breaking news
jamathe meeting
-
తబ్లీగి జమాత్: క్రిమినల్ కేసు నమోదు.. అరెస్టు
సాక్షి, హైదరాబాద్: నిజాముద్దీన్‌లో తబ్లీగి జమాత్‌కు హాజరై హైదరాబాద్‌లో తలదాచుకుంటున్న ఆరుగురు మలేషియన్లపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. టోలిచౌకి సమీపంలోని హకీంపేట మజీదు వద్ద మలేషియాకు చెందిన హమీద్‌బిన్ జేహెచ్ గుజిలి, జెహ్రాతులామని గుజాలి, వారామద్ అల్ బక్రి వాంగ్, ఏబీడీ మన్నన్ జమాన్ బింతి అహ్మద్, ఖైరిలి అన్వర్ బాన్ అబ్దుల్ రహీం, జైనారియాలు తదితర ఆరుగురు మలేషియా వాసులు టూరిస్ట్ వీసాపై ఇండియాకు వచ్చి న్యూఢిల్లీలో జరిగిన తబ్లీగి జమాత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరంతా మలేషియా వెళ్లేందుకు ప్రయత్నించగా అప్పటికే కరోనా వైరస్ విజృంభిస్తూ దేశంలో లాక్డౌన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఈ ఆరుగురు న్యూఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ హకీంపేటకు వచ్చి ఇక్కడ మసీదులో షెల్టర్ తీసుకున్నారు. మజీదు ఇన్చార్జి అనుమతితో రెండు రోజులుగా ఈ ఆరుగురు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే తలదాచుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సమాచారం ఇవ్వకుండానే ఉండటాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించి సోదాలు నిర్వహించారు. వీరిపై ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్‌తో పాటు ఐపీసీ సెక్షన్ 420, 269, 270, 188, 109, ఫారెనర్స్ యాక్ట్ కింద క్రిమినల్ కేసులు నమోదు చేసి గాంధీ ఆస్పత్రికి తరలించారు. వీరందరిని గాంధీలో క్వారంటైన్లో ఉంచారు. పోలీసులకు తెలియకుండా, రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా తబ్లీగి జమాతేకు వెళ్లి వచ్చిన ఆరు మంది మలేషియన్లకు ఆశ్రయం కల్పించినందుకు హకీంపేట మజీదు ఇన్చార్జి మీద కూడా క్రిమినల్ కేసు నమోదైంది. (తెలంగాణలో కొత్తగా 30 కరోనా కేసులు) -
సెప్టెంబర్ 4 వరకు ‘శాంతి’ ఉద్యమం
జమాతె ఇస్లామీ హింద్ పిలుపు సంగారెడ్డి టౌన్: సర్వమతాలకు నిలయమైన మన దేశంలో మత రాజకీయాలు ఎక్కువయ్యాయని, మతసామరస్యానికి, శాంతిని కోరుకొనే మానవతా వాదులంతా కలిసి రావాలని జమాతె ఇస్లామీ హింద్ (జెఐహెచ్) పిలుపునిచ్చింది. ఆదివారం సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జెఐహెచ్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు హాఫిజ్ మహ్మద్ రిషాదోద్దీన్ మాట్లాడుతూ శాంతి స్థాపన కోసం, మతసామరస్యం కోసం దేశవ్యాప్తంగా ఈ నెల 21 నుంచి సెప్టెంబర్ 4 వరకు ‘శాంతి-మానవత ఉద్యమం’ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ధార్మిక్ జన్‌మోర్చా కార్యక్రమం ద్వారా రాష్ట్ర, నగర స్థాయిలలో, సద్భావనా మంచ్ ద్వారా కింది స్థాయి వరకు కార్యక్రమాలను తీసుకెళ్తామన్నారు. కార్యక్రమం ముగింపు సందర్భంగా సెప్టెంబర్ 4న హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ ఉంటుందన్నారు. కార్యక్రమంలో జెఐహెచ్ జిల్లా అధ్యక్షుడు అంజద్ హుస్సేన్, జెఐహెచ్ సంగారెడ్డి అధ్యక్షుడు గౌస్ మోయియోద్దీన్, జెఐహెచ్ సంగారెడ్డి ప్రెస్ అండ్ పబ్లిసిటీ కార్యదర్శి మహ్మద్ అతర్ మోహియోద్దిన్ షాహెద్, యండి అన్వర్ తదితరులు పాల్గొన్నారు.