breaking news
jayant singh
-
RLD chief Jayant Choudhary: ఎన్డీఏలోకి ఆరెల్డీ
లఖ్నో: చరణ్‌సింగ్‌కు భారతరత్న ప్రకటించడం ద్వారా నరేంద్ర మోదీ సర్కారు తన మనసు గెలుచుకుందని ఆయన మనవడు, ఇండియా కూటమి భాగస్వామి రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆరెల్డీ) అధ్యక్షుడు జయంత్సింగ్ అన్నారు. ‘దిల్ జీత్ లియా (మనసు గెలుచుకుంది)’ అంటూ శుక్రవారం ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత కొద్ది గంటలకే వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం ఉత్తరప్రదేశ్‌లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నట్టు మీడియాకు వెల్లడించారు. ‘‘మా తాతయ్యకు భారతరత్న ప్రకటించారు. ఎన్డీఏలో చేరాలన్న బీజేపీ ఆహా్వనాన్ని నేనెలా తిరస్కరించగలను?’’ అన్నారు. ‘‘ప్రధాని మోదీ ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు. మన దేశ స్వభావాన్ని, మౌలిక భావోద్వేగాలను తాను బాగా అర్థం చేసుకున్నానని నిరూపించుకున్నారు. కనుక సీట్లు, ఓట్ల చర్చ ఇప్పుడిక అప్రస్తుతం’’ అని జయంత్ స్పష్టం చేశారు. సర్దుబాటులో భాగంగా యూపీలో భాగ్‌పత్, బిజ్నోర్ లోక్‌సభ స్థానాలు ఆరెల్డీకి దక్కుతాయి. అలాగే ఒక రాజ్యసభ స్థానాన్ని కూడా బీజేపీ వాగ్దానం చేసినట్టు చెబుతున్నారు. ఉత్తర యూపీలో ఆరెల్డీకి చెప్పుకోదగ్గ పట్టుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో బీజేపీ ఓడిన 16 స్థానాల్లో ఏడు అక్కడే ఉన్నాయి. జయంత్ నిర్ణయంతో యూపీలో సమాజ్‌వాదీ పార్టీకి షాక్ తగిలింది. -
చిన్న రాష్ట్రాలతోనే ప్రగతి
ఆర్ఎల్డీ నేత జయంత్సింగ్ సాక్షి, హైదరాబాద్: చిన్నరాష్ట్రాల ఏర్పాటుతోనే దేశం అభివృద్ధి చెందుతుందని రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్ఎల్డీ) జాతీయ ఉపాధ్యక్షుడు జయంత్సింగ్ అన్నా రు. ఆదివారం రాత్రి నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో టీఆర్ఎల్డీ(తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్) ఆధ్వర్యంలో నిర్వహించిన సామాజిక తెలంగాణ యుద్ధభేరి సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చారిత్రాత్మక అవసరమని, ప్రజలు పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కపిల వాయి దిలీప్‌కుమార్, ప్రొఫెసర్ కేశవరావ్ జాదవ్, ఎమ్మెల్సీ ఆమోస్, విమలక్క, మల్లేపల్లి లక్ష్మయ్య, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, ప్రొ.లక్ష్మణ్, నారగోని, ఇందిరా దిలీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. జయంత్సింగ్తో టీ.జేఏసీ నేతల భేటీ జయంత్సింగ్తో తెలంగాణ జేఏసీ నేతలు ఆది వారం సమావేశమయ్యారు. జేఏసీ కో-చైర్మన్లు మల్లేపల్లి లక్ష్మయ్య, వి.శ్రీనివాస్‌గౌడ్, అడ్వొకేట్స్ జేఏసీ చైర్మన్ రాజేందర్ రెడ్డితో పాటు టీఆర్ఎల్డీ అధ్యక్షురాలు ఇందిరా దిలీప్‌కుమార్ తదితరులు జయంత్సింగ్ను కలిశారు. పోలవరం ముంపు గ్రామాలు మినహా మిగిలిన గ్రామాలన్నీ తెలంగాణ రాష్ట్రంలోనే ఉండాలని, దీనికోసం యూపీఏ ప్రభుత్వంపై ఆర్ఎల్డీ ఒత్తిడి తీసుకురావాలని జయంత్సింగ్ను వారు కోరారు.