breaking news
India growing
-
వృద్ధిలో భారత్ వేగం.. చైనా నెమ్మది
న్యూఢిల్లీ: ఎకానమీ బాటలో భారత్ వేగంగా పరోగమిస్తుంటే.. చైనా నెమ్మదిస్తోందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ తన తాజా నివేదికలో పేర్కొంది. ‘చైనా స్లోస్... ఇండియా గ్రోస్’ అన్న శీర్షికన విడుదలైన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► ఆసియా–పసిఫిక్ గ్రోత్ ఇంజిన్... చైనా నుండి దక్షిణ, ఆగ్నేయాసియాలకు మారుతుందని అంచనా. ►చైనా వృద్ధి రేటు 2023లో 5.4 శాతంగా అంచనా. 2024లో ఇది 4.6 శాతానికి తగ్గుతుంది. 2025లో 4.8 శాతానికి పెరుగుతుంది. 2026లో మళ్లీ 4.6 శాతానికి తగ్గుతుంది. ►ఇక భారత్ వృద్ధి 2026లో 7 శాతానికి పెరుగుతుంది. ఇదే సమయంలో వియత్నా వృద్ధి 6.8%, ఫిలిప్పైన్స్ వృద్ధి రేటు 6.4 %, ఇండోనేíÙ యా వృద్ధి 5 శాతంగా నమోదయ్యే వీలుంది. భారత్‌తో పాటు ఇండోనేíÙయా, మలేíÙయా, ఫి లిప్పైన్స్లో దేశీయ డిమాండ్ పటిష్టంగా ఉంది. ►భారత్ వృద్ధి రేటు 2023–24, 2024–25లో 6.4 శాతంగా ఉంటుంది. 2025లో 6.9 శాతంగా, 2026లో 7 శాతంగా సంస్థ అంచనావేస్తోంది. అధిక ఆహార ద్రవ్యోల్బణం, బలహీన ఎగుమతి పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్‌లో ఆర్థిక క్రియాశీలత, డిమాండ్ పటిష్టంగా ఉన్నాయి. ►ఆసియా–పసిఫిక్ సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను ఎక్కువగా ఉంచే అవకాశం ఉన్నందున, ఈ ప్రాంతంలోని రుణ గ్రహీతలకు రుణ వ్యయాలు, సేవలు భారీగా ఉంటాయి. ►మధ్యప్రాచ్యంలో సంఘర్షణలు విస్తరిస్తే.. అవి ప్రపంచ సరఫరా చైన్‌ను దెబ్బతీయవచ్చు. ఇది ఇంధన వ్యయాలను పెంచుతుంది. తద్వారా ద్రవ్యోల్బణం పెరుగుతంది. అధిక ఇన్పుట్ ఖర్చులు కార్పొరేట్ మార్జిన్లను తగ్గించే అవకాశం ఉంది. ఇది డిమాండ్ పరిస్థితులనూ దెబ్బతీసే అవకాశం ఉంది. ►ఆసియా–పరిఫిక్ ప్రాంత వృద్ధి అంచనాలను (చైనా మినహా) 2024కు సంబంధించి 4.4 శాతం నుంచి 4.2 శాతానికి తగ్గిస్తున్నాం. పారిశ్రామిక వృద్ధి అవకాశాలపైనా ప్రతికూల ప్రభావాలు ఉండవచ్చు. ప్రత్యేకించి ఎగుమతుల ఆధారిత తయారీ రంగం కఠిన పరిస్థితులను ఎదుర్కొనే ఇబ్బందులు ఉన్నాయి. -
ఇండియాలా మనకెందుకు సాధ్యం కాదు: ట్రంప్
వాషింగ్టన్: అమెరికాలో ఆర్థికాభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామాపై రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ మరోసారి విమర్శలు గుప్పించారు. ఓ పక్క భారత్, చైనా లాంటి దేశాలు 8 శాతం, 7 శాతం వృద్ధితో దూసుకుపోతుంటే అమెరికా అది ఎందుకు సాధ్యం కాలేదని ప్రశ్నించారు. మాంచెస్టర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ఒక సంవత్సరంలో కనీసం మూడు శాతం వృద్ధి కూడా సాధించలేక పోయారని.. అది ఒక్క ఒబామా పాలనలోనే అని అన్నారు. ఈ ఏడాది మూడవ త్రైమాసికంలో ఫలితాలు భయానకంగా ఉన్నాయని ట్రంప్ చెప్పారు. తాను అధికారంలోకి వస్తే నాలుగు శాతం ఆర్థిక వృద్ధి సాధించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అమెరికా ఆర్థికంగా ఉన్నతమైన దేశంగా మళ్లీ అవతరించాల్సిన అవసరం ఆసన్నమైందన్నారు. హిల్లరీ నిర్ణయాల కారణంగా దేశంలో ఐఎస్ఐఎస్ ప్రాభల్యం మరింత పెరుగుతుందని.. ఇప్పటికే కొందరు ఉగ్రవాదులు దేశంలో తిష్టవేసి ఉన్నారని పేర్కొన్నారు. సిరియా శరణార్థుల విషయంలోనూ ఆమె నిర్ణయాలు దేశానికి ముప్పు తెచ్చేలా ఉన్నాయని ట్రంప్ వివరించారు.