breaking news
Iravin Nizhal Movie
-
ఆయన కోసమే నగ్నంగా నటించా.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ పార్తిబన్ దర్శకత్వం వహించి నటించిన తమిళ చిత్రం ‘ఇరవిన్ నిళల్’. ఇందులో ఆయన హీరోగా నటించగా ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రంలో యువ నటి బ్రిగిడ సాగా హీరోయిన్గా నటించింది. జూలై 15న విడుదలైన ఈచిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ చానల్‌తో ముచ్చటించిన ఆమె మూవీ విశేషాలను పంచుకుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలో తాను నగ్నం నటించడంపై వివరణ ఇచ్చింది. చదవండి: పనిమనిషి చెప్పేదాకా చైసామ్ విడిపోతున్నారని తెలియదు ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ఈ చిత్రానికి సహాయ దర్శకురాలిగా పనిచేసేందుకు వెళ్లన తనను హీరోయిన్గా సెలక్ట్ చేశారని తెలిపింది. ‘నేను ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ చేయాల్సింది. కానీ నన్నే హీరోయిన్గా సెలక్ట్ చేశారు. అయితే ఇందులో ఓ సన్నివేశంలో హీరోయిన్ నగ్నంగా నటించాల్సి ఉంది. అయితే ఈ చిత్రాన్ని ప్రేమించే వారే ఆ ఈ సీన్ చేయగలరని డైరెక్టర్ అన్నారు. దీంతో డైరెక్టర్ కోసమే నేను ఆ సీన్లో చేయాలని అనుకున్నాను’ అని చెప్పింది. మొదట ఈ సీన్ నటించేముందు తన కుటుంబ సభ్యుల అనుమతి తీసుకోవాలనుకున్నానని పేర్కొంది. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే.. ‘ఈ సీన్ గురించి నా కుటుంబ సభ్యులతో చర్చించాలంటే భయం వేసింది. వారిని ఎలా ఒప్పించాలో తెలియలేదు. చాలా సతమతమయ్యాను. చివరకు డైరెక్టర్ పార్తిబన్ సహాయంతో మా కుటుంబాన్ని ఒప్పించి అనుమతి తీసుకున్నాకే ఈ సీన్లో నటించాను’ అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఇందులో తాను పూర్తి న్యూడ్‌గా నటించలేదని, ఇందుకోసం కొన్ని టెక్సిక్స్ వాడినట్లు ఆమె స్పష్టం చేసింది. వరలక్ష్మి శరత్ కుమార్, రోబో శంకర్, ప్రియాంకా రుత్, బ్రిగిడ సాగా, ఆనంద కృష్ణన్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఏ ఆర్ రహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా సింగిల్ షాట్లో చిత్రీకరించారు. అంతేకాదు మొట్టమొదటి నాన్ లీయర్ సింగిల్ షాట్ ఫిల్మ్‌గా ఈ చిత్రం ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది. -
అంతర్జాతీయ అవార్డులు కొల్లగొడుతున్న‘ఇరవిన్ నిళల్’
తమిళసినిమా: హీరో పార్తీబన్ చిత్రాలంటేనే వైవిధ్యానికి చిరునామా అనడం అతి శయోక్తి కాదు. ఈయన తన చిత్రాల్లో ప్రయోగాలతో ఆడుకుంటారు. ఇంతకు ముందు ఈయన ఏక పాత్రాభినయం చేసి తెరకెక్కించిన ‘ఒర్త చెరుప్పు – సైజ్ 7’ చిత్రం అందరి ప్రశంసలు అందుకుని విజయం సాధించడంతో పాటు జాతీయ అవార్డును గెలుచుకుంది. అంతే కాకుండా ఆస్కార్ అవార్డు అంచుల వరకూ వెళ్లింది. తాజాగా పార్తీపన్ కధానాయకుడిగా నటించి, కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన చిత్రం ‘ఇరవిన్ నిళల్’ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం కూడా కమర్షియల్ అంశాలతో కూడిన ప్రయోగాత్మక చిత్రం కావడం విశేషం. ఇది సింగిల్ షాట్ చిత్రీకరించిన చిత్రం. ఇప్పటికే గిన్నీస్ రికార్డు, ఏషియన్ బుక్ రికార్డుల్లో నమోదయింది. తాజాగా అంతర్జాతీయ అవార్డులను కొల్లగొడుతోంది. ఇప్పటికే మూడు అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. అందులో అంతర్జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు, ఈ చిత్ర ఛాయాగ్రహకుడు ఆర్ధర్ విల్సన్ రెండు అవార్డులను గెలుచుకున్నారు. మరో రెండు అంతర్జాతీయ అవార్డుల జాబితాలో ఈ చిత్రం చోటు చేసుకున్నట్లు చిత్ర వర్గాలు బుధవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికే చిత్ర ప్రివ్యూ చూసిన సినీ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇరవిన్ నిళల్ చిత్రం ఈ నెల 15వ తేదీన తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది.