breaking news
Incidents of rape
-
యోగీ రాజీనామా చెయ్యి.. రాష్ట్రపతి పాలన పెట్టండి!
సాక్షి, లక్నో: ఉత్తరప్రదేశ్‌లో వరుస హత్యాచార ఘటనలు దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహ జ్వాలల్ని రగిలిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో హత్రాస్, బలరాంపూర్ ఘటనలపై బీఎస్పీ అధినేత మాయావతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలో నేరస్థులు, మాఫియా, రేపిస్టులకు అడ్డూ అదుపూలేకుండా పోతోందన్నారు. 'జంగిల్‌రాజ్' యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రంలో నేరాలు, ముఖ్యంగా దళిత బాలికలపై నేరాలు పెరిగిపోతున్నాయంటూ యోగిపై ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగీ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. (నడుం, కాళ్లు విరిచి.. వరుస అఘాయిత్యాలు) రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి క్షీణిస్తోందని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మాయావతి ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు యోగీ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారన్నారు. మహిళలకు భద్రత కల్పించడంలో విఫలమైన రాష్ట్రంలో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించాలని ఆమె డిమాండ్ చేశారు. హత్రాస్ బల్రాంపూర్ ఘటనలు తనను తీవ్రంగా కలిచి వేశాయని, నిర్భయ కేసును గుర్తుకు తెచ్చాయని మాయావతి ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలు జరగని రోజు ఒక్కటి కూడా లేదని విమర్శించారు. తనకూ ఒక ఆడకూతురు ఉందనే విషయాన్ని సీఎం గుర్తుంచుకోవాలని, ఆడబిడ్డలను రక్షించ లేని యోగి వెంటనే రాజీనామా చేయాలని మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు స్వస్థలమైన గోరఖ్‌పూర్ మఠానికి యోగిని పంపించాలని మాయావతి వ్యాఖ్యానించారు. (కాల్చి బూడిద చేసేశారు.. ఇదెక్కడి న్యాయం!) అలాగే హత్రాస్ హత్యాచార బాధితురాలి మృతదేహాన్ని ఆమె కుటుంబానికి అప్పగించకుండా, అర్ధరాత్రి దహనం చేసిన యూపీ పోలీసులపై మాయావతి మండిపడ్డారు. ఇది సిగ్గుచేటైన సంఘటన అని బీఎస్పీ చీఫ్ దుయ్యబట్టారు. ఇది జంగిల్‌రాజ్యం కాకపోతే, మరేంటి? అని ప్రశ్నించారు. బాధితుల కుటుంబానికి అండగా నిలిచిన ప్రతిపక్షాలను ప్రశంసించిన మాయవతి తమ పార్టీ కూడా బాధిత కుటుంబం తరపున పోరాడు తుందన్నారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ బలరాంపూర్, ఆజంగర్ వరుస దారుణాలపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. యోగి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కాగా హత్రాస్ సంఘటనపై దర్యాప్తునకు ముగ్గురు సభ్యుల సిట్ ఏర్పాటు చేసినట్లు సీఎం యోగి బుధవారం తెలిపారు. రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి భగవాన్ స్వరూప్‌తో కూడిన ముగ్గురు సభ్యుల బృందంలో మహిళా సభ్యులతో పాటు దళిత వర్గానికి చెందిన సభ్యులు కూడా ఉంటారు ఈ బృందం ఏడు రోజుల్లో నివేదిక సమర్పించనుందని, ఈ కేసు విచారణను ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించనున్నామని తెలిపారు. అలాగే బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతో పాటు రూ .25 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఇల్లు ఇస్తామని రాష్ట్రం ప్రకటించింది. వీడియోలింక్ ద్వారా కుటుంబ సభ్యులతో మాట్లాడిన సీఎం నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
మంత్రి ఈటల రాజీనామా చేయాలి
చల్లూరు బాధితురాలికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేశ్‌మాదిగ కరీంనగర్ : వీణవంక మండలం చల్లూరు దళిత యువతిపై అత్యాచార ఘటనకు నైతిక బాధ్యత వహించి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేశ్‌మాదిగ కోరారు. అంబేద్కర్ భవన్లో గురువారం నిర్వహించిన ఎంఎస్ఎఫ్ ముఖ్య కార్యకర్తల సమావేశం అనంతరం విలేకరులతో మాట్లారు. నిందితులను రక్షించేందుకు మంత్రి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అందుకే పోలీసులు కేసును సీరియస్‌గా తీసుకోవడం లేదన్నారు. గ్యాంగ్‌రేప్ బాధితురాలికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరారు. ఎంఎస్ఎఫ్ జిల్లా ఇన్చార్జి బొర్ర భిక్షపతి, నగర అధ్యక్షుడు గోష్కి అజయ్, జిల్లా అధ్యక్షుడు మాతంగి మహేశ్, నాయకులు అనిల్, ప్రశాంత్, అజయ్, బోయిని శశి, ప్రవీణ్, హరికృష్ణ, ఉదయ్, రాజేశ్, లావణ్య, లక్ష్మణ్, వర్మ తదితరులు పాల్గొన్నారు. -
ఐదేళ్ల జీతం ఇమ్మన్నందుకు..
యూపీలో అత్యాచారం, హత్య రాంపూర్(యూపీ): ఉత్తరప్రదేశ్‌లో అత్యాచారకాండకు అంతులేకుండా పోతోంది. తాజాగా రాంపూర్ జిల్లాలో ఓ పనిమనిషి యజమాని ఆకృత్యాలకు బలైపోయింది. తన ఐదేళ్ల జీతం ఇవ్వాలని కోరడమే ఆమె పాలిట శాపమైంది. కేసు వివరాలు.. 24 ఏళ్ల మహిళ హైడల్ డిపార్ట్మెంట్ కాలనీలోని ఓ ఇంట్లో పదేళ్లుగా పని చేస్తోంది. ఐదేళ్లుగా తన జీతాన్ని యజమానుల దగ్గరే దాచింది. ఈ మొత్తం సుమారు రూ. 1.80 లక్షలు కావడంతో జూలై 3న బాధితురాలు తన జీతం ఇవ్వాలని యజమానురాలు మహితో పాటు ఆమె సోదరుడు ఫసహత్, మరో వ్యక్తి మహ్మద్ ఉస్మాన్‌లను అడిగింది. జీతం కోసం ఆమె ఒత్తిడి తేవడంతో జూలై 12న నిందితులు ఆమెపై అత్యాచారం చేసి అనంతరం ఆమె ఆహారంలో విషం కలిపి హతమార్చారు. దీనిపై బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించగా.. వారు స్పందించలేదు. దీంతో ఆమె స్థానిక కోర్టును ఆశ్రయించడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం వేట ప్రారంభించారు.