breaking news
iman ahmad abdulati
-
ఆమెకు విమాన ఛార్జీ ఎంతో తెలుసా?
ముంబయి: స్థూలకాయం కారణంగా దాదాపు అరటన్ను బరువుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఎమాన్ అహ్మద్ అబ్దులాటికి రోజుకో సమస్య ఉత్పన్నమవుతోంది. వైద్యం చేయించుకుని తిరిగి సాధారణ జీవితంలోకి మారేందుకు ఆమెకు ఒకదాని వెంట ఇబ్బందులు వచ్చి పడుతున్నాయి. తొలుత వైద్యం ఆచూకీ తెలియక, భారత్లో ముంబయి వైద్యులు ముందుకొచ్చాకా.. వీసా దొరక్క.. వీసా దొరికాక ఆమెను తరలించే విమానం దొరక్క ఇలా సమస్యలు క్యూ కట్టాయి. చివరకు ఆమెను తరలించేందుకు ఓ కమర్షియల్ విమానం ముందుకొచ్చింది. అయితే, హమ్మయ్య అనుకునేలోగానే అందుకోసం చెల్లించాల్సిన మొత్తాన్ని చూసి అమ్మో అనుకునే పరిస్థితి తలెత్తింది. ఆమెను తరలించిందేందుకు ముందుకొచ్చిన విమానం ఈజిప్టు నుంచి ముంబయి వచ్చేందుకు రూ.20లక్షలు అడిగారు. దీంతో ప్రస్తుతం ఆ డబ్బు ఎలా సమకూర్చుకోవాలి అని కుటుంబం అనుకుంటుండగానే ఆమెకు ఉచితంగా వైద్యం చేసేందుకు ముందుకొచ్చిన వైద్యులే ఎమాన్ పేరిట ప్రత్యేక బ్యాంకు ఖాతాను తెరిచారు. స్వచ్ఛంద విరాళాలు ఇచ్చేందుకే కాకుండా వచ్చిన డబ్బును ఎందుకు ఖర్చుచేస్తున్నామనే వివరాలు కూడా పూర్తి పారదర్శకంగా ఉండేలా, దాతలకు తెలిసేలా ఏర్పాట్లు చేశారు. ఈ కేసును ముంబయి వైద్యులు ప్రత్యేకంగా చూస్తున్నారు. -
అమ్మో ఇంత బరువా..?
అలెగ్జాండ్రియా: ఈజిప్టుకు చెందిన ఓ 36 ఏళ్ల మహిళ బరువు ఏకంగా 500 కేజీలకు చేరింది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక బరువు కలిగిన మహిళ ఈమెనని భావిస్తున్నారు. ఈఐ అరేబియా రిపోర్టు ప్రకారం.. ఇమాన్ అహ్మద్ అబ్దులాతి అనే మహిళ గత 25 ఏళ్లుగా ఇల్లు దాటి బయటకు రానే లేదు. బరువు కారణంగా తన మంచం దిగి బయటకు రాలేకపోతున్నానని ఆమె తెలిపింది. అంతేకాదు పక్కకు తిరిగి పడుకోవాలన్నా కుదరదని చెప్పింది. ఆహారం తీసుకోవడానికి, బట్టలు మార్చుకోవడానికి, రోజూ వారి పనులు చేసుకోవడానికి కచ్చితంగా తన తల్లి, సోదరి సాయం ఉండాలని అబ్దులాతి పేర్కొంది. తాను ఎలిఫెంటయాసిస్ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపింది. దీని కారణంగా తాను ఇంత భారీగా పెరిగినట్లు చెప్పింది. దాంతో తాను స్కూల్ కు వెళ్లడం మానేసినట్లు తెలిపింది. వైద్య పరీక్షల్లో తన శరీరం అవసరమైన మొత్తం కంటే ఎక్కువగా నీటిని తనలో ఉంచుకుంటున్నట్లు తేలిందని వెల్లడించింది.