breaking news
Index Rally
-
రికార్డుల ర్యాలీ కొనసాగవచ్చు
ముంబై: స్టాక్మార్కెట్లో సూచీల ర్యాలీ ఈ వారంలోనూ కొనసాగవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఆర్థిక వృద్ధి ఊపందుకునేందుకు కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతామని ఆర్బీఐ పరపతి విధాన కమిటీ ప్రకటించింది. దేశీయ ఈక్విటీల పట్ల విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి బుల్లిష్ వైఖరిని ప్రదర్శిస్తున్నారు. కార్పొరేట్ సంస్థలు అంచనాలకు తగ్గట్లు క్యూ1 ఆర్థిక ఫలితాలను వెల్లడిస్తున్నాయి. అగ్ర రాజ్యం అమెరికా మార్కెట్లు ఆల్‌టైం హై స్థాయిల వద్ద కదలాడుతున్నాయి. ఈ సానుకూల పరిణామాల దృష్ట్యా రానున్న రోజుల్లో సూచీలు పరిమిత శ్రేణిలో ట్రేడవుతూ సరికొత్త రికార్డులను నమోదు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. జాతీయ, అంతర్జాతీయ సంకేతాలు కలిసిరావడంతో గతవారంలో సూచీలు సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. వారం మొత్తంగా సెన్సెక్స్ 1691 పాయింట్లు, నిఫ్టీ 16,238 పాయింట్లను ఆర్జించాయి. ఇక వారంలో క్యూ1 ఆర్థిక ఫలితాలు, జూన్ పారిశ్రామికోత్పత్తి, జూలై ద్రవ్యోల్బణ గణాంకాల(ఆగస్ట్ 12న విడుదల)తో పాటు ప్రపంచ పరిణామాలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపవచ్చు. వర్షపాత నమోదు, కరోనా కేసులు, వ్యాక్సినేషన్ వార్తలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ ధరల కదలికలు మార్కెట్లకు కీలకంగా మారనున్నాయి. ‘‘మార్కెట్లో పాజిటివ్ ట్రెండ్ మరింతకాలం కొనసాగవచ్చు. పతనాన్ని కొనుగోళ్లకు అవకాశంగా భావించాలి. సాంకేతికంగా నిఫ్టీ 16,300 వద్ద కీలకమైన నిరోధాన్ని కలిగి ఉంది. ఈ స్థాయిని అధిగమిస్తే 16,500 – 16,600 స్థాయి వద్ద మరో ప్రధాన అవరోధాన్ని పరీక్షిస్తుంది’’ అని దీన్ దయాళ్ ఇన్వెస్ట్మెంట్స్ సాంకేతిక నిపుణుడు మనీష్ హతిరామణి తెలిపారు. చివరి దశకు క్యూ1 ఫలితాలు... దేశీయ కార్పొరేట్ తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాల ప్రకటన చివరి దశకు చేరుకుంది. ఈ వారంలో మొత్తం 1900 కంపెనీలు తమ క్యూ1 గణాంకాలను వెల్లడించున్నాయి. టాటా స్టీల్, హీరో మోటోకార్ప్, భారత్ పెట్రోలియం, ఐషర్ మోటార్స్, శ్రీ సిమెంట్స్, ఎమ్ఆర్ఎఫ్, పవర్ గ్రిడ్, కోల్ ఇండియా, మదర్సన్ సుమీ, పిడిలైట్, క్యాడిల్లా హెల్త్‌కేర్, ఎన్ఎండీసీ, ఓఎన్జీసీ, గ్రాసీం, ఇంద్రప్రస్థ, తదితర కంపెనీలు ఉన్నాయి. ఇటీవల ఐపీఓను పూర్తి చేసుకొని ఎక్సే్చంజీల్లో షేర్లను లిస్ట్ చేసిన జొమాటో, క్లీన్ సైన్స్ టెక్నాలజీ కంపెనీలు సైతం ఇదే వారంలో తమ క్వార్టర్ ఫలితాలను వెల్లడించనున్నాయి. మారిన విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి గత కొంతకాలంగా భారత ఈక్విటీలను అమ్మేసిన విదేశీ ఇన్వెస్టర్లు తాజాగా కొనుగోళ్లు చేపట్టారు. ఈ ఆగస్ట్ నెల తొలి ఐదు ట్రేడింగ్ సెషన్లలో రూ.1,210 కోట్ల షేర్లను కొన్నారు. ఈ జూలైలో రూ.7,273 కోట్ల షేర్లను విక్రయించారు. ‘‘దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పుంజుకుంది. పలు రాష్ట్రాలు లాక్డౌన్ ఆంక్షలను సడలించాయి. కార్పొరేట్ క్యూ1 ఫలితాలు మెప్పిస్తున్నాయి. ఈ అంశాలన్నీ విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయి’’ అని కోటక్ సెక్యూరిటీస్ సాంకేతిక నిపుణుడు శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు. రోలెక్స్ రింగ్స్ లిస్టింగ్ నేడు... ఆటో ఉపకరణాల తయారీ సంస్థ రోలెక్స్ రింగ్స్ షేర్లు సోమవారం(ఆగస్ట్ 9న) ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. ఈ ఐపీఓ ఈ జూలై 28న మొదలై.., 30వ తేదీన ముగిసింది. షేరుకి రూ.900 గరిష్ట ధరతో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 731 కోట్లు సమకూర్చుకుంది. ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించింది. చివరి రోజు నాటికి 130.43 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 56.85 లక్షల షేర్లను జారీ చేయగా.., ఏకంగా 74.15 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. ఇష్యూ ధర రూ.900 తో పోలిస్తే గ్రే మార్కెట్లో రూ.450ల ప్రీమియం పలుకుతోంది. దీనిబట్టి ఇష్యూ లిస్టింగ్ రోజు లాభాల్ని పంచవచ్చని తెలుస్తోంది. -
పసిడికి ‘వడ్డీరేట్ల’ గుబులు!
న్యూఢిల్లీ: అమెరికాలో వడ్డీరేట్లు పెరగవచ్చన్న అంచనాలు అంతర్జాతీయంగా అటు డాలర్ ఇండెక్స్ బలపడ్డానికి – పసిడి పతనానికి దారితీశాయి. ఈ వార్త రాసే రాత్రి 9.30 గంటల సమయంలో అంతర్జాతీయం ఫ్యూచర్స్ మార్కెట్– న్యూయార్క్ కమోడిటీ ఎక్సేంజ్‌లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర క్రితం ముగింపుతో పోల్చితే దాదాపు 100 డాలర్లు పతనమై, 1770 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మే తర్వాత ఇంత తక్కువ స్థాయి ఇదే తొలిసారి. కాగా, ఫెడ్ సమావేశ నిర్ణయాల అనంతరం ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ప్రాతిపదికన లెక్కించే డాలర్ ఇండెక్స్ దాదాపు 92 స్థాయికి చేరింది. అమెరికాలో ద్రవ్యోల్బణం భయాలు, దీనితో ఊహించినదానికన్నా ముందుగానే వడ్డీరేట్లు పెరగవచ్చన్న అమెరికన్ ఫెడరల్ బ్యాంక్ చీఫ్ పావెల్ సూచనలు దీనికి నేపథ్యం. రెండు రోజుల సెంట్రల్ బ్యాంక్ విధాన సమీక్ష అనంతరం పావెల్ ఒక ప్రకటన చేస్తూ, ‘ఈ ఏడాది అధిక ద్రవ్యోల్బణం తాత్కాలిక పరిణామంగా ఉండవచ్చు. అయితే తద్వారా వచ్చే ఇబ్బందుల గురించి పట్టించుకోకుండా ఉండలేం’ అని వ్యాఖ్యానించారు. రేటు నిర్ణయ కమిటీలోని కొందరు సభ్యులు ఊహించినదానికన్నా ముందుగానే వడ్డీరేట్లు పెంచవచ్చన్న అంచనాలను వెలిబుచ్చినట్లు సూచించడంతో ఈ ప్రభావం అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లతోపాటు పసిడిపై సైతం ప్రభావం చూపింది. దేశీయంగా రూ.1,700 పతనం అంతర్జాతీయ ధోరణికి అనుగుణంగా దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్– మల్టీ కమోడిటీ ఎక్సేంజ్ లో 10 గ్రాముల ధర రూ.1,700 పతనమై రూ.46,864కు పడిపోయింది. కాగా ముంబై స్పాట్ మార్కెట్లో గురువారం బంగారం 99.9 స్వచ్ఛత, 99.5 స్వచ్ఛత 10గ్రాముల ధరలు వరుసగా రూ.841, రూ.837 తగ్గి రూ.47,556, రూ.47,366 వద్ద ముగిశాయి. ఇక వెండి ధర కేజీ ధర రూ.1,873 తగ్గి రూ.69,520కి పడింది. చదవండి: ఇకపై బంగారం కొనాలంటే ఇది తప్పనిసరి -
‘హ్యాపీ’ న్యూ ఇయర్ షేర్లివి..!
మార్కెట్లు... అంటే సెన్సెక్స్, నిఫ్టీ వంటి ఇండెక్స్‌లు మరీ అంతగా పడలేదు. లార్జ్ క్యాప్ షేర్లు కొన్ని పెరిగాయి... కొన్ని తగ్గాయి. కానీ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లు మాత్రం ఘోరంగా పతనమయ్యాయి. మార్కెట్లు జీవితకాల గరిష్ఠ స్థాయిల నుంచి 9 శాతం వరకూ పతనమైతే ఈ షేర్లు మాత్రం చాలావరకూ 50– 60– 70 శాతం కూడా పతనమయ్యాయి. మ్యూచ్‌వల్ ఫండ్ పథకాలు చాలావరకూ ఈ ఏడాది నష్టాలనే ఇచ్చాయి. నిజం చెప్పాలంటే ఏ షేర్లలో పెట్టుబడి పెట్టాలి? ఏ ఫండ్స్ మంచివి? అనేది 2018లో ఇన్వెస్టర్లకు ఎంత బుర్రబద్దలుకొట్టుకున్నా అర్థం కాలేదు. ఒకేరోజు సెన్సెక్స్ 600 పాయింట్లు పెరిగితే... మరోరోజు 500 పాయింట్లకు పైగా పతనం!!. ఇలాంటి ఎగుడు దిగుళ్లెన్నో సర్వసాధారణమైపోయాయి. దీనికి అంతర్జాతీయ వాణిజ్య యుద్ధభయాలు... ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు.. దేశీయంగా ఎన్బీఎఫ్సీ సంక్షోభం వంటివన్నీ కారణమని చెప్పొచ్చు. కాకపోతే ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ఇన్వెస్టర్లు సంతోషించదగ్గ అత్యంత కీలక పరిణామం ఒకటుంది. అది... మార్కెట్లు పరిణితితో వ్యవహరించటం. గతానికి భిన్నంగా.. అగ్రరా జ్యం అమెరికా తుమ్మితే ప్రపంచానికి జలుబు చేస్తుందన్న నానుడికి విరుద్ధంగా, దేశీ ఇన్వెస్టర్లు ఈసారి మరీ భయపడిపోకుండా కాస్త తట్టుకుని నిలబడ్డారు. అమెరికా మార్కెట్లు ఎలా ఉన్నా... మన మార్కెట్లు మాత్రం ఇక్కడి పరిణామాలకు అనువుగా స్పందించటం మొదలుపెట్టాయి. పైపెచ్చు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ విధానంలో (సిప్) వస్తున్న పెట్టుబడులు మరింత పెరిగాయి తప్ప నిలిచిపోలేదు. అందుకే మన ఇండెక్స్‌లు అంతర్జాతీయ మార్కెట్ల మాదిరి మరీ ఎక్కువ పతనం కాలేదన్నది వాస్తవం. ఇక 2019లో మరో ఐదారు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. క్రూడ్ ధరలు తీవ్రమైన హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ మరో రెండుమూడు సార్లు వడ్డీ రేట్లు పెంచుతామనే సంకేతాలిచ్చింది. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయనేది ఊహించటం కాస్త కష్టం. కాకపోతే కంపెనీల ఆదాయాల్ని బట్టి ఆయా షేర్లు రాణిస్తాయనేది బ్రోకరేజీ సంస్థల మాట. ఆయా బ్రోకరేజీ సంస్థలు కొత్త సంవత్సరం కోసం సిఫార్సు చేస్తున్న షేర్లలో కొన్ని ‘సాక్షి’ ప్రాఫిట్ పాఠకులకు ప్రత్యేకం.. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఆశావహంగా బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్... 2018లో ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. వాణిజ్య యుద్ధ భయాలు మార్కెట్లను వెంటాడగా, ప్రపంచ వృద్ధి రేటుపైనా ప్రతికూల ప్రభావం చూపాయి. ప్రస్తుతం వాణిజ్య యుద్ధ భయాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. క్రూడ్ ధరలూ తగ్గుతున్నాయి. 2019లో దేశీయంగా అంతర్గత అంశాల ప్రభావం మార్కెట్లపై గణనీయంగా ఉంటుంది. ఎన్నికల దరిమిలా కొత్తగా ఏ ప్రభుత్వం ఏర్పాటవుతుందనేది కీలకంగా మారింది. ఒకవేళ బలహీన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే ఎకానమీ వృద్ధి పైనా ప్రభావం పడుతుంది. 2018–20 ఆర్థిక సంవత్సరాల మధ్యలో నిఫ్టీ 18.5 శాతం వృద్ధి నమోదు చేయొచ్చు. ఇందుకు బ్యాంకింగ్, ఎన్బీఎఫ్సీ రంగాల షేర్లు తోడ్పడవచ్చు. 2019లో ఆటోమొబైల్ రంగం బలహీనంగా ఉండే అవకాశం ఉంది. కొత్త సంవత్సరంలో బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, సిమెంట్ రంగాలు ఆశావహంగా ఉంటాయని భావిస్తున్నాం. అలాగే, కన్సూ్యమర్ డ్యూరబుల్స్, ఎఫ్ఎంసీజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థల షేర్లు కూడా సానుకూలంగా ఉండొచ్చు. మెటల్, మైనింగ్, రియల్ ఎస్టేట్, టెలికం, ఐటీ రంగాల పనితీరు తటస్థంగా ఉండవచ్చు. 2019లో బీజేపీ కూటమికి అత్యధికంగా సీట్లొచ్చే అవకాశం ఉంది. స్టాక్‌మార్కెట్‌పై దీని ప్రభావం కూడా ఉంటుంది. జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వినియోగ వస్తువులు, ఐటీ స్టాక్స్ బెస్ట్ రాష్ట్రాల ఎన్నికలు, ఆర్బీఐ గందరగోళం, చమురు ధరల పతనం, తగ్గిన ద్రవ్యోల్బణం, వాణిజ్య లోటు తగ్గుముఖం పట్టడం, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు మెరుగ్గా ఉండటం వంటివి డిసెంబర్లో స్టాక్ మార్కెట్లు హెచ్చు తగ్గులకు కారణమయ్యాయి. నిఫ్టీ 6 శాతం శ్రేణిలో తిరిగింది. రైతు రుణ మాఫీలు, జీఎస్టీ రేట్ల కోత మొదలైన పరిణామాలన్నీ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. అధిక వినియోగం ద్వారా ఎకానమీకి ఇవి సానుకూలమైనవే అయినప్పటికీ.. సమీప భవిష్యత్‌లో ఈ ప్రజాకర్షక పథకాలతో దేశ ఆర్థిక విధానాలపై ప్రతికూల ప్రభావాలు పడవచ్చు. ఇప్పటికే వృద్ధి మందగించడం, వచ్చే 6 నెలల్లో మరింత నెమ్మదించనుండటంతో.. ఈ రిస్కులు మరింత పెరుగుతాయి. ఈ పరిస్థితుల్లో కొత్త ఏడాది ఐటీ కంపెనీలు సానుకూలంగా కనిపిస్తున్నాయి. వీటితో పాటు ఎఫ్ఎంసీజీ, వ్యవసాయ రంగాల షేర్లూ ఆకర్షణీయమే. సిఫార్సులు 1. ఎక్సైడ్ ఇండస్ట్రీస్ ప్రస్తుత ధర రూ. 265 ఎందుకంటే..?: స్టోరేజీ బ్యాటరీ వ్యాపారంలో దేశీయంగా 60 శాతం మార్కెట్ వాటాతో ఎక్సైడ్.. లీడర్ స్థానంలో ఉంది. క్యూ2లో అధిక ఇంధన ధరలు, రూపాయి పతనంతో ఎబిటా 30 బేసిస్ పాయింట్ల మేర క్షీణించింది. అయితే.. బ్యాటరీ ఇంజినీరింగ్ ఆమోదయోగ్యత పెరుగుతుండటం వంటి అంశాల వల్ల ఎక్సైడ్ దీర్ఘకాలిక అంచనాలు సానుకూలంగా ఉన్నాయి. 2018–2020 ఆర్థిక సంవత్సరాల మధ్య ఆదాయాలు, నికర లాభం 15–16 శాతం మేర వృద్ధి చెందే అవకాశం ఉంది. 2. పీఎన్సీ ఇన్ఫ్రాటెక్ ప్రస్తుత ధర రూ. 148 ఎందుకంటే..?: ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణ, అభివృద్ధి, నిర్వహణ రంగ కంపెనీ ఇది. హైవేలు, వంతెనలు, ఎయిర్పోర్ట్ రన్‌వేల నిర్మాణంలో అపార అనుభవం ఉంది. పెద్ద ఆర్డర్లను పూర్తి చేయడంతో ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఆదాయం 108 శాతం మేర పెరిగింది. సుమారు రూ.10,632 కోట్ల కాంట్రాక్టులతో ఆర్డర్ బుక్ పటిష్టంగా ఉంది. 85 శాతం మేర స్థల సమీకరణ పూర్తవడంతో.. చాలా మటుకు ప్రాజెక్టులు ప్రస్తుతం పూర్తయ్యే దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2018–20 మధ్య ఆదాయాలు 39 శాతం మేర ‡వార్షిక వృద్ధి సాధించవచ్చని అంచనా. 3. పీఐ ఇండస్ట్రీస్ ధర రూ. 857 ఎందుకంటే..?: పంటల సంరక్షణ ఉత్పత్తులను తయారు చేసే సంస్థ ఇది. దేశ, విదేశ అమ్మకాలు మెరుగ్గా ఉండటంతో 2018–19 క్యూ2లో విక్రయాలు 29 శాతం వృద్ధి చెందాయి. కొత్త ఉత్పత్తులు, సీఎస్ఎం వ్యాపార విభాగంలో పటిష్టమైన ఆదాయ అవకాశాలు సంస్థకు సానుకూలాంశాలు. 2018–2020 ఆర్థిక సంవత్సరాల మధ్యలో నికర లాభం 19 శాతం వృద్ధి చెందవచ్చని అంచనా. ఎగుమతులు పెరుగుతుండటం, మెరుగైన ఆర్అండ్డీ కార్యకలాపాలు, కొత్త ప్లాంట్ల రాక, పటిష్టమైన ఆర్డర్ బుక్ వంటివి ఈ షేర్‌కు సానుకూలాంశాలు. యాక్సిస్ డైరెక్ట్ ఎన్నికల దాకా ఒడిదుడుకులు ప్రస్తుత ఒడిదుడుకులు సార్వత్రిక ఎన్నికల దాకా కొనసాగే అవకాశాలున్నాయి.ఫెడ్ నిర్ణయాలు, వాణిజ్యయుద్ధం, క్రూడ్ ధరలు, ద్రవ్యోల్బణం, ఆర్బీఐ నిర్ణయాలు వంటివి ప్రభావం చూపుతాయి. గ్రామీణ ప్రాంతాల వృద్ధితో భారీ డిమాండ్ కొనసాగిన పక్షంలో మార్కెట్లు మరింతగా పెరగొచ్చు. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో చూడతగ్గ స్టాక్స్ కొన్ని... 1. ఇండస్ ఇండ్ బ్యాంక్ ప్రస్తుత ధర రూ. 1,583 టార్గెట్ రూ. 1,876 రాబడి: 18 శాతం ఎందుకంటే..?: మెరుగైన మార్జిన్లు, అత్యధిక వడ్డీయేతర ఆదాయాలు, స్థిరమైన అసెట్ క్వాలిటీ వంటివి బ్యాంకుకు సానుకూలాంశాలు. 2. వోల్టాస్ ప్రస్తుత ధర రూ. 551 టార్గెట్ ధర రూ. 672 రాబడి: 22 శాతం ఎందుకంటే..?: సుమారు మూడు నుంచి అయిదేళ్ల వ్యవధికి సంబంధించి కన్జూమర్ డ్యూరబుల్స్‌లో వోల్టాస్ మెరుగ్గా ఉంది. పటిష్టమైన నెట్వర్క్, విస్తృతమైన ఉత్పత్తుల శ్రేణి, మెరుగైన ఆర్డర్ బుక్ సానుకూలాంశాలు. 3. స్టెరిలైట్ టెక్నాలజీస్ ప్రస్తుత ధర రూ. 289 టార్గెట్ ధర రూ. 410 రాబడి: 41 శాతం ఎందుకంటే..?: ఆప్టికల్ ఫైబర్ కేబుల్ తదితర ఉత్పత్తుల సరఫరాదారు స్థాయి నుంచి డేటా నెట్వర్క్ సొల్యూషన్స్ అందించే సంస్థగా రూపాంతరం చెందుతుండటం కంపెనీకి సానుకూలాంశం. మిలిటరీ, ఏరోస్పేస్, హెల్త్‌కేర్ వంటి విభాగాల నుంచి కూడా ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుండటం కంపెనీకి లాభించనుంది. సంస్థకు దేశీయంగా 40 శాతం, అంతర్జాతీయంగా 10 శాతం మార్కెట్ వాటా ఉంది. దాదాపు రూ. 6,000 కోట్ల ఆర్డర్లు చేతిలో ఉన్నాయి. 4. ఆర్తి ఇండస్ట్రీస్ ప్రస్తుత ధర రూ. 1,421 టార్గెట్ ధర రూ. 1,740 రాబడి 22 శాతం ఎందుకంటే..?: ఉత్పత్తి సామర్ధ్య విస్తరణ, డిమాండ్ వృద్దితో ఆదాయాలు మెరుగుపడగలవు. కొత్త టాలీన్ వ్యాపారం వచ్చే రెండు, మూడేళ్లలో గరిష్ట స్థాయిలో రాబడులివ్వొచ్చు. 5. టేక్ సొల్యూషన్స్ ప్రస్తుత ధర రూ. 149 టార్గెట్ ధర రూ. 178 రాబడి 19 శాతం ఎందుకంటే..?: భారీ మార్కెట్ లభ్యత, టీఎస్ఎల్ విభాగంలో అపార అనుభవం, కార్యకలాపాల విస్తరణపై ప్రధానంగా దృష్టి పెట్టడంతో ఆదాయాలు మెరుగుపడగలవు. 6. మారికో ప్రస్తుత ధర రూ. 378 టార్గెట్ ధర రూ. 428 రాబడి 12 శాతం ఎందుకంటే..?: కొబ్బరి ధరలు తగ్గనుండటం (గడిచిన పది నెలల్లో కేజీకి రూ. 90 పలికిన రేటు.. 30 శాతం తగ్గొచ్చని అంచనా) సంస్థకు సానుకూలం. ప్రధాన బ్రాండ్స్, అంతర్జాతీయ మార్కెట్లలో పనితీరు మెరుగ్గా ఉండటం.. ప్రయోజనకరం. 7. అంబర్ ఎంటర్ప్రైజెస్ ప్రస్తుత ధర రూ. 912 టార్గెట్ రూ. 1,106 రాబడి 21 శాతం ఎందుకంటే..?: రూమ్ ఎయిర్ కండీషనర్స్ (ఆర్ఏసీ) పరిశ్రమలోని ప్రధాన కంపెనీల్లో అంబర్ కూడా ఒకటి. ఇటీవల ఇతర కంపెనీల కొనుగోలుతో ఇన్వర్టర్ ఆర్ఏసీ విభాగాన్ని పటిష్టపర్చుకుంది. బ్రాండ్ ఓనర్లు అవుట్సోర్సింగ్ చేసే ధోరణి పెరుగుతుంటం కంపెనీకి లాభించే అంశం. హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ సానుకూలం.. 1. ఏసీసీ ప్రస్తుత ధర రూ. 1,478 ఎందుకంటే..?: ఉత్పత్తి సామర్ధ్య వినియోగం పదేళ్ల గరిష్ట స్థాయికి చేరింది. చాలా ప్రాంతాల్లో సిమెంటు రేట్లు మెరుగుపడ్డాయి. కొంగొత్త ప్రీమియం ఉత్పత్తులు, మెరుగైన ధర అంచనాలు, కార్యకలాపాల విస్తరణ, తక్కువ వేల్యుయేషన్‌లో లభిస్తుండటం దీనికి సానుకూలాంశాలు. 2. యాక్సిస్ బ్యాంక్ ప్రస్తుత ధర రూ. 625 ఎందుకంటే..?: రెండేళ్ల పాటు 17 శాతం అసెట్ వృద్ధి సాధనకు సరిపడేంతగా మూలధన నిల్వలున్నాయి. తదుపరి వృద్ధికి అవకాశమిచ్చే సాధనాల్లో గణనీయంగా ఇన్వెస్ట్ చేసింది. కొత్తగా మరిన్ని మొండిబాకీలు తలెత్తకుండా ఉండటంతో పాటు రుణ వ్యయాలు తగ్గుతుండటం మూలంగా ఆదాయాలు ద్వితీయార్ధంలో మెరుగుపడే అవకాశాలున్నాయి. ఇక, టాప్ మేనేజ్మెంట్ మారడంతో స్టాక్ రీరేటింగ్ జరగొచ్చు. ప్రస్తుతం షేరు ఆకర్షణీయ వేల్యుయేషన్స్‌లో లభిస్తోంది. 3. ఐటీసీ ప్రస్తుత ధర రూ. 282 ఎందుకంటే..?: ఈ షేరు అవుట్పెర్ఫార్మ్ చేయడానికి అయిదు కారణాలు కనిపిస్తున్నాయి. 1) మూడింట రెండొంతుల మంది స్మోకర్స్ గ్రామీణ ప్రాంతాల్లోనే ఉండటం, వీరు బీడీల నుంచి అప్‌గ్రేడ్ అవుతుండటం. 2) పన్నుల విధానం స్థిరంగా ఉంటుందన్న అంచనాలు 3) సానుకూలమైన బేస్ 4) అక్రమ వ్యాపారాలను కట్టడి చేయడం 5) ఎఫ్ఎంసీజీ వ్యాపార వాటా పెరుగుతుండటం. ఈ అంశాల కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 2021 దాకా మెరుగైన రాబడులు రావొచ్చు. ప్రస్తుతం ఈ రంగంలో మిగతా వాటితో పోలిస్తే 35 శాతం డిస్కౌంట్‌తో ట్రేడవుతోంది. 4. ముత్తూట్ ఫైనాన్స్ ప్రస్తుత ధర రూ. 504 ఎందుకంటే..?: గోల్డ్ లోన్ సెగ్మెంట్లో దీర్ఘకాలికంగా కార్యకలాపాలు, మంచి అనుభవం ఉండటం దీనికి సానుకూలాంశం. బంగారంయేతర రుణాల వాటా పెరుగుతుండటంతో.. పోర్ట్‌ఫోలియోకు రిస్కులు తగ్గుతున్నాయి. ఇతరత్రా పథకాలను విక్రయించడానికి ప్రస్తుతం ఉన్న అసెట్స్నే ఉపయోగించుకునేందుకు వీలుండటంతో.. ఆదాయాలతో పోలిస్తే వ్యయాలు తక్కువగా ఉండొచ్చు. పసిడి రుణాల విభాగం పునర్వ్యవస్థీకరణ కారణంగా రాబోయే రోజుల్లో మొండిబాకీల స్థాయి తగ్గుతుంది. 5. రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రస్తుత ధర రూ. 1,125 ఎందుకంటే..?: కన్జూమర్, టెలికం సెగ్మెంట్ విస్తరించే కొద్దీ కంపెనీ ఆదాయాలు గణనీయంగా వృద్ధి చెందనున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 2021 దాకా టెలికం విభాగం ఆర్‌జియో ఆదాయం 27 శాతం మేర, లాభాలు 77 శాతం మేర వృద్ధి నమోదు చేయొచ్చని అంచనా. 2021 ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి రిలయన్స్ జియో సబ్‌స్క్రయిబర్స్ సంఖ్య 41 కోట్లకు చేరొచ్చు. జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వినియోగ వస్తువులు, ఐటీ స్టాక్స్ బెస్ట్ రాష్ట్రాల ఎన్నికలు, ఆర్బీఐ గందరగోళం, చమురు ధరల పతనం, తగ్గిన ద్రవ్యోల్బణం, వాణిజ్య లోటు తగ్గుముఖం పట్టడం, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు మెరుగ్గా ఉండటం వంటివి డిసెంబర్లో స్టాక్ మార్కెట్లు హెచ్చు తగ్గులకు కారణమయ్యాయి. నిఫ్టీ 6 శాతం శ్రేణిలో తిరిగింది. రైతు రుణ మాఫీలు, జీఎస్టీ రేట్ల కోత మొదలైన పరిణామాలన్నీ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. అధిక వినియోగం ద్వారా ఎకానమీకి ఇవి సానుకూలమైనవే అయినప్పటికీ.. సమీప భవిష్యత్‌లో ఈ ప్రజాకర్షక పథకాలతో దేశ ఆర్థిక విధానాలపై ప్రతికూల ప్రభావాలు పడవచ్చు. ఇప్పటికే వృద్ధి మందగించడం, వచ్చే 6 నెలల్లో మరింత నెమ్మదించనుండటంతో.. ఈ రిస్కులు మరింత పెరుగుతాయి. ఈ పరిస్థితుల్లో కొత్త ఏడాది ఐటీ కంపెనీలు సానుకూలంగా కనిపిస్తున్నాయి. వీటితో పాటు ఎఫ్ఎంసీజీ, వ్యవసాయ రంగాల షేర్లూ ఆకర్షణీయమే. సిఫార్సులు 1. ఎక్సైడ్ ఇండస్ట్రీస్ ప్రస్తుత ధర రూ. 265 ఎందుకంటే..?: స్టోరేజీ బ్యాటరీ వ్యాపారంలో దేశీయంగా 60 శాతం మార్కెట్ వాటాతో ఎక్సైడ్.. లీడర్ స్థానంలో ఉంది. క్యూ2లో అధిక ఇంధన ధరలు, రూపాయి పతనంతో ఎబిటా 30 బేసిస్ పాయింట్ల మేర క్షీణించింది. అయితే.. బ్యాటరీ ఇంజినీరింగ్ ఆమోదయోగ్యత పెరుగుతుండటం వంటి అంశాల వల్ల ఎక్సైడ్ దీర్ఘకాలిక అంచనాలు సానుకూలంగా ఉన్నాయి. 2018–2020 ఆర్థిక సంవత్సరాల మధ్య ఆదాయాలు, నికర లాభం 15–16 శాతం మేర వృద్ధి చెందే అవకాశం ఉంది. 2. పీఎన్సీ ఇన్ఫ్రాటెక్ ప్రస్తుత ధర రూ. 148 ఎందుకంటే..?: ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణ, అభివృద్ధి, నిర్వహణ రంగ కంపెనీ ఇది. హైవేలు, వంతెనలు, ఎయిర్పోర్ట్ రన్‌వేల నిర్మాణంలో అపార అనుభవం ఉంది. పెద్ద ఆర్డర్లను పూర్తి చేయడంతో ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఆదాయం 108 శాతం మేర పెరిగింది. సుమారు రూ.10,632 కోట్ల కాంట్రాక్టులతో ఆర్డర్ బుక్ పటిష్టంగా ఉంది. 85 శాతం మేర స్థల సమీకరణ పూర్తవడంతో.. చాలా మటుకు ప్రాజెక్టులు ప్రస్తుతం పూర్తయ్యే దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2018–20 మధ్య ఆదాయాలు 39 శాతం మేర ‡వార్షిక వృద్ధి సాధించవచ్చని అంచనా. 3. పీఐ ఇండస్ట్రీస్ ధర రూ. 857 ఎందుకంటే..?: పంటల సంరక్షణ ఉత్పత్తులను తయారు చేసే సంస్థ ఇది. దేశ, విదేశ అమ్మకాలు మెరుగ్గా ఉండటంతో 2018–19 క్యూ2లో విక్రయాలు 29 శాతం వృద్ధి చెందాయి. కొత్త ఉత్పత్తులు, సీఎస్ఎం వ్యాపార విభాగంలో పటిష్టమైన ఆదాయ అవకాశాలు సంస్థకు సానుకూలాంశాలు. 2018–2020 ఆర్థిక సంవత్సరాల మధ్యలో నికర లాభం 19 శాతం వృద్ధి చెందవచ్చని అంచనా. ఎగుమతులు పెరుగుతుండటం, మెరుగైన ఆర్అండ్డీ కార్యకలాపాలు, కొత్త ప్లాంట్ల రాక, పటిష్టమైన ఆర్డర్ బుక్ వంటివి ఈ షేర్‌కు సానుకూలాంశాలు. – సాక్షి, బిజినెస్ విభాగం గమనిక: ఇవన్నీ బ్రోకరేజి సంస్థల సిఫార్సులు మాత్రమే. రిస్కులను బేరీజు వేసుకుని ఇన్వెస్టర్లు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. -
నిఫ్టీ... ఫ్యూచర్స్ సిగ్నల్స్
ప్రపంచ ట్రెండ్ ప్రభావంతో ఇక్కడ మార్కెట్ ర్యాలీ జరపడంతో నిఫ్టీ ఆగస్టు 7 తర్వాత తొలిసారిగా 10,000 పాయింట్లపైన 10,006 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఈ సందర్భంగా నిఫ్టీ ఫ్యూచర్ కాంట్రాక్టు ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ)లో 3.33 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. దీంతో మొత్తం ఓఐ 1.98 కోట్ల షేర్లకు పెరిగింది. నిఫ్టీ ఫ్యూచర్ 10,026 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం ట్రేడింగ్రోజున ఫ్యూచర్ ప్రీమియం 15 పాయింట్లు వుండగా, సోమవారం అది 20 పాయింట్లకు పెరిగింది. ఇండెక్స్ ర్యాలీ సందర్భంగా ప్రీమియం పెరిగిన కారణంగా ఫ్యూచర్లో యాడ్ అయిన పొజిషన్లలో అధికభాగం లాంగ్స్గా పరిగణించవచ్చు. ఆప్షన్స్ విభాగంలో 10,000 స్ట్రయిక్ వద్ద కాల్ కవరింగ్, పుట్ రైటింగ్ జరగడంతో కాల్ ఆప్షన్ నుంచి 8.45 లక్షల షేర్లు కట్‌కాగా, పుట్ ఆప్షన్లో 10.3 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. అయితే ఈ స్ట్రయిక్ స్థాయికి ఇండెక్స్ చేరడం ఐదు వారాల తర్వాత జరిగినందున, ఇక్కడ ఆప్షన్ బిల్డప్ ఇంకా తక్కువగానే వుంది. 38.89 లక్షల కాల్ బిల్డప్, 33.39 లక్షల పుట్ బిల్డప్ ఇక్కడ వుంది. 9,900 స్ట్రయిక్ వద్ద పుట్ రైటింగ్‌తో 4.22 లక్షల షేర్లు యాడ్‌కాగా, బిల్డప్ 56 లక్షలకు పెరిగింది. మరోవైపు 10,100, 10,200 స్ట్రయిక్స్ వద్ద కాల్ రైటింగ్ జరగడంతో 99 వేలు, 4.95 లక్షల చొప్పున షేర్లు యాడ్ అయ్యాయి. ఈ స్ట్రయిక్స్ వద్ద 36 లక్షల చొప్పున కాల్ బిల్డప్ జరిగింది. సమీప భవిష్యత్తులో నిఫ్టీ 10,000పైన స్థిరపడితే 10,100 స్థాయిని అధిగమించగలదని, అనూహ్య పరిణామాల కారణంగా క్షీణత సంభవిస్తే 9,900 సమీపంలో మద్దతు పొందవచ్చని ఈ ఆప్షన్ డేటా సూచిస్తున్నది.