పెరిగిన ఓటర్లు
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లాలో ఓటర్ల సంఖ్య పెరిగింది. గత ఏడాది (2012)లో 31,59,231 మంది ఓటర్లు ఉండగా, తాజా లెక్కల ప్రకారం 32,12,094 మందికి చేరింది. దీని ప్రకారం ఈ ఏడాది 52,863 మంది ఓటర్లుగా చేరారు. ఓటరు కార్డుపై అవగాహన పెరగడం, వివిధ అవసరాలకు గుర్తింపు కార్డుగా ఉపయోగం వంటి కారణాలతో ఎక్కువమంది ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకున్నారు.
ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకున్న వారు కూడా గణనీయంగా పెరిగారు. కాగా, గత ఏడాది లక్షమందికి పైగా కొత్త ఓటర్లుగా నమోదు కాగా, ఆ సంఖ్య ఈసారి 52 వేలకే పరిమితమైంది. హెదరాబాద్ జిల్లాలోని 15 నియోజకవర్గాలకుగాను జూబ్లీహిల్స్లో అత్యధికంగా 2,47,461 మంది ఓటర్లుండగా, అత్యల్పంగా చార్మినార్లో 1,61,884 మంది ఓటర్లున్నారు.
ఓటర్ల ముసాయిదా జాబితాలను ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలు, పోలింగ్ స్టేషన్లున్న భవనాల్లో అందుబాటులో ఉంచినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.