ఈ స్మార్ట్‌ఫోన్ ఖరీదు రూ.4,999
                  
	న్యూఢిల్లీ: జపనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ సాన్సుయి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. హారిజన్-2 పేరుతో శుక్రవారం లాంచ్ చేసిన ఈ డివైస్ అతి తక్కువ ధరకేఅందుబాటులోకి తీసుకొచ్చింది.   ఇన్ఫ్రారెడ్ (ఐఆర్)  బ్లాస్టర్ ఫీచర్తోదీన్ని విడుదల చేసింది.  పెన్‌డ్రైవ్‌లు ,ఇతర యూఎస్బీ ఆధారిత ఉపకరణాలకు ఇది సపోర్టు చేయనుంది
	హారిజన్-2 ఫీచర్స్
	1.2 గిగిహెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్
	ఆండ్రాయిడ్7.0 ఆపరేటింగ్ సిస్టం
	2జీబీ ర్యామ్
	16జీబీ ఇంటర్నెనల్స్టోరేజ్
	8 ఎంపీ రియర్  కెమెరా
	5  ఎంపీ సెల్ఫీ కెమెరా
	పానిక్ బటన్ తోపాటు,  పిక్చర్ క్వాలిటీకోసం మిరా విజన్ ఫీచర్ తో బ్లాక్ గ్రే మరియు రోజ్ గోల్డ్ కలర్ వేరియంట్ లలో ఈ స్మార్ట్‌ఫోన్ లభిస్తుందని  సాన్సుయి సీవోవో  అభిషేక్ మల్పని ఒక ప్రకటనలో తెలిపారు. భారత వినియోగదారుల కోసం బడ్జెట్ ఫ్రెండ్లీ  ఇన్నోవేటివ్ స్మార్ట్ఫోన్ల తయారీకి తాము కట్టుబడి ఉన్నట్టు తెలిపారు.