breaking news
inducements
-
‘ఈసీ’ సంచలన ప్రకటన.. తనిఖీల్లో పట్టుబడ్డవి ఎంతంటే..
న్యూఢిల్లీ: దేశంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. మొత్తం ఏడు దశల్లో జరిగే ఈ ఎన్నికల్లో ఏప్రిల్ 19న తొలి దశ పోలింగ్ జరగనుంది. పోలీసుల ప్రత్యేక తనిఖీల్లో పట్టుబడుతున్న వాటిపై ఎన్నికల కమిషన్(ఈసీ) తాజాగా సంచలన విషయం వెల్లడించింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఎన్నికల్లో తొలిదశ పోలింగ్‌కు ముందే ఏకంగా 4 వేల650 కోట్ల రూపాయల విలువైన వస్తువులు, నగదును పట్టుకున్నట్లు ప్రకటించింది. గతేడాది తొలి దశ పోలింగ్‌కు ముందు పట్టుబడ్డ రూ.3475 కోట్ల వస్తువులు, నగదుతో పోలిస్తే ఈసారి పట్టుబడ్డ వాటి విలువ రూ.1175 కోట్లు ఎక్కువ. ఇంత విలువైన వస్తువులు, నగదు పట్టుకోవడం ఎన్నికలు న్యాయంగా జరగాలనే తమ ధృడ సంకల్పానికి నిదర్శనమని ఈసీ తెలిపింది. పట్టుబడ్డ వాటిలో 45 శాతం దాకా డ్రగ్స్, నార్కోటిక్సే కావడం గమనార్హం. ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రలోభాల వాడకం కారణంగా వనరులు తక్కువగా ఉన్న చిన్న రాజకీయ పార్టీలకు సమన్యాయం జరిగే అవకాశాలు తగ్గిపోతాయని పేర్కొంది. ఇదీ చదవండి.. రూ.200కోట్ల ఆస్తి దానం.. సన్యాసంలోకి భార్యాభర్తలు -
చంద్రబాబూ నాటకాలు కట్టిపెట్టు
విద్యానగర్(గుంటూరు) రుణమాఫీ తదితర హామీలను నెరవేర్చలేక ప్రజలను ప్రలోభాలతో మభ్యపెట్టేందుకు చంద్రబాబు పన్నుతున్న కుట్రలకు తెరదించాలని వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనానికి కల్లబొల్లి కబుర్లు చెప్పి హైదరాబాద్‌లోని తమ పార్టీ అధినాయకుడు జగన్ ఇంటిపైకి 5 బస్సులతో జనాన్ని తీసుకెళ్లి ఎమ్మెల్యేపై సుమోటోగా కేసు నమోదు చేయాని డిమాండ్ చేశారు. భూములు తిరిగి ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి హైదరాబాద్ తీసుకెళ్లి తమతో ధర్నా చేయించారని సరస్వతీ సిమెంట్స్ భూముల పరిసర ప్రాంతాల రైతులే చెబుతున్నారన్నారు. రైతుల రుణాలు ప్రభుత్వం చెల్లించేవిధంగా చర్యలు తీసుకోనున్న జగన్‌ను ఇరకాటంలో పెట్టేందుకు పన్నిన కుట్రల్లో భాగమే ఈ వివాదాస్పద కార్యక్రమాలని ఆరోపించారు. కంపెనీకి చెందిన భూములను రౌడీయిజంతో అనుభవిస్తున్నవారిపై కేసులు ఎందుకు నమోదు చేయలేదని, రౌడీలను వెంట తీసుకెళ్లి ఇంటి ముందు ధర్నా చేసిన ఎమ్మెల్యేపై ఎందు కు కేసు నమోదు చేయలేదని ప్రశ్నిం చారు. విలేకరుల సమావేశంలో ఎస్సీసెల్ రాష్ట్రకమిటీ సభ్యుడు ఎమ్ దేవరాజ్, జిల్లా అధ్యక్షుడు బండారు సాయిబాబు, సేవాదళ్ జిల్లా కన్వీనర్ కొత్తా చిన్నపరెడ్డి, ఎస్సీ సెల్ నగర కన్వీనర్ విజయ్‌కిషోర్, పార్టీ నాయకుడు చిలకా సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.