breaking news
Jaya B
-
Jaya B: దర్శకురాలిగా టాలీవుడ్లో తనదైన ముద్ర
టాలీవుడ్లో దర్శకత్వ శాఖలో పని చేసే మహిళలు చాలా తక్కువ మందే ఉన్నారు. తమదైన టాలెంట్‌తో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించిన మహిళలను వెళ్లపై లెక్కించొచ్చు. అలాంటి వారిలో బి.జయ ఒకరు. జర్నలిస్ట్‌గా కెరీర్‌ని ప్రారంభించి.. దర్శకురాలిగా మారి చంటిగాడు,గుండమ్మగారి మనవడు, లవ్లీ వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన బి. జయ జయంతి నేడు(జనవరి 11). ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో జన్మించారు బి.జయ(1964). చెన్నయ్ విశ్వవిద్యాలయంలో ఎం.ఎ.(ఇంగ్లీష్ లిటరేచర్), జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేశారు. అంతేకాదు, అన్నామలై విశ్వవిదాలయంలో ఎం.ఎ.(సైకాలజీ) అభ్యసించారు. చదువు పూర్తి కాగానే సినిమా జర్నలిస్ట్‌గా తన కెరీర్‌ని ప్రారంభించారు. పత్రికా రంగంలో కొన్నేళ్లపాటు కొనసాగిన తర్వాత సినిమా రంగంపై ఉన్న మక్కువతో దర్శకత్వ శాఖలో చేరి కొన్ని సినిమాలకు సహాయ దర్శకురాలిగా పనిచేశారు.అదే సమయంలో ఫిల్మ్ జర్నలిస్ట్‌గా, పి.ఆర్.ఓ.గా సినిమా రంగంలో మంచి పేరు తెచ్చుకుంటున్న బి.ఎ.రాజును వివాహం చేసుకున్నారు. ఈ ఇద్దరూ పూర్తి అంకితభావంతో తమ బాధ్యతలను నిర్వర్తించేవారు.సినిమా రంగంతో ఎన్నో సంవత్సరాలుగా ఉన్న అనుబంధం, దర్శకత్వంపై తనకు ఉన్న ప్యాషన్ కారణంగా దర్శకత్వం వైపు జయ దృష్టి సారించారు. దానికి భర్త బి.ఎ.రాజు కూడా పూర్తి సహకారం అందించడంతో సూపర్‌హిట్ ఫ్రెండ్స్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి మొదటి ప్రయత్నంగా ‘ప్రేమలో పావని కళ్యాణ్’ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి బి.జయ దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. ఆ తర్వాత ‘చంటిగాడు’ చిత్రంతో దర్శకురాలిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మొదటి సినిమాతోనే ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నారు జయ. ఈ సినిమా 25 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. ఆ తర్వాత ప్రేమికులు, గుండమ్మగారి మనవడు, సవాల్, లవ్లీ, వైశాఖం వంటి సినిమాలను రూపొందించి భానుమతి, విజయనిర్మల తర్వాత అంతటి సక్సెస్ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు బి.జయ.బి.ఎ.రాజు, బి.జయ దంపతులకు సినిమా రంగంతో విశేష అనుబంధం ఉండేది. హీరోలు, దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్స్ అందరికీ వీరంటే ప్రత్యేక అభిమానం. ఇక తోటి జర్నలిస్టులతో ఈ దంపతులకు ఉన్న అనుబంధం ఎంతో గొప్పది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ ఎంతో గౌరవించేవారు. ఆ కారణంగానే సినిమా జర్నలిస్టులందరూ వారిని ఆత్మీయులుగా భావించేవారు. 2018లో బి.జయ మరణం అందర్నీ కలచివేసింది. తమ కుటుంబ సభ్యురాలు దూరమైందని సినీ పాత్రికేయులంతా భావించారు. బి.జయతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె జయంతి సందర్భంగా ఫిల్మ్ జర్నలిస్టులంతా ఘన నివాళులు అర్పిస్తున్నారు. -
నా భర్త ఎక్కుడున్నా!..నా హృదయం మాత్రం ఆ జట్టుతోనే: టీమిండియా స్టార్ భార్య(ఫొటోలు)
-
హిట్ గ్యారెంటీ
– పూరి జగన్నాథ్ ‘‘రాజుగారు, జయగారు మా కుటుంబ సభ్యుల్లాంటివారు. జయగారు ఏ సినిమా తీసినా ఆ సినిమాలోని పాటలు, ట్రైలర్ నాకు చూపిస్తుంటారు. ‘వైశాఖం’ పాటలు చాలా బాగున్నాయి. వసంత్ మంచి మ్యూజిక్ ఇచ్చారు’’ అని దర్శకుడు పూరి జగన్నాథ్ అన్నారు. హరీశ్, అవంతిక జంటగా జయ బి. దర్శకత్వంలో బీఏ రాజు నిర్మించిన ‘వైశాఖం’ జూన్ ఫస్ట్ వీక్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘వైశాఖం’ పాటల్ని పూరి ప్రత్యేకంగా వీక్షించి, మాట్లాడారు. ‘‘హరీశ్, అవంతిక ఫుల్ ఎనర్జిటిక్‌గా పోటీపడి నటించారు. ఇద్దరికీ మంచి ఫ్యూచర్ ఉంటుంది. లొకేషన్స్ చాలా కొత్తగా, రిచ్‌గా ఉన్నాయి. విజువల్స్ బ్యూటిఫుల్. ‘వైశాఖం’ తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది’’ అన్నారు. ‘‘లవ్లీ’ పాటలు చూసి పూరి జగన్నాథ్‌గారు మమ్మల్ని అభినందించారు. ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది. ఆ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ అనూప్‌కి తన తర్వాతి చిత్రంలో అవకాశమిచ్చారు. పూరీని ఇన్స్పైర్ చేసేలా ‘వైశాఖం’ పాటలు ఉండటం నిజంగా హ్యాపీ’’ అని జయ అన్నారు. ‘‘ పూరీగారు చెప్పినట్టు ‘వైశాఖం’ పెద్ద హిట్ కావడం ఖాయం’’ అన్నారు బీఏ రాజు.