JDU leaders
-
జేడీయూ నేతలతో సమావేశమైన సీఎం నితీశ్
-
సీఎం పదవి ఖాళీగా లేదు! గొంతు చించుకుంటే సీఎం కాలేరు!
పాట్నా: జేడీయూ పార్టీ జాతీయ అధ్యక్షుడు లాలన్ సింగ్ బిహార్‌లోని జెహనాబాద్‌లో నివాళులర్పించే ఒక కార్యక్రమానికి వెళ్లారు. అక్కడ ఆయనకు ఒక విచిత్రమైన సంఘటన ఎదురైంది. ఈ మేరకు అక్కడ జరిగిన విలేకరులు సమావేశంలో జేడీయూ మాజీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి రామచంద్ర ప్రసాద్ సింగ్ (ఆర్పీసింగ్)కి మద్దతుగా కొంతమంది నినాదాలు చేయడంతో ఆయన ఒక్కసారిగా ఇబ్బందికి గురయ్యారు. ఆ తర్వాత లాలన్ సింగ్ తేరుకుని జేడీయూకి నితీష్ కుమార్ సార్వత్రిక నాయకుడు అని అన్నారు. బిహార్ రాష్ట్రం తమ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అని గర్విస్తోందని చెప్పారు. అయినా దాదాపు 15 కోట్ల జనాభా ఉన్న బిహార్‌లో ఎవరూ కూడా ఇలాంటి నినాదాలను పట్టించుకోరు. వందో రెండొందల మంది నినాదాలు చేస్తే సీఎం అయిపోరంటూ ఆర్పీసింగ్‌కి చురకలంటించారు. కాగా, ఆర్పీ సింగ్ మొదట రాజ్యసభకు వెళ్లాలనుకున్నారు, కానీ ఆ కల చెదిరిపోయింది. ఆ తర్వాత కేంద్ర మంత్రి వర్గానికి రాజీనామా చేశారు. అంతేకాదు రాజకీయపరంగా ఆయన చేసే వ్యాఖ్యలు కారణంగా ప్రభుత్వం ఇచ్చిన ఇంటిని సైతం ఖాళీ చేసే దుస్థితిని కొనితెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన బిహార్‌లో తన రాజకీయ భవిష్యత్తు కోసం తపిస్తున్నారని అందువల్లే ఇలాంటి నినాదాలు చేయిస్తున్నారంటూ మండిపడ్డారు. ఇలాంటి నినాదాలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని లాలన్ సింగ్ తేల్చి చెప్పారు. (చదవండి: శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు బిగ్ షాక్) -
కొత్త బట్టలు కూడా కుట్టించుకున్నారు
పట్నా: కేబినెట్లో జేడీయూకు చోటు లభించకపోవడంపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ వ్యంగ్యంగా స్పందించారు. కొంతమంది జేడీయూ నేతలు ప్రమాణ స్వీకారోత్సవానికి కొత్త బట్టలు కూడా కుట్టించుకున్నారనీ, కానీ వారికి మంత్రివర్గంలోకి ఆహ్వానమే అందలేదని లాలూ అన్నారు. పునర్వ్యవస్థీకరణ గురించి మోదీ తమతో ఒక్కమాట కూడా మాట్లాడలేదని జేడీయూ అధ్యక్షుడు, బిహార్ ముఖ్యమంత్రి నితీశే స్వయంగా ఒప్పుకున్నారని లాలూ అన్నారు. అమిత్ షా, మోదీలకు నితీశ్ వ్యక్తిత్వం గురించి తెలుసు కాబట్టే జేడీయూను మంత్రివర్గంలోకి తీసుకోలేదని విమర్శించారు.