జపాన్ పెయింటింగ్ పోటీలకు తెలంగాణ కళాకారులు
హైదరాబాద్: అంతర్జాతీయ పెయింటింగ్ ప్రదర్శనలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన కళాకారులు పాల్గొనున్నారు. జపాన్ లో జరిగే చిత్ర ప్రదర్శనకు స్వాతి, విజయ్ లను ప్రభుత్వం ఎంపిక చేసింది.
స్వాతి, విజయ్ లు ప్రభుత్వ ఖర్చులతో ఈ పోటీలలో పాల్గొన్నున్నట్టు అధికారులు వెల్లడించారు. వీరికి లక్షన్నర రూపాయల ఆర్ధిక సహాయాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.