నకిలీ సర్టిఫికెట్లు సమర్పిస్తే వీసా నిరాకరణ
కేయూ క్యాంపస్ : ఉన్నత చదువుల నిమిత్తం అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులు వీసా కోసం దరఖాస్తు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని హైదరాబాద్లోని అమెరికన్ కాన్సులేట్ ప్రతినిధి ఆడం ఫర్సూనస్ సూచించారు. వీసా దరఖాస్తు, యూనివర్సిటీల ఎంపికలో విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు గురువారం కేయూ సెనేట్ హాల్లో సదస్సు ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆడం ఫర్సూనస్ పవర్ పాయింట్ ప్రజెంటే షన్ ద్వారా పలు అంశాలను వివరించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ అమెరికాలోని యూనివర్సిటీల్లో చదువు ఖ ర్చుతో కూడుకున్నదని తెలిపారు. దీన్ని గుర్తించి స్థోమతకు తగినవి ఎంపిక చేసుకోవాలని సూ చించారు. నకిలీ సర్టిఫికెట్లు సమర్పిస్తే వీసా నిరాకరించడంతో పాటు భవిష్యత్లో దారులు మూసుకుపోతాయన్నారు. కాగా, ఆడం ఫర్సూనస్ తొలుత కేయూ వీసీ ప్రొఫెసర్ ఆర్.సాయన్న, ఇన్చార్జి రిజిస్ట్రార్ జి.బెనర్జీ, ప్రిన్సిపాల్ రవీందర్రెడ్డి, ప్రొఫెసర్ పి.మల్లారెడ్డి, పరీక్షల నియంత్రణాధికారి కె.పురుషోత్తం, ఇన్ఫార్మటిక్స్ విభాగం డాక్టర్ మంజులతో భేటీ అయ్యా రు. కేయూ సర్టిఫికెట్ల ముద్రణలో తీసుకుంటు న్న జాగ్రత్తలను తెలుసుకున్నారు. అమెరికన్ కాన్సులేట్ ప్రతినిధులు సునీత, తన్నీరు, కిషోర్ పాల్గొన్నారు.