breaking news
international kuchipudi nrutyotsav
-
కూచిపూడిని ఆదరించడం సంతోషం: జస్టిస్ ఎన్వీ రమణ
-
కూచిపూడిని ఆదరించడం సంతోషం: జస్టిస్ ఎన్వీ రమణ
విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో కూచిపూడి నాట్యాన్ని ఆదరించడం చాలా సంతోషకరమని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. నేటి నుంచి మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా జరగనున్న ఈ అంతర్జాతీయ నృత్యోత్సవాలు విజయవాడలోని ఇందిరాగాంధీ స్డేడియంలో శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతిలో అంతర్జాతీయ తెలుగు కేంద్రాన్ని నిర్మించాలని కోరుతున్నామన్నారు. తెలుగు భాషను కూడా పరిరక్షించుకోవాలని జస్టిస్ రమణ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ, సిలికానాంధ్ర సంయుక్త నిర్వహణలో ఈ కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. దేశ విదేశాల నుంచి వేలాదిమంది కళాకారులు ఈ ఉత్సవాలలో పాల్గొని ప్రదర్శనలు ఇవ్వనున్నారు. -
చూచువారలకు చూడముచ్చటట..
విజయవాడ కల్చరల్ : నవ్యాంధ్రలో నాట్య వైభవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశ విదేశాల నుంచి వేలాదిమంది కళాకారులు చేరుకుంటున్నారు. వారికి సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా ఈ అంతర్జాతీయ నృత్సోవాలు జరగనున్నాయి. మొదటి రెండు రోజులు ప్రముఖ కళాకారుల నృత్యాలు, సదస్సులు నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ, సిలికానాంధ్ర సంయుక్త నిర్వహణలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రారంభం ఇలా.. శుక్రవారం ఉదయం 8 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శోభాయాత్ర నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణతోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. మొదటి సదస్సు 8 గంటలకు ప్రారంభమై 2 గంటలకు ముగుస్తుంది. రెండో సదస్సులో భోజన విరామం అనంతరం కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. కళాకారులు, నాట్య గురువులు నృత్యోత్సవంలో పాల్గొంటారు. ప్రత్యేక వేదిక ఈ ఉత్సవాల నిమిత్తం అత్యాధునిక వేదిక నిర్మిస్తున్నారు. చివరి వారికి కూడా కనిపించేలా దీని నిర్మాణం జరుగుతోంది. అత్యవసర సమయంలో ప్రత్యేక ద్వారాలు కూడా సిద్ధం చేశారు. అంబులెన్స్, ఫైర్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. అతిథుల కోసం విందు భోజనం 40వేల అడుగుల్లో భోజనశాలను నిర్మిస్తున్నారు. తెలుగువారి విందు భోజనం విదేశీయులకు రుచిచూపించేలా 43 రకాలైన వంటకాలను సిద్ధం చేస్తున్నారు. పూతరేకులు, పాలతాళికులు, అరిసెలు వంటివి ప్రత్యేకం. 24వ తేదీ శనివారం ఉదయం 9 గంటలకు కార్యక్రమాలు ప్రారంభమై విరామం అనంతరం రాత్రి 9 గంటల వరకూ సాగుతాయి. రెండురోజుల కార్యక్రమాల్లో 50కి పైగా సంప్రదాయ నృత్య ప్రదర్శనలుంటాయి. 25వ తేదీ ఆదివారం మహా బృందనాట్యం జరుగుతుంది. సాయంత్రం 5 గంటలకు 7వేలమంది కళాకారులు ఈ బృందనాట్యంలో పాలొంటారు. 5.20 నిమిషాలకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధుల పరిశీలన అనంతరం గిన్నిస్ బుక్ నమోదు చేస్తారు.