breaking news
Inhabitants
-
పరిహారం ఇస్తారా? చంపేస్తారా?
సాక్షి, అక్కన్నపేట(హుస్నాబాద్): గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో పలువురు భూ నిర్వాసితులు గాయాలపాలయ్యారు. మంగళవారం సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని గూడాటిపల్లి గ్రామం వద్ద నిర్మిస్తున్న గౌరవెల్లి ప్రాజెక్టు పనులు అడ్డుకునేందుకు గూడాటిపల్లి భూ నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేస్తూ పనులను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో శాంతిపజేయడానికి వచ్చిన పోలీసులతో నిర్వాసితులకు వాగ్వాదం జరిగింది. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. అనంతరం పలువురు భూ నిర్వాసితులు మాట్లాడుతూ తమ విలువైన భూములను ప్రాజెక్టు నిర్మాణం కోసం అప్ప జెప్పితే పోలీసులతో కొట్టిస్తారా అని కన్నెర్ర చేశారు. పరిహారం చెల్లించాలని శాంతియుత వాతావరణంలో ఆం దోళన వ్యక్తం చేస్తుంటే పోలీసులు అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమన్నారు. మా ఇళ్లకు పరిహారం చెల్లించాకే ప్రాజెక్టు పనులు కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తామన్నారు. -
8న సుప్రీంలో పోలవరం నిర్వాసితుల కేసు
న్యూఢిల్లీ: పోలవరం నిర్వాసితుల పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. కొత్త చట్టం ప్రకారం పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. ఈ సందర్భంగా నిర్వాసితుల కేసును త్వరితగతిన విచారణ చేపట్టాలని పిటిషనర్ పుల్లారావు తరపు న్యాయవాది ...ఉన్నత ధర్మాసనాన్ని కోరారు. వచ్చే సోమవారం కేసు విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది.