breaking news
IDFC MD
-
ఇది కదా సహాయమంటే.. చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులకు రూ.2 కోట్ల బహుమానం!
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఎండీ, సీఈవో వి.వైద్యనాథన్ మరోసారి తన ఉదారత చాటుకున్నారు. మరణించిన సహోద్యోగి కుటుంబ సభ్యులకు తన వద్ద ఉన్న బ్యాంకు 5 లక్షల షేర్లను బహుమతిగా ఇచ్చారు. నేటి షేరు ముగింపు ధర బట్టి చూస్తే వీటి విలువ రూ.2 కోట్లుకు పైగా ఉంటుంది. ''మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ వి.వైద్యనాథన్ తన వద్ద ఉన్న ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ 5,00,000 ఈక్విటీ షేర్లను చాలా కాలం పాటు తనకు బాగా తెలిసిన మరణించిన సహోద్యోగి కుటుంబ సభ్యులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు బహుమతిగా ఇచ్చినట్లు" బ్యాంక్ పేర్కొంది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ షేర్లు గురువారం బీఎస్ఈలో 1.55 శాతం పెరిగి రూ.42.65 వద్ద ముగిశాయి. వైద్యనాథన్ ఇలా బహుమతిగా షేర్లు ఇవ్వడం మొదటిసారి కాదు. అతను ఇంతకు ముందు తన ట్రెయినర్, పనిమనిషి, డ్రైవర్‌తో పాటు అయిదుగురికి 9 లక్షల షేర్లను బహుమతిగా ఇచ్చి ఉదారత చాటుకున్నారు. నాటి షేరు ముగింపు ధర బట్టి చూస్తే వీటి విలువ రూ.3.95 కోట్లుగా ఉంటుంది. ఈ అయిదుగురి సొంత ఇంటి కల సాకారం చేసేందుకు ఆయన ఈ మేరకు సహాయం చేశారు. వీరెవ్వరితోనూ ఆయనకు బంధుత్వం లేదని స్టాక్ ఎక్సేంజీలకు బ్యాంకు తెలిపింది. వైద్యనాథన్ ఇలా బహుమతిగా షేర్లను ఇస్తూ ప్రసిద్ధి చెందాడు. ఉదాహరణకు, గత ఏడాది మేలో వైద్యనాథన్ బ్యాంకు 4.5 లక్షల షేర్లను రూ.2.34 కోట్ల చొప్పున ముగ్గురు వ్యక్తులకు విరాళంగా ఇచ్చారు. వారందరికీ ఒక్కొక్కరికి 1.5 లక్షల షేర్లు వచ్చాయి. 2020లో వైద్యనాథన్ తన పాఠశాల ఉపాధ్యాయుడికి రూ.30 లక్షల మొత్తం విలువ గల ఈక్విటీ షేర్లను బహుమతిగా ఇచ్చారు. (చదవండి: హ్యాకర్ల దెబ్బకు వణికిపోతున్న రష్యా.. వెబ్సైట్లు డౌన్.!) -
ఐడీఎఫ్సీ కొత్త ఎండీ, సీఈవోగా సునీల్ కాకర్
న్యూఢిల్లీ: ఐడీఎఫ్సీ లిమిటెడ్ కొత్త ఎండీ, సీఈవోగా కంపెనీలో ప్రస్తుత సీఎఫ్‌వో స్థానంలో ఉన్న సునీల్ కాకర్‌ను ఎంపిక చేసింది. జూలై 16 నుంచి మూడేళ్లు ఆయన సేవలు కొనసాగుతాయి. అడిషనల్ డైరెక్టర్‌గానూ ఆయన్ను బోర్డు నియమించింది. వీటికి వార్షిక వాటాదారుల సమావేశంలో ఆమోదం లభించాల్సి ఉంది. మరోవైపు ఐడీఎఫ్సీ ఎండీ, సీఈవో పదవికి విక్రమ్ లిమాయే సమర్పించిన రాజీనామానూ ఆమోదించింది. ఇది జూలై 15 నుంచి అమల్లోకి వస్తుందని కంపెనీ తెలిపింది. లిమాయే ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి.