జంపన్నవాగులో భక్తుడు గల్లంతు
మేడారం(తాడ్వాయి): మండలంలోని మేడారం జంపన్నవాగులో ఓ భక్తుడు గల్లంతయిన ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. వరంగల్‌కు చెందిన కార్పెంటర్ గుంటోజు శ్రీధర్ స్నేహితులతో కలి సి మేడారం దేవతలను దర్శించుకునేందుకు వచ్చాడు. జంపన్నవాగు ఊరట్టం కాజ్వే సమీపంలో ఆదివారం సాయంత్రం బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు వాగులో పడి గల్లంతయ్యాడు. స్నేహితులు వాగులో వెదికినా ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సోమవారం ఈతగాళ్ల సహాయంతో వాగులో వెదికిన అచూకీ దొరకలేదు. శ్రీధర్ గల్లంతయిన విష యం తెలిసి భార్య,కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. శ్రీధ ర్ ఆచూకీ కోసం గాలింపుచర్యలు చేపట్టినట్లు ఎస్సై కరుణాకర్‌రావు తెలిపారు.