breaking news
hotels closed
-
బాయ్‌కాట్ చైనా
న్యూఢిల్లీ: సరిహద్దులో ఘర్షణ నేపథ్యంలో భారత్‌లో చైనా ఆహార పదార్థాలను అమ్ముతున్న అన్ని రెస్టారెంట్లు, హోటళ్లను మూసేయాలంటూ కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే పిలుపునిచ్చారు. చైనాకు చెందిన ఆహారాన్ని బహిష్కరించాలన్నారు. రోజూవారీ కార్యకలాపాల్లో చైనా ఉత్పత్తుల వాడకాన్ని బహిష్కరించాలంటూ కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ప్రజలకు పిలుపునిచ్చారు. చైనా వైఖరిని అందరం చూస్తున్నామని అందుకే చైనా ఉత్పత్తులను వాడరాదని ఆయన అన్నారు. చైనా నుంచి వచ్చే ఉత్పత్తులకు ఇకపై బీఐఎస్ నాణ్యత ఉండేలా కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. చైనా నుంచి అక్రమంగా భారత్‌లోకి వచ్చే ఫర్నీచర్ వంటి వాటిలోనూ కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. -
హాస్టళ్లకు తాళం
నెమ్మది నెమ్మదిగా రాష్ర్ట ప్రభుత్వం సంక్షేమానికి మంగళం పలుకుతోంది. ఎవరికీ అనుమానం రాకుండా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా బీసీ,ఎస్సీ సంక్షేమ వసతి గృహాలపై కత్తివేలాడిదీసింది. ఒకేసారి మూసేస్తే ప్రతిఘటన ఎదురవుతోందని ఏటా కొన్నింటికి తాళం వేయాలని నిర్ణయించింది. ఈ దిశగా ప్రణాలిక సిద్ధం చేసింది. తొలుత కొన్ని ఎస్సీ హాస్టళ్లు మాత్రమేనని చెప్పుకొచ్చి ఏడాది బీసీ వసతి గృహాలనూ ఆ జాబితా లో చేర్చింది. శ్రీకాకుళం పాతబస్టాండ్: సంక్షేవు ఖర్చును కుదించేందుకు ప్రభుత్వం వసతి గృహాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల నుంచి హాస్టళ్ల మూసివేత ప్రక్రియ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది 12సాంఘిక సంక్షేమ వసతి గృహాలను మూసివేసింది. ఈ విద్యా సంవత్సరంలో 22 మూతపడనున్నాయి. సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో 8 , వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ పరిధిలో 14 మూతపడనున్నాయి. మూసివేయనున్న హాస్టళ్ల వివరాలను జిల్లా అధికారులు సర్కారుకు నివేదించారు. జిల్లాలో 76 బీసీ సంక్షేమ వసతి గృహాలున్నాయి. ఇందులో 3 వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 7300 మంది విద్యార్ధులు న్నారు. మూత పడనున్న వసతి గృహాల్లో 670 మంది విదార్ధులున్నారు. వీరంతా తట్టాబుట్టా సర్దుకోవాల్సిందే. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవల్సిందే. సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో 49 హాస్టళ్లున్నాయి. వీటిలో 4300 మంది విద్యార్ధులున్నారు. ఈ ఏడాది 8 వసతి గృహాలను మూసివేయనున్నారు. దీంతో 345 మంది విద్యార్ధులు నష్టపోతున్నారు. వసతి గృహాల మూసివేతకు ప్రభుత్వం సాకులు చూపుతోందని విద్యార్థి సంఘం నాయకులు విమర్శిస్తున్నారు. కొన్ని గ్రామీణ వసతి గృహాల్లో 50 మంది కంటే తక్కువగా ఉన్నవాటిని ఎత్తివేస్తున్నామంటున్న వాదనపై విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని వసతి గృహాల్లో 50కిపైగా విద్యార్ధులున్నప్పటికీ అద్దె భవనాల్లో నడుస్తున్నాయని మూసివేస్తున్నారు. మరి కొన్ని చోట్ల నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నాయని మూతకు సిద్ధపడుతోంది. వసతి గృహాలను మూసివేయడం వలన గ్రామీణ ప్రాంతాల బీసీ, ఎస్సీ పేద విద్యార్ధులకు తీరని నష్టం జరుగుతుంది. తాజా చర్యల వల్ల ఏటా వెయ్యి మంది వసతి గృహం వీడనున్నారు. అందుబాటులో ఉన్న వసతి గృహంలోనే వీరు చదువుకోవాల్సి ఉంటుంది. అందుబాటులో లేకుంటే ఇంతేసంగతులు. సాధారణంగా సమీపంలో వసతిగృహం లేకుం టే పాఠశాలలకు వెళ్లేందుకు గ్రామీణ విద్యార్థులు ఆసక్తి చూపరు. ఫలితంగా పేద విద్యార్థులు డ్రాప్‌అవుట్‌గా మారే ప్రమాదం ఉంది. అయితే గురుకుల పాఠశాలల్లోనూ, అందుబాటులో ఉన్న కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లోనూ, మోడల్ పాఠశాలల్లోనూ వీరిని చేర్పించేం దుకు చర్యలు తీసుకుంటామని సాంఘిక సంక్షేమ శాఖ డీడీ ధనుం జయరావు ‘సాక్షి’తో చెప్పారు.