breaking news
intime
-
పనుల్లో నాణ్యత పాటించాలి
కర్నూలు(రాజ్‌విహార్): విద్యుత్ సంస్థకు సంబంధించిన పనుల్లో నాణ్యత పాటించాలని ఏస్పీడీసీఎల్ క్వాలిటీ కంట్రోల్ (తిరుపతి) ఎస్ఈ వరకుమార్ సూచించారు. మంగళవారం ఆయన తన బృందంతో కలిసి కర్నూలు డివిజన్లో చేపట్టిన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధనల మేరకు పనులు చేపట్టి నిరీ్ణత గడువులోపు పూర్తి చేయాలని కోరారు. తనిఖీలు పూర్తయిన తరువాత నివేదికలను ఉన్నతాధికారులకు అందజేస్తామని వెల్లడించారు. ఆయన వెంట కర్నూలు ఆపరేషన్స్ డీఈ రమేష్, టౌన్–1, 2 ఏడీఈలు టీఎన్ ప్రసాద్, జి. రంగస్వామి, కల్లూరు ఎస్టేట్ ఏఈ పెద్దయ్య ఉన్నారు. -
సకాలంలో సర్వే పూర్తి
కాకినాడ సిటీ : సర్వేయర్లు బాధ్యతతో పనిచేసి సకాలంలో సర్వే పనులను పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ విధానగౌతమి సమావేశ హాలులో సర్వేయర్లతో భూ సర్వే, పట్టా సబ్ డివిజన్ అంశాలపై సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ వచ్చిన దరఖాస్తులను రైతులను ఇబ్బంది పెట్టకుండా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. భూ సర్వే, పట్టా సబ్ డివిజన్లకు సంబంధించి ఆన్లైన్లో వచ్చి నిర్ణీత పరిష్కార గడువు దాటిపోయిన దరఖాస్తులను 15 రోజుల్లో పరిష్కరించాలని స్పష్టం చేశారు. తొండంగి, జగ్గంపేట, రాజానగరం, రంగంపేట, అల్లవరం, అమలాపురం, ఉప్పలగుప్తం తదితర మండలాల్లో మార్చి నెల నుంచి దరఖాస్తులు ఎక్కువగా పెండింగ్ ఉన్నాయన్నారు. ఎఫ్ఎంబీ డిజటలైజేషన్‌కు 20 మంది సర్వేయర్లను నియమించామని వారిని ఎక్కువ దరఖాస్తులు పెండింగ్ ఉన్న మండలాలకు పంపి పరిష్కార చర్యలు తీసుకోవాలని సర్వేశాఖ ఏడీకి సూచించారు. సర్వేకు సంబంధించి ఈటీఎస్ పరికరాలు వినియోగించడంలో జిల్లా వెనుకబడి ఉందని, సర్వేయర్లు వాటితోనే పనిచేయాలని ఆదేశించారు. మండల సర్వేయర్లు లైసెన్స్ సర్వేయర్లను క్షేత్రస్థాయికి తీసుకువెళ్లి శిక్షణ ఇవ్వాలన్నారు. సమీక్షలో సర్వే భూరికార్డుల శాఖ ఏడి నూతనకుమార్, సర్వేయర్లు పాల్గొన్నారు. -
ఎస్సై స్పందించి ఉంటే హత్య జరిగేదికాదు