breaking news
iron sheets
-
జస్ట్ మిస్..!
-
దొంగతనానికి వచ్చి.. రేకుల మధ్య చిక్కుకొని..
చంద్రశేఖర్‌కాలనీ (నిజామాబాద్): నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల సుఖ్జిత్ ఫ్యాక్టరీ ప్రధాన గేట్ పక్కన గల శ్రీ మహాలక్ష్మి ఆలయంలో బుధవారం మధ్యాహ్నం ఓ వ్యక్తి చోరీకి యత్నించాడు. అయితే ఆలయం రేకుల మధ్య చిక్కుకొని దొరికిపోయాడు. రూరల్ ఎస్సై లింబాద్రి తెలిపిన వివరాల ప్రకారం.. ఆలయంలో చోరీ చేయడానికి ఓ వ్యక్తి గోడపై నుంచి లోపలికి వెళ్లడానికి యత్నించాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఆలయం రేకుల మధ్య ఇరుక్కుపోయాడు. రేకుల మధ్య ఉన్న నిందితుడిని చూసి పక్కన ఉన్న కొందరు రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని బయటకు తీశారు. అనంతరం నిందితుడిపై దొంగతనం కేసు నమోదు చేసినట్లు ఎస్సై లింబాద్రి తెలిపారు. అతడిని ఆర్మూర్ మండలం మామిడిపల్లికి చెందిన రఘుగా గుర్తించామన్నారు. రఘుపై ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో కూడా కేసు ఉందని ఆయన పేర్కొన్నారు. చదవండి: Putta Madhu: ఫోన్ స్విచ్ఛాఫ్.. పుట్ట మధు ఎక్కడ..? Etela Rajender: ఈటలకు షాకిచ్చేందుకు ‘కెప్టెన్’ రెడీ! -
స్తంభించిన రైళ్లు
విశాఖపట్నం సిటీ: తూర్పు కోస్తా రైల్వేలోని ప్రధానమైన విశాఖ రైల్వే స్టేషన్ చిగురుటాకులా వణికిపోయింది. శనివారం అర్ధరాత్రి నుంచే మొదలైన గాలులకు రైల్వే సిబ్బంది అప్రమత్తమయ్యారు. భీకర గాలులకు ఎగిరిపోతున్న పైకప్పులను సరి చేసే లోపే మరో ప్లాట్‌ఫాం మీద వున్న పై కప్పులు ఎగిరిపోతుండడంతో ఆఖరికి సిబ్బంది సైతం చేతులెత్తేశారు. ప్లాట్‌ఫార పై ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోయాయి. ప్లాట్‌ఫాంపై వున్న ఐఆర్సీటీసీ దుకాణాలన్నీ బంతుల్లా దొర్లాయి. విశాఖ రైల్వే స్టేషన్‌లోని 8 ప్లాట్‌ఫాంలపై ఉన్న ఆస్బెస్టాస్ సిమెంట్ రేకులు, ఐరన్ షీట్లు కాగితాల్లా ఎగిరిపోయాయి. అత్యవసర ప్రయాణాలు చేద్దామనుకున్న వారంతా చిగురుటాకుల్లా వణికిపోయారు. రైళ్లరద్దుతో వేలాది మంది ప్రయాణికులు వచ్చి టికెట్లు రద్దు చేసుకుంటారనుకున్నా భయంకర తుఫాన్‌కు ఎవరు స్టేషన్ వైపు రాలేదు. వచ్చిన వారు మాత్రం ఎటూ వెళ్లలేక స్టేషన్లోనే దిగాలుగా పడిగాపులు కాస్తున్నారు. ఏ సమాచారం తెలియక తంటాలు పడుతున్నారు. రైల్వే ఉద్యోగులు సైతం ఆదివారం విధుల్లోకి రావాల్సిన వారంతా రాలేదు. దీంతో శనివారం రాత్రి విధుల్లో వున్న వారే ఇప్పటికీ కొనసాగుతున్నారు. ఖాళీ రైళ్లు ఢీ: తూర్పు కోస్తా రైల్వే చిగురుటాకులా వణికిపోయింది. హుదూద్ తుఫాను బీభత్సం సృష్టించనుందని ముందే హెచ్చరించడంతో దాదాపు 50కు పైగా రైళ్లను ఎక్కడున్న వాటిని అక్కడే నిలిపివేసినా వాటిని నియంత్రించడం కష్టతరమైంది. విశాఖలో నిలిపివేసిన పలు రైళ్లు భారీ ఈదురుగాలులకు పట్టాలపై దొర్లుకుపోవడం రైల్వే వర్గాలను కలవరపెట్టాయి. అందులో ప్రయాణికులు లేకపోయినా ఈదురు గాలులకు రైళ్లు సైతం కొట్టుకుపోతున్నాయని కలవరపడ్డారు. ఆదివారం రోజంతా అవి ఒకదానికొకటి ఢీకొట్టుకుంటూనే ఉన్నాయి. బ్రేక్‌లపై నిలిపివేసిన రైళ్లు సైతం చిగురుటాకుల్లా దొర్లిపోయేవి. వాటిని పట్టాలపై నియంత్రించడం సాధ్యమయ్యేది కాదు. ప్రయాణాలకు బ్రేక్ గత రెండు రోజులుగా విశాఖలో హుదూద్ చేస్తున్న హడావుడితో పలువురు ప్రయాణాలు బ్రేక్ చేసుకున్నారు. వేలాది మంది తమ టికెట్లను శనివారం రాత్రే రద్దు చేసుకున్నారు. దాదాపు నాలుగు నుంచి 5 వేల మంది ప్రయాణికులకు రూ. కోట్లలో చెల్లింపులు(రిఫండ్) చేశారు. మరో రెండు మూడు రోజుల వరకూ ప్రయాణాల పరిస్థితి మందకొడిగానే కొనసాగే అవకాశాలున్నాయి.