breaking news
Ignorence
-
తెలంగాణ సర్కార్‌కు పట్టని కేఆర్ఎంబీ ఆదేశాలు
-
పోస్టింగ్‌లు నిల్.. ఊస్టింగ్‌లు ఫుల్..
సాక్షి కడప : టీడీపీ అధినేత చంద్రబాబు రూటే సపరేటుగా మారింది. ఎన్నికలకు ముందు ఏవోవో చెప్పడం....అధికారంలోకి వచ్చాక విస్మరించడం పరిపాటిగా మారింది. 2014కు ముందు ఇంటింటికి ఉద్యోగం.. లేకపోతే చదువుకున్న ప్రతి ఒక్కరికీ భృతి అంటూ ఊదరగొట్టారు. ఐదేళ్ల నాటి వరకు పట్టించుకోకుండా చివరిలో భృతి రూ. 1000లకు పరిమితం చేసి ఆంక్షలతో అందని ద్రాక్షలా వేలాడదీశారు. ఎప్పుడూ లేని తరహాలో టీడీపీ మేనిఫెస్టోలో కూడా ఉద్యోగాలను భర్తీ చేస్తామని.. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చి కమిటీలతో కాలయాపన చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉన్న వారిని తొలగించే ప్రక్రియలో నిమగ్నమయ్యారు. ఒక్కొక్కశాఖ సిబ్బందిని ఒక్కొక్కసారి... తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ వేతనంతో మండలాల్లో పనిచేస్తూ రైతులకు సలహాలు, సూచనలు ఇస్తున్న ఆదర్శ రైతులను జిల్లా వ్యాప్తంగా దాదాపు 2500 మందికి పైగా తొలగించారు. తర్వాత జిల్లాలో 150మందికి పైగా ఉన్న హౌసింగ్ వర్క్ ఇన్స్పెక్ట ర్లను తొలగించారు. తర్వాత ఆందోళన చేయడం, అనంతరం అర్హతలు చూసి కొతమందిని చేర్చుకున్నా చాలామంది ఇంటికే పరిమితం అయ్యేలా చేశారు. తర్వాత ఉపాధి హామీలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను నూరు శాతం పనులు చేయించలేదని సాకు చూపుతూ జిల్లాలో వందలాదిమందికి చుక్కలు చూపారు. అయితే తర్వాత వారు పోరాటం చేయడం, రాజకీయ ఒత్తిళ్లు, ఇతర కారణాలతో మళ్లీ కొందరిని తీసుకోగా, ఇంకొందరిని ఇంటిబాట పట్టేలా చేసి కొత్త వారిని తీసుకున్నారు. ఆరోగ్యమిత్రలను కూడా అదేవిధంగా తొలగించి అర్హతల పేరుతో ప్రభుత్వం పరీక్షకు సిద్ధమైంది. అయితే వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించంతో పాటు పోరాట ఫలితంగా తిరిగి అవకాశం పొందారు. ఆశా వర్కర్లను కూడా చాలా మందిని ఇంటిదారి పట్టించారు. తర్వాత జిల్లాలో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న పదిమంది వైద్యులను కూడా ఇటీవలే ప్రభుత్వం తొలగించింది. తాజాగా మెప్మాలో పనిచేస్తూ డ్వాక్రా గ్రూపుల బలోపేతానికి కృషి చేస్తున్న ఐబీసీఆర్పీలను సాగనంపారు. కనిపించని ఇంటింటికి ఉద్యోగం ఎన్నికలకు ముందు ఇంటింటికి ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి అంటూ ఊదరగొట్టినప్పటికి ఈనాటికి ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. ఎన్నికలు ముగిసి ఐదేళ్లు పూర్తయి... మళ్లీ షెడ్యూల్ విడుదలయినా ఇప్పటికీ రాష్ట్రంలో భారీగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయలేదు. ఆయా శాఖల్లో భారీగా పోస్టులు ఉన్నా కేవలం మూడు, నాలుగు ఉద్యోగ నోటిఫికేషన్లతోనే టీడీపీ సర్కార్ సరిపెట్టింది. నిరుద్యోగ భృతి అయినా పెద్ద ఎత్తున ఇస్తారనుకుంటే ఒక్కొక్కరికి మేనిఫెస్టోలో రూ. 2 వేలు ఇస్తామని పేర్కొని చివరికి రూ. 1000తో సరిపెడుతూ అదీ ఎన్నికలకు ముందు ఓట్ల ఎత్తుగడే లక్ష్యంగా అమలు చేస్తున్నారు. -
బాబు నిర్లక్ష్యం.. ఆంధ్రాకు శాపం
- అవినీతికి తోడైన అసమర్థత.. - చంద్రబాబు నోరు నొక్కేసిన ‘ఓటుకు కోట్లు’ - తెలంగాణ విషయంలో ఆది నుంచి మెతకవైఖరి - రాష్ర్ట ప్రయోజనాలు పరిరక్షించడంలో ఘోర వైఫల్యం - ఇంత నిర్లక్ష్యమా.. ఆశ్చర్యపోతున్న సాగునీటిరంగ నిపుణులు సాక్షి, హైదరాబాద్: పొరుగు రాష్ర్టం అక్రమంగా ప్రాజెక్టులు కట్టేస్తున్నా ఆయన నోరు మెదపరు.. దాదాపు 115 టీఎంసీల నీటిని తోడేయడానికి సన్నాహాలు చేస్తున్నా అదేమని ప్రశ్నించరు.. అలా నీరు తోడేస్తే కృష్ణా డెల్టా ఎడారిగా మారిపోయే ప్రమాదమున్నా కించిత్ బాధపడరు.. రాయలసీమ పరిస్థితి మరింత దుర్భరంగా మారబోతున్నా ఆయనకు పట్టదు. ఆయనే రాష్ర్ట ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇంతకీ ఆయన ఎందుకు ఇంత నిర్లిప్తంగా ఉంటున్నారు? ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తున్నారు? ప్రజలు.. మరీ ముఖ్యంగా రైతుల ప్రయోజనాలు దెబ్బతింటున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు? అసలు తెలంగాణ అక్రమ ప్రాజెక్టులపై ఆయన ఒక్క మాట కూడా మాట్లాడే సాహసం ఎందుకు చేయలేకపోతున్నారు? ఆది నుంచీ అదే తీరు...: తెలంగాణ నిబంధనలను ఉల్లంఘిస్తున్నా చంద్రబాబు మెతకవైఖరి అను సరిస్తుండడంపై సాగునీటి శాఖ వర్గాలే ఆశ్చర్యపోతున్నాయి. కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య వాటాలు తేలకముందే, 299 టీఎంసీల నీటిని తెలంగాణ గంపగుత్తగా వాడుకోవడానికి అంగీకరించడం మొదలు.. అక్రమ ప్రాజెక్టులను గట్టిగా వ్యతిరేకించకుండా మెతకవైఖరి అవలంబిస్తున్న వరకు.. ముఖ్యమంత్రి చంద్రబాబు తీరును సాగునీటి అధికారులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత.. కృష్ణా జలాల వినియోగం విషయంలో స్పష్టత లేకుండా పోయింది. నీటి వాటాలను నిర్ణయించడానికి బ్రజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌ను కొనసాగిస్తున్నట్లు విభజన చట్టంలో పేర్కొన్నా.. వాటాల విభజన తెలుగు రాష్ట్రాల మధ్యేనా? కృష్ణాబేసిన్‌లోని మొత్తం 4 రాష్ట్రాల మధ్యా? అనే విషయంలో.. రాష్ట్ర విభజన జరిగిన రెండేళ్ల తర్వాత కూడా స్పష్టత రాలేదు. కానీ బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం కృష్ణా జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీల వాటాలో తెలంగాణకు 299 టీఎంసీలు ఇవ్వడానికి చంద్రబాబు ప్రభుత్వం అంగీకరించింది. తద్వారా రాష్ట్ర ప్రయోజనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు గండికొట్టినట్లయింది. మెతక వైఖరితో కొంప ముంచిన చంద్రబాబు రాష్ట్ర విభజన తర్వాత.. 2014లో ఆ ఏడాది కృష్ణా జలాల వినియోగం మీద రెండు రాష్ట్రాలు అవగాహనకు రావాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇరు రాష్ట్రాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. జనాభా ప్రాతిపదికన కృష్ణా జలాలనూ వాడుకోవాలని తెలంగాణ చేసిన సూచనకు ఆంధ్రప్రదేశ్ అంగీకరించింది. ఫలితంగా కృష్ణా జలాల్లో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీ వినియోగించుకోవాలనే ఒప్పందానికి వచ్చాయి. తెలంగాణ చేసిన సూచనను అంగీకరించే ముందు.. ఏపీ ప్రాజెక్టులకు ఉన్న కేటాయింపులు, అవసరాలను చంద్రబాబు ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకపోవడం గమనార్హం. అది కూడా 299 టీఎంసీలను కృష్ణానదిలో ఎక్కడ నుంచి అయినా తీసుకొని వాడుకోవడానికీ అంగీకరించడం దారుణమని అప్పట్లోనే తీవ్ర విమర్శలు చెలరేగాయి. తెలంగాణ 2014-15 వాటర్ ఇయర్లో నాగార్జున సాగర్‌లో ఉన్న కేటాయింపులకు మించి వాడుకోవడానికి, నిబంధనలకు విరుద్ధంగా సాగర్ ఆయకట్టు కింద రబీ సాగుచేసుకోవడానికి.. ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన అంగీకారమే తెలంగాణకు ఆసరాగా నిలిచింది. ఆ ఒక్క ఏడాదికే ఈమేరకు వినియోగ ఏర్పాటు అని అప్పట్లో ఏపీ ప్రభుత్వం విమర్శలకు సమాధానం ఇచ్చింది. రాష్ట్రాల కేటాయింపులను ప్రాజెక్టుల వారీగా కాకుండా గంపగుత్తగా వాడుకోవడానికి ఒప్పుకోవడం ఏపీకి తీరని నష్టం కలిగిస్తుందని, ఈ అంగీకారం ఆ ఒక్క సంవత్సరానికే అయినా, అది ఆనవాయితీగా మారే ప్రమాదం ఉందని అప్పట్లోనే సాగునీటి నిపుణులు, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరించినా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. అప్పట్లోనే ప్రాజెక్టుల వారీగా కేటాయింపుల ప్రకారమే వినియోగానికి ఏపీ పట్టుబట్టి ఉంటే.. ఇప్పుడు ఇంత దారుణమైన పరిస్థితి వచ్చేది కాదని నీటి పారుదల రంగం నిపుణులు చెబుతున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 2 టీఎంసీలు తోడుకోవడానికి వీలుగా 800 అడుగుల వద్ద పాలమూరు-రంగారెడ్డి, డిండి లిఫ్ట్‌ల నిర్మాణ పనులు చేపట్టినా.. ప్రభుత్వం కనీసం గట్టిగా వ్యతిరేకించడానికి కూడా ధైర్యం చేయకపోవడం దారుణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రిబ్యునల్ అవార్డు స్ఫూర్తికీ విరుద్ధం ట్రిబ్యునల్ అవార్డు స్ఫూర్తికి విరుద్ధంగా కేటాయింపులు చేయకూడదని, ట్రిబ్యునల్ తీర్పులను తిరగతోడకూడదని అంతర్రాష్ట్ర నదీ జలాల విదాదాల(సవరణ) చట్టం-2002 స్పష్టంగా చెబుతోంది. కానీ ట్రిబ్యునల్ స్ఫూర్తికి విరుద్ధంగా గంపగుత్తగా ఎలా కేటాయిస్తారని గట్టిగా వాదించాల్సిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే.. రాష్ట్ర ప్రయోజనాలకు తూట్లు పొడవటాన్ని సాగునీటి రంగం నిపుణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొత్త ప్రాజెక్టులకు అనుమతి తప్పనిసరి రాష్ట్ర విభజన నేపథ్యంలో కొత్తగా సాగునీటి ప్రాజెక్టులు చేపట్టాలంటే సంబంధిత నదీ యాజమాన్య బోర్డు, కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ), అపెక్స్ కౌన్సిల్ నుంచి తగిన అనుమతులు పొందాలని విభజన చట్టంలో 11వ షెడ్యూల్లో స్పష్టంగా పేర్కొన్నారు. కానీ కృష్ణాపై తెలంగాణ ప్రభుత్వం 120 టీఎంసీల సామర్థ్యంలో చేపడుతున్న పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు, కల్వకుర్తి లిఫ్ట్ సామర్థ్యాన్ని 25 టీఎంసీల నుంచి 40 టీఎంసీలకు పెంచుకోవడానికి.. ఎలాంటి అనుమతులు లేవు. కనీసం కృష్ణాబోర్డుకు ఈ ప్రాజెక్టుల గురించి సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం. అవినీతి.. అసమర్థత... ఆంధ్రప్రదేశ్‌లో పగ్గాలు చేపట్టింది మొదలు అనేక అవినీతి కుంభకోణాల్లో ప్రభుత్వం కూరుకుపోయింది. పట్టిసీమ మొదలు ఇసుకరీచ్‌ల వరకు అన్నీ అవినీతిమయమే. ఆ అవినీతి సొమ్ముతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కోట్లు పోసి కొనుగోలు చేయడమే కాదు.. అంతకుముందు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఆడియో, వీడియో టేపుల్లో స్వయంగా చంద్రబాబు, టీడీపీ నాయకులు అడ్డంగా దొరికిపోయారు. అలా ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయినప్పటి నుంచి ఆయన నోరు పెగల్చే పరిస్థితి లేకుండా పోయింది. ఈ అవినీతి కేసులతో పాటు ఆయన అసమర్థత కూడా తోడయ్యింది. ప్రపంచానికే పాఠాలు చెప్పానని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు సాగునీటి విషయంలో ఎంతటి అవగాహనా రాహిత్యంతో రాష్ర్టప్రయోజనాలకు గండికొట్టారో తెలుసుకుంటే ప్రజల గుండెలు మండడం ఖాయం...