breaking news
Jaggayapet
-
భయం గుప్పెట్లో జగ్గయ్యపేట
సాక్షి ప్రతినిధి, విజయవాడ/లబ్బిపేట/జగ్గయ్యపేట : ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో డయేరియా (అతిసార) విస్తరిస్తోంది. ఇప్పటికే ఆ ప్రాంతానికి చెందిన ఆరుగురు ఈ కారణంతో మృత్యువాత పడడంతో జగ్గయ్యపేట పట్టణంతో పాటు, పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనతో వణికిపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 23 గ్రామాల్లో 168 డయేరియా కేసులు నమోదుకాగా, ఒక్క జగ్గయ్యపేట నియోజకవర్గంలోనే అధికారికంగా 58 కేసులు నమోదయ్యాయి. కొందరు బాధితులు ఖమ్మం, విజయవాడ, జగ్గయ్యపేట ప్రాంతాలకు వెళ్లి చికిత్స పొందుతుండడంతో ఇవి అధికార లెక్కల్లోకి రావటంలేదు. ఇక్కడ ఇప్పటికే ఆరుగురు మృతిచెందినప్పటికీ ఇద్దరు మాత్రమే మృతిచెందినట్లు అధికారులు నిర్ధారించారు. మరోవైపు.. ఆదివారం ఒక్కరోజే జగ్గయ్యపేట, వత్సవాయి మండలాలకు చెందిన11 మంది వాంతులు, విరేచనాలతో జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రిలో చేరారు. ఇప్పటికే 32 మంది చికిత్స పొందుతుండగా 12 మంది డిశ్చార్జ్ అయ్యారు. వైద్య, ఆరోగ్యశాఖ జాప్యం..జగ్గయ్యపేట పట్టణంతో పాటు, షేర్ మహమ్మద్‌పేట, మక్కపేట, చిల్లకల్లు, బూదవాడ, అనుమంచిపల్లి, గండ్రాయిల్లో డయేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. మృత్యువాత పడిన వారు కూడా ఈ ప్రాంతాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. నిజానికి.. వైద్య, ఆరోగ్యశాఖ ఈ నెల 20నే డయేరియా కేసులను గుర్తించినా అదుపు చేయడంలో జాప్యం జరిగింది. ఆ తర్వాత అప్రమత్తమై ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటుచేసింది. కానీ, అధికారుల హడావిడి తప్ప క్షేత్రస్థాయిలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కరువయ్యాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. నీరు కలుషితం.. లోపించిన పారిశుధ్యం..ఇదిలా ఉంటే.. డయేరియా సోకుతున్న గ్రామాల్లో నీరు కలుషితమైనట్లు వైద్యశాఖ అధికారులు గుర్తించారు. అలాగే, పారిశుధ్యం కూడా అస్తవ్యస్థంగా ఉందని.. నీటిని సరఫరా చేసే రక్షిత మంచినీటి ట్యాంకులు కూడా అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. ప్రధానంగా గ్రామాల్లో పారిశుధ్యం పూర్తిగా లోపించింది. ఉదా.. షేర్‌హమ్మద్‌పేట చెరువు ఒడ్డునే తాగునీటి బావి ఉంది. అక్కడ బావి పక్కనే చెత్త చెదారం పేరుకుపోయి ఉంది. పైగా ఆ బావిపైన మెస్ కూడా లేకపోవడంతో నీరు పూర్తిగా కలుషితమవుతోందని గ్రామస్తులు చెబుతున్నారు. అలాగే, అనుమంచిపల్లి, గండ్రాయి, బూదవాడ ప్రాంతాల్లోని పారిశుధ్యం పరిస్థితి కూడా ఇంతే. మక్కపేట ప్రాంతంలో తాగునీటిని ఫిల్టర్ చేయకుండానే సరఫరా చేస్తున్నట్లు సమాచారం.ప్రత్యేక బృందాల ఏర్పాటు..ఇక డయేరియా సోకుతున్న గ్రామాల్లో శానిటేషన్ మెరుగుదలకు వైద్య, ఆరోగ్యశాఖ 40 ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసింది. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో 45 పడకలతో ప్రత్యేక వార్డును ఏర్పాటుచేశారు. మరోవైపు.. జగ్గయ్యపేట ప్రాంతాన్ని ఆదివారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పర్యటించి బాధితులను పరామర్శించారు. ఆయా శాఖాధికారులతో పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులు అప్రమత్తంగా ఉండడంలేదని, అలసత్వం వహిస్తున్నారని.. అలాంటి వారిని ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు. గ్రామాల్లో ఇంటింటి సర్వేచేయాలని, వైద్య శిబిరాలు ఏర్పాటుచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణబాబు, కమిషనర్ వెంకటేశ్వర్, జేసీ సంపత్‌కుమార్, ఆర్డీఓలు రవీందర్, మాధవి, డీఎంహెచ్ఓ సుహాసిని, వైద్యారోగ్య శాఖ అడిషనల్ ఏడీ సుబ్రహ్మణ్యశ్రీ, మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర తదితర అధికారులు పాల్గొన్నారు.217 చోట్ల నీరు కలుషితం రాష్ట్రవ్యాప్తంగా 168 డయేరియా కేసులు నమోదయ్యాయని.. ఇందులో ఒక్క జగ్గయ్యపేటలోనే 58 కేసులున్నాయని మంత్రి చెప్పారు. ముఖ్యంగా డిస్ట్రిబ్యూటరీ చానళ్లను శుభ్రం చేయకపోవడం, పైపులైన్ల లీకేజీల వల్ల తాగునీటిలో డ్రెయినేజీ మురుగు కలవడం ఇందుకు కారణమన్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ప్రతి బుధవారం గ్రామీణ ప్రాంతాల్లో నీటి పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి సత్యకుమార్ ప్రకటించారు. ఇప్పటికే 30 వేలకు పైగా నీటి వనరులు నమూనాలు పరీక్షించగా 217 ప్రాంతాల్లో నీరు కలుషితమైనట్లు అధికారులు గుర్తించారన్నారు. -
జగ్గయ్యపేటలో ఘోర రోడ్డు ప్రమాదం
-
‘కోడెల’ రాజీనామా చేయాలి
జగ్గయ్యపేట అర్బన్ : గుంటూరు జిల్లా ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నికల్లో పాల్గొనడానికి వస్తున్న వైఎస్సార్ సీపీ శాసనసభ్యుడు, ఎంపీటీసీ సభ్యులు, పలువురు నేతలపై టీడీపీ గూండాలు దాడిచేయడం హేయమైన చర్య అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను అన్నారు. ఈ దాడికి నైతిక బాధ్యత వహిస్తూ ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం తన స్వగృహంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఉదయభాను మాట్లాడుతూ గుంటూరు ఎమ్మెల్యే ముస్తఫా, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబుతోపాటు నలుగురు ఎంపీటీసీ సభ్యులపై తెలుగుదేశం గూండాలు తెగబడి వాహనాన్ని అడ్డగించి దౌర్జన్యంగా, అక్రమంగా భయానక వాతావరణం సృష్టించి, రక్తం వచ్చేలా తీవ్రంగా కొట్టడం దారుణమన్నారు. ఇది తెలుగుదేశం పార్టీ నిరంకుశ వైఖరి, అప్రజాస్వామిక విధానాలకు నిదర్శనమన్నారు. ఈ ఘటనపై చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక సమస్యల ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తన స్థాయిని మరిచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులతో ఫోన్లో సంప్రదింపులు జరపడం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఈ సంఘటనపై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర గవర్నర్ జోక్యం చేసుకుని దాడులకు పాల్పడిన వారిపై హత్యానేరం, కిడ్నాప్ కేసులు నమోదుచేయాలని కోరారు. ఇదే తీరులో తెలుగుదేశం శ్రేణులు 15 రోజులుగా ప్రకాశం, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో దాడులకు తెగబడి రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీ నాయకులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాలపై తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసిన రెండు రోజులకే ఇటువంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. టీడీపీ దాడులను ఆపకపోతే వైఎస్సార్ సీపీ శ్రేణులు ప్రత్యక్ష దాడులకు దిగుతాయని ఉదయభాను హెచ్చరించారు. సమావేశంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి, మున్సిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ ముత్యాల చలం, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు జగదీష్, నంబూరి రవి, పారిశ్రామికవేత్త తుమ్మేపల్లి గోపాల్ తదితరులు పాల్గొన్నారు. మైనార్టీ నేతల ఖండన.. వాహనంలో వెళ్తున్న గుంటూరు శాసనసభ్యుడు ముస్తఫా, ఆయన కుటుంబసభ్యులు, మహిళలపై విచక్షణారహితంగా దాడులు చేయడంపై వైఎస్సార్ సీపీ పట్టణ కన్వీనర్ మదార్‌సాహెబ్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎం.డి.అక్బర్, మైనార్టీ నాయకులు పి.ఫిరోజ్‌ఖాన్ తదితరులు తీవ్రంగా ఖండించారు. -
ఇదో ‘పరీక్ష’
జగ్గయ్యపేట : ఒంటినిండా గాయాలతో.. సహాయకుడి సహకారంతో పరీక్ష రాస్తున్న ఈ విద్యార్థి పేరు మాదారపు పూర్ణచంద్రరావు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గౌరవరం ఇతడి స్వగ్రామం. ఉగాది పండుగ రోజున ద్విచక్ర వాహనంపై డ్రైవింగ్ నేర్చుకునే ప్రయత్నంలో డివైడర్‌కు ఢీకొన్న ప్రమాదంలో తలకు, కుడిచేయికి తీవ్ర గాయాలయ్యాయి. పరీక్ష రాసే పరిస్థితి లేకపోవడంతో చిల్లకల్లు పబ్లిక్ పరీక్షా కేంద్రం ఇన్చార్జికి తెలియజేశారు. ఆయన ఆదేశంతో ఆ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థి సహాయంతో బుధవారం ఇదిగో ఇలా పరీక్షలు రాశాడు