breaking news
International Widows Day
-
వారికి విముక్తి ఎప్పుడో?!
కుటుంబ సభ్యుల్ని కోల్పోతేనే తట్టుకోలేం. వారి జ్ఞాపకాలతో భారంగా కాలం వెళ్లదీస్తాం. కానీ ఓ మహిళ తన భర్తను కోల్పోతే భరించడం ఎంతో కష్టం. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు కరువై, సమాజం నుంచి వచ్చే చీత్కారాలు, ఆర్ధికంగా వెనకబాటు, పిల్లల పోషణ ఇలా అన్నీ విషయాల్లో భర్తను కోల్పోయిన భార్యలు నరకాన్ని అనుభవిస్తున్నారు. అలాంటి వారి కోసం ఐక్యరాజ్య సమితి ప్రతిఏడు జూన్ 23న అంతర్జాతీయ వితంతువుల దినోత్సవం జరుపుతోంది. వారికి విముక్తి కలిగించేందుకు కృషి చేస్తోంది. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం.. ప్రపంచంలో వితంతువులు 25కోట్ల మందికి పైగా ఉన్నారు. వారిలో 10 కోట్ల మంది తీవ్ర పేదరికాన్ని అనుభవిస్తున్నారు. ప్రస్తుత కరోనా సంక్షొభంలో కారణంగా వారి జీవనం మరింత దయనీయంగా మారింది. నేపథ్యం "ఇన్ విజుబుల్ ఇన్ విజుబుల్ ప్రాబ్లమ్స్" అనే థీమ్‌తో జూన్ 23న వితంతువుల దినోత్సవంగా నిర్ణయించింది. భర్త జీవించినంత కాలం ఆమెను గుర్తించిన సమాజం.. వితంతువుగా మారడంతో అదే సమాజం నుంచి ఎన్నో అవమానాల్ని ఎదుర్కొంటుంది. చట్టాల్ని అమలు చేసే ప్రభుత్వాలు సైతం వారికి ప్రత్యేక గుర్తింపు ఇవ్వలేకపోతున్నాయి. చరిత్ర డిసెంబర్ 23, 2010లో ఐకరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో జూన్ 23ను వితంతు దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించింది. అంతకు ముందు లుంబా ఫౌండేషన్ జూన్ 23న వితంతు దినోత్సవాన్ని నిర్వహించేంది. 2005 నుంచి 2010 వరకు ఐదేళ్ల పాటు లుంబా ఫౌండేషన్ ఈ పనిని చేసింది. దీనికి కారణరం లేకపోలేదు.. లూంబా వ్యవస్థాపకుడు రజిందర్ తల్లి పుష్పవతి లూంబా 1954 జూన్ 23న వితంతువు అయ్యారు. దీంతో పడిన కష్టాలు... వితంతువుగా ఆమె ఎదుర్కొన్న సమస్యలు... వాటిని ఆమె ఎదిరించిన తీరును స్ఫూర్తిగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. చదవండి: ఏది నిజం, అక్కడ అమ్మాయిలు ఉన్నట్లా! లేనట్లా? -
వితంతువులను గౌరవిద్దాం...
ప్రపంచ వ్యాప్తంగా వితంతువులు ఏదో ఒక రూపంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. గృహ బహిష్కరణ, గృహ హింస, వివక్షత, మూఢాచారాలు, పేదరికం లాంటి ఎన్నో సమస్యల వలయంలో చిక్కుకొని బతుకుబండి లాగుతున్నారు. అనునిత్య జీవితంలో సమస్యలను ఎదుర్కొంటున్న వితంతువులకు అండగా ఉంటూ ఆదరణ చూపించడానికై ఐక్యరాజ్య సమితి 2011 జూన్ 23వ తేదీని అంతర్జాతీయ వితంతువుల దినోత్సవంగా ఏర్పాటుచేసి వితంతు వివక్ష విముక్తి కోసం పోరాడాలని పిలుపు ఇచ్చింది. గత పదేళ్లుగా తెలుగు రాష్ట్రాలలో వితంతు విముక్తి ఉద్యమాన్ని ప్రజలందరి భాగస్వామ్యంతో ముమ్మరంగా నడుపుతున్న బాల వికాస సామాజిక సేవా సంస్థ, వరంగల్ వారు ప్రపంచ చరిత్రలోనే 10,000 మంది వితంతువులతో అతి పెద్ద మహాసభను 2018 జూన్ 23న హైద్రాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటుచేశాము. ఈ సభకు వచ్చిన హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మత పెద్దలు వితంతు వివక్ష అనేది ఏ మతంలోనూ ప్రోత్సహించరని, జరుగుతున్న తంతు అంతా కూడా ఒక సామాజిక మూఢ నమ్మకం, మూఢాచారం మాత్రమే అని చాటి చెప్పారు. భారదేశంలో సుమారు నాలుగున్నర కోట్ల వితంతువులు ఆధరణ నోచుకోకుండ, ఆత్మాభిమానం కోల్పోయి జీవిస్తున్నారు. గ్రామాలలో, పట్టణాలలో అనేక మంది వితంతువులు అనేక పరిస్థితులలో భయంకర వివక్షతను అనుభవిస్తున్నారు. పండుగల్లో, కుటుంబ శుభకార్యాలలో వివక్షత. కనీసం కన్నబిడ్డ వివాహాల్లో మనస్పుర్తిగా ఆశీర్వదించలేని అభాగ్యురాలిగా, సాటి మహిళలలాగా సాధారణ బట్టలు వేసుకోలేక, పురుషులలాగా రెండో పెళ్ళి చేసుకోలేక, ముఖ్యంగా యువ వితంతువులు ఎంతో మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, వితంతువులు సాటి మహిళతో సమానత్వం కావాలనీ, కనీసం తనను మనిషిలా చూడాలని కన్నీళ్ళు పెట్టుకున్న సందర్భాలు ఎన్నో చూస్తున్నాము. ప్రభుత్వాలతోపాటు, సమాజంలోని అందరు వితంతువులపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటే ప్రజల ఆలోచనలు మారి, ఆచరణలో మార్పు వచ్చినప్పుడు సమాజం మార్పు చెందుతుంది. ఈ వితంతు వివక్షా విముక్తి ఉద్యమంలో భాగస్వాములై మన అమ్మ, అక్క, చెల్లి, కూతురు అందరూ ఆత్మగౌరవంగా జీవించే హక్కు కల్పిద్దాం. – సింగారెడ్డి శౌరిరెడ్డి బాల వికాస ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మొబైల్: 98491 65890