breaking news
Jabardasth program
-
గ్రాండ్‌గా టాలీవుడ్ కమెడియన్ పెళ్లి.. ఫోటోలు వైరల్!
టాలీవుడ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే కామెడీ షో జబర్దస్త్. ఈ షో ద్వారా ఎంతోమంది ఫేమస్ అయ్యారు. ముఖ్యంగా లేడీ గెటప్స్‌లో ఆడియన్స్‌ను అలరిస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి వారిలో వినోద్, కొమరం, శాంతి స్వరూప్, మోహన్, తన్మయ్, సాయితేజ, పవన్, అప్పారావు చాలామందే ఉన్నారు. ప్రస్తుతం ఈ కామెడీ షో లేడీ గెటప్స్‌లో అలరిస్తున్న మోహన్ ఓ ఇంటివాడయ్యారు. తాజాగా మోహన్ పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. ఈ వేడుకలో జబర్దస్త్ నటులు రాకెట్ రాఘవ, అధిరే అభి, గడ్డం నవీన్, అప్పారావు సహా పలువురు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోను జబర్దస్ కమెడియన్ నవీన్ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ప్రస్తుతం మోహన్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by jabardasth naveen (@gaddamnaveenofficial) View this post on Instagram A post shared by Harikrishna Jabardasth ❤️ (@harikrishna_jabardasth) -
పవన్‌కల్యాణ్ నా దేవుడు
చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి సత్తా నిరూపించుకోవడానికి జబర్దస్త్ ప్రోగ్రాం ఉపయోగపడింది ‘గీతాంజలి’తో వెండితెరకు పరిచయం సాక్షితో హాస్యనటుడు షకలక శంకర్ భూదాన్‌పోచంపల్లి : సినిమా పరిశ్రమలో నేటి తరం హాస్య నటుల్లో షకలక శంకర్‌ది ప్రత్యేకమైన స్థానం. వెండితెరపై తన హావాభావాలతో నవ్వులు పూయిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాడు. అనతికాలంలోనే రెండు పదులకు పైగా సినిమాల్లో నటించాడు. ఇటీవల విడుదలైన రాజుగారి గది సినిమా విజయవంతమై అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం 15కు పైగా చిత్రాల్లో న టిస్తూ బిజీ నటుడి మారాడు. బుధవారం గౌస్‌కొండ గ్రామ పరిధిలో జరిగిన బుర్రకథ సినిమా షూటింగ్లో పిచ్చివాడి పాత్రను పోషిస్తున్న శంకర్ తన సినీ జీవిత విశేషాలను సాక్షితో పంచుకున్నాడు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...... ప్రతి సినిమా ఐదారుసార్ల చూసేది నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా పిచ్చి. చదువుకొనే రోజుల్లో మా స్కూల్ పక్కనే సినిమా థియేటర్ ఉండేది. అందులో ఆడే ప్రతి సినిమాను ఐదారు సార్లు చూసేవాడిని. ఇలా ఎప్పటికైనా సినిమాల్లో నటించాలని కోరిక ఏర్పడింది. జబర్ద్‌స్త్ ప్రొగ్రాం ద్వారా... నాలో ఉన్న టాలెంట్‌ను నిరూపించుకోవ డానికి జబర్ద్‌స్త్ ప్రొగ్రాం ఎంతో దోహదపడింది. నిరంతరంగా రెండేళ్ల పాటు సాగిన ప్రోగ్రాంలో ఎన్నో వైవిధ్యమైన హాస్యపాత్రలు పోషించి తన నటనను మెరుగుపర్చుకున్నా. ఈ వేదికే సినిమా రంగంలోకి అడుగిడగడానికి దోహదపడింది. నాగబాబు, సంజీవ్‌కుమార్ ఎంతో ప్రోత్సహించారు గీతాంజలి సినిమాతో వెండితెరకు పరిచయం అ య్యాను. నన్ను నటుడు నాగబాబు, దర్శకుడు సం జీవ్‌కుమార్ సినిమాల్లో ఎంతో ప్రోత్సహించారు. ఇ ప్పటి వరకు 15పైగా సినిమాల్లో నటించాను. వీ టిలో ఎక్స్‌ప్రెస్ రాజా, రాజుగారి గది మంచి పేరుతెచ్చా యి. అలాగే లౌక్యం, రన్ రాజా రన్, గరం, డిక్టేట ర్, సర్థార్ గబ్బర్‌సింగ్ తదితర సినిమాలు గుర్తింపుని చ్చాయి. 15 సినిమాలు విడుదలకు ఉన్నాయి ప్రస్తుతం 15 సినిమాల వరకు విడుదలకు ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా అల్లరి నరేష్‌తో ‘వీడు గోల్డ్ ఏహే’, రైట్..రైట్, త్రివిక్రమ్ దర్శకత్వంలో అ..ఆ, సెల్ఫీ, హీరో సునిల్‌తో ఓ సినిమాలతో పాటు, మరికొని ఇంకా పేరు పెట్టని చిత్రాలున్నాయి. నాన్న సర్పంచ్ నా అసలుపేరు ఎస్.శంకర్రావు. మాది శ్రీకాకుళం జిల్లా ఏచెర్ల గ్రామం. మానాన్న రామారావు ప్రస్తుతం గ్రామ సర్పంచ్. అమ్మ లక్ష్మి గృహిణి. పవన్‌కల్యాణ్‌కు వీరాభిమానిని.. ప్రముఖ హీరో పవన్‌కల్యాణ్ నా దేవుడు. ఆయనంటే ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేను. చిన్నప్పటి నుంచి ఆయన వీరాభిమానిని నేను. రాజుగారి గది, రాజా ఎక్స్‌ప్రెస్‌లో నా నటను చూసి పవన్‌కల్యాణ్‌తో పాటు హాస్యనటులు నరేశ్, సునిల్, ఆలీ మెచ్చుకున్నారు. వారు చూపిన అభిమానం ఎన్నటికి మరువలేను. ప్రస్తుతం సినిమాల్లో తీవ్రమైన పోటీ ఉంది. అయినప్పటికీ ఎవరి టాలెంట్ వారిదే. ప్రేక్షక దేవుళ్లు ఆదరించినంతకాలం ఇలా నవ్విస్తూనే ఉండాలన్నది నా కోరిక.