breaking news
Indoor Theme Park
-
ఇండోర్ స్కైడైవింగ్.. ఇప్పుడు మన హైదరాబాద్‌లో
వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం నుంచి ఒక్కసారిగా కిందికి దూకుతూ చేసే స్కై డైవింగ్ వీడియో కనిపిస్తే.. మనం కూడా కళ్లప్పగించి చూస్తాం. అంత ప్రమాదకరమైన అడ్వెంచర్ మనకి అవసరమా అనుకుంటాం. అయితే ఇప్పుడు ఏ ప్రమాదం లేకుండా ఆ అడ్వెంచర్ చేసే అవకాశం హైదరాబాదీలకు దక్కనుంది. హైదరాబాద్ నగరానికి మరో ఆకర్షణ జత కానుంది. దేశంలో ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా స్కై డైవింగ్ ఎక్స్పీరియన్స్ అందించేందుకు నగరం రెడీ అవుతోంది. ఆకాశ వీధిలో విహరించే అనుభూతి కల్పించేందుకు గ్రావిటీజిప్ అనే స్టార్టప్ రంగం సిద్ధం చేసింది. నగరానికి చెందిన మేడ రామ్, మేడ సుశీల్‌లు గండిపేట సమీపంలో ఇండోర్ స్కై డైవింగ్ ఎక్స్పీరియన్స్ అందించేందుకు గ్రావిటీజిప్ అడ్వెంచర్ స్పోర్ట్స్ హబ్ ఏర్పాటు చేశారు. అడ్వెంచర్‌కు మారు పేరైన స్కైడైవింగ్‌కి యూరప్ కంట్రీస్‌లో స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మన దగ్గరి నుంచి కూడా చాలా మంది యూరప్‌కి వెళ్లి స్కై డైవింగ్ చేసి వస్తుంటారు. ఈ అడ్వెంచర్ చేయాలంటే నెలల తరబడి శిక్షణ అవసరం, అదే విధంగా ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇలాంటి ఝంజాటం ఏమీ లేకుండా ఇలా వెళ్లి అలా ఇండోర్‌లో స్కైడెవింగ్ చేసి రావొచ్చు. తక్కువ ఖర్చుతో, అన్ని రకాల జాగ్రత్తలతో ఆర్టిఫిషియల్ స్కైడైవింగ్ ఎక్స్పీరియన్స్ అందించనుంది గ్రావిటీజిప్. గండిపేట సమీపంలో ఆర్టిఫిషియల్ స్కైడైవింగ్ కోసం చేస్తున్న ఏర్పాట్లు చివరి దశకు వచ్చాయి. 2022 మార్చి, ఏప్రిల్‌లలో దీన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు యూరప్‌లో శిక్షణ పొందిన సిబ్బందిని ఇక్కడి నియమించారు. ఇండోర్ స్కైడైవింగ్ కోసం 23 అడుగుల ఎత్తుతో ప్రత్యేక సిలిండర్ రూపొందించారు. స్కైడైవింగ్‌కి మూడు వేల రూపాయల వరకు టికెట్ ఛార్జ్ ఉండవచ్చని అంచనా. చదవండి: బెంగళూరు, ఢిల్లీ బాటలో హైదరాబాద్.. స్టార్టప్‌లకు మంచి రోజులు -
లోకం కాని లోకం!
అక్కడ అడుగుపెడితే... భూగోళం మీద ఉన్నట్లు ఉండదు. ఒక కొత్త లోకంలోకి వెళ్లినట్లుంటుంది. కథల్లో కనిపించేవన్నీ... అక్కడ కళ్లెదుట ప్రత్యక్షమవుతాయి. కథలు చదువుతున్నప్పుడు మనోతెరపై ప్రత్యక్షమయ్యే ఊహాదృశ్యం నిజమై మన ముందు నిలుచున్నట్లుగా ఉంటుంది. ప్రపంచంలోనే అతి పెద్ద ‘ఇండోర్ థీమ్ పార్క్’ ఇటీవల దుబాయ్‌లో ప్రారంభమైంది. దీని నిర్మాణానికి మూడు సంవత్సరాలకుపైగా పట్టింది. కోట్లాది రూపాయల ఖర్చుతో నిర్మాణమైన ఈ ‘ఐయంజీ వరల్డ్ ఆఫ్ అడ్వెంచర్’ థీమ్‌పార్క్ ఆబాలగోపాలాన్నీ కనువిందు చేస్తుంది. ఇరవై ఎనిమిది ఫుట్‌బాల్ మైదానాలంత విశాలంగా ఉండే ఈ థీమ్‌పార్క్‌ను ఒకేసారి 30,000 మంది ప్రేక్షకులు సందర్శించవచ్చు. ‘హాంటెడ్ హోటల్’ ‘డైనోసర్ జోన్’లతో పాటు వందలాది కార్టూన్ క్యారెక్టర్లతో కళళలాడుతున్న ఈ థీమ్‌పార్క్ ఊహించినదాని కంటే మిన్నగా ఉందంటున్నారు సందర్శకులు. ఏది ఏమైనా... ఈ థీమ్‌పార్క్ దుబాయ్ టూరిస్ట్ ఎట్రాక్షన్లలో ఒకటిగా నిలిచింది.