breaking news
imposed duty
-
మళ్లీ ట్రంప్ టారిఫ్ బాంబు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ ఉత్పత్తులపై టారిఫ్‌ల మోత మోగిస్తూనే ఉన్నారు. ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా లెక్కచేయకుండా ముందుకెళ్తున్నారు. విదేశాల నుంచి దిగుమతి అయ్యే కలప(టింబర్)పై 10 శాతం, ఫర్నిచర్‌తోపాటు కిచెన్ కేబినెట్లపై 25 శాతం సుంకాలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ సుంకాలు ఈ నెల 14వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. ట్రంప్ ఆదేశాల పట్ల అమెరికాలో భవన నిర్మాణ రంగంపై మరింత భారం పడడం ఖాయమని నిపుణులు తేల్చిచెబుతున్నారు. ఇళ్ల నిర్మాణం ఖరీదైన వ్యవహారంగా మారుతుందని అంటున్నారు. అమెరికాలో నిర్మాణ వ్యయం ఇప్పటికే విపరీతంగా పెరిగిపోయింది. స్థానిక పరిశ్రమల కోసమే అమెరికా జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకో వడంతోపాటు స్థానిక కలప పరిశ్రమలను ప్రోత్సహించాలన్న లక్ష్యంతోనే విదేశీ కలప, ఫర్నిచర్‌పై సుంకాలు విధించినట్లు ట్రంప్ స్పష్టంచేశారు. స్థానిక పరిశ్రమలకు ఊతం ఇస్తే కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుందని, తద్వారా తమ యువతకు లబ్ధి చేకూరుతుందని వివరించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దిగుమతులు తగ్గించుకోవడంతోపాటు అమెరికా నుంచి కలప, ఫర్నిచర్ ఎగుమతులు పెరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. తమ అవసరాలకు సరిపోయే చెట్లు, కలప అమెరికాలో ఉన్నాయని స్పష్టంచేశారు. అమెరికాకు ప్రధానంగా పొరుగుదేశం కెనడా నుంచి కలప దిగుమతి అవుతుంది. ట్రంప్ తాజా నిర్ణయంతో కెనడాకు నష్టం వాటిల్లే పరిస్థితి కనిపిస్తోంది. -
డబ్ల్యూటీవోలో భారత్ అనుకూల తీర్పు
జెనీవా: భారత్ నుంచి దిగుమతి చేసుకునే పలు రకాల ఉక్కు ఉత్పత్తులపై అమెరికా ఏఎస్‌సీఎం ఒప్పంద నిబంధనలకు విరుద్ధంగా 300 శాతం సుంకాలను విధించడాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) తప్పుబట్టింది. వాటిని తక్షణం ఉపసంహరించుకోవాలని ఆదేశిస్తూ డబ్ల్యూటీవో అప్పీలేట్ బాడీ తీర్పు వెలువరించింది. అమెరికా చర్యపై భారత్ 2012లో డబ్ల్యూటీవోకు ఫిర్యాదు చేసింది. దీనిపై గత జూలైలో డబ్ల్యూటీవో విచారణ జరిపింది.