నంబర్‌వన్ ఆల్‌రౌండర్‌గా అశ్విన్
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్
దుబాయ్: ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో బ్యాటింగ్‌లో ఆకట్టుకున్న భారత ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ నంబర్‌వన్ ఆల్‌రౌండర్‌గా నిలిచాడు. ఐసీసీ టెస్టు ఆటగాళ్ల తాజా ర్యాంకింగ్స్ జాబితా సోమవారం విడుదలైంది. మాంచెస్టర్ టెస్టులో తను ఒక్క వికెట్ తీయకపోయినా బ్యాటింగ్‌లో మాత్రం రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 86 (40, 46 నాటౌట్) పరుగులతో ఆకట్టుకున్నాడు. 372 పాయింట్లతో తను టాప్‌లో ఉండగా ఫిలాండర్ (దక్షిణాఫ్రికా, 365) రెండో స్థానంలో ఉన్నాడు.
ఇక బ్యాటింగ్‌లో శ్రీలంక స్టార్ ఆటగాడు కుమార సంగక్కర ఏకంగా 31 రేటింగ్ పాయింట్లను అధిగమించి 2007 తర్వాత మరోసారి నంబర్‌వన్ ర్యాంకు దక్కించుకున్నాడు. డివిలియర్స్ రెండో స్థానానికి పడిపోయాడు. పుజారా పది నుంచి 12కు, కోహ్లి 15 నుంచి 20వ ర్యాంకుకు దిగజారారు. బౌలింగ్‌లో స్టెయిన్ టాప్‌లోనే ఉండగా అశ్విన్ ఒక స్థానం కోల్పోయి 13వ ర్యాంకులో ఉన్నాడు. ఓజా 15, ఇషాంత్ 20వ స్థానాల్లో కొనసాగుతున్నారు.