breaking news
Hiring process
-
జీసీసీల్లో 40 లక్షల కొత్త కొలువులు
ముంబై: దేశీయంగా భారీగా ఏర్పాటవుతున్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో (జీసీసీ) హైరింగ్ కూడా గణనీయంగా పెరుగుతోంది. 2029–30 నాటికి కొత్తగా 28 లక్షల నుంచి 40 లక్షల వరకు ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉందని టీమ్‌లీజ్ ఒక నివేదికలో తెలిపింది. దీని ప్రకారం భారత్‌లో 1,800 జీసీసీలు ఉన్నాయి. ప్రపంచం మొత్తం మీద ఉన్న జీసీసీల్లో ఇది 55 శాతం. 2024–25 ఆర్థిక సంవత్సరంలో వీటిలో 19 లక్షల మంది ప్రొఫెషనల్స్ ఉండగా, ఎగుమతులపరంగా 64.6 బిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జించాయి. సంఘటిత ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ధికి భారత జీసీసీ వ్యవస్థ మూలస్తంభంగా ఎదుగుతోందని టీమ్‌లీజ్ డిజిటల్ సీఈవో నీతి శర్మ తెలిపారు. కొత్త రిక్రూట్స్‌లో 14–22 శాతం మంది ఏఐ, క్లౌడ్, డేటా ఇంజినీరింగ్‌లాంటి డిజిటల్ నైపుణ్యాలు గల ఫ్రెషర్స్ ఉండబోతున్నారని పేర్కొన్నారు. మిగతా 76–86 శాతం మంది మధ్య స్థాయి ప్రొఫెషనల్స్ ఉంటారని వివరించారు. కఠినతరమైన చట్టాలు.. వేగంగా విస్తరిస్తున్న జీసీసీలు కేంద్ర, రాష్ట్ర, స్థానిక స్థాయిలో ఏటా 2,000కు పైగా లీగల్ నిబంధనలను పాటించాల్సి ఉంటోంది. కారి్మక, ట్యాక్స్, పర్యావరణ చట్టాలు మొదలైనవి వీటిలో ఉంటున్నాయి. వీటికి అనుగుణంగా జీసీసీ ఆపరేటర్లు తమ కార్యకలాపాలను నిర్వహించుకోవాల్సి ఉంటుందని టీమ్‌లీజ్ రెగ్‌టెక్ సహ వ్యవస్థాపకుడు రిషి అగర్వాల్ తెలిపారు. తదుపరి విధానకర్తలు, పరిశ్రమ, విద్యారంగం ఏ విధంగా డిజిటల్ నైపుణ్యాలు గల, నిబంధనలకు అనుగుణంగా పని చేయగలిగే సిబ్బందిని తయారు చేసుకుంటాయనే దానిపైనే జీసీసీల విస్తరణ అనేది ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. -
హైరింగ్ ప్రణాళికల్లో కంపెనీలు...
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెద్ద ఎత్తున కంపెనీలు నియామకాలు చేపట్టే యోచనలో ఉన్నాయి. 45 శాతం సంస్థలు కొత్తగా పర్మనెంట్ ఉద్యోగులను తీసుకునే ప్రణాళికల్లో ఉన్నాయి. వర్క్‌ఫోర్స్ సొల్యూషన్స్, హెచ్ఆర్ సేవల సంస్థ జీనియస్ కన్సల్టెంట్స్ నిర్వహించిన ’హైరింగ్, కాంపన్సేషన్, అట్రిషన్ మేనేజ్మెంట్ అవుట్‌లుక్ సర్వే 2025–26’ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వివిధ పరిశ్రమలవ్యాప్తంగా 1,520 మంది సీఎక్స్‌వోలు, సీనియర్ అధికారులు ఈ సర్వేలో పాల్గొన్నారు. ఈ నివేదిక ప్రకారం 45 శాతం సంస్థలు కొత్తగా పర్మనెంట్ ఉద్యోగులను తీసుకువాలని భావిస్తుండగా 13 శాతం కంపెనీలు ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులు లేక ఖాళీ కాబోతున్న పోస్టులను భర్తీ చేసుకునే ప్రణాళికల్లో ఉన్నాయి. కానీ మరికొన్ని సంస్థలు హైరింగ్ విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో హైరింగ్ ప్రణాళికలేమీ లేవని 16 శాతం సంస్థలు తెలిపాయి. తాత్కాలిక స్టాఫింగ్ వైపు మొగ్గు.. తాత్కాలిక కొలువులకు కూడా డిమాండ్ పెరుగుతోంది. 26 శాతం కంపెనీలు టెంపొరరీ, కాంట్రాక్ట్ లేదా ప్రాజెక్ట్ ఆధారిత పనుల కోసం ఉద్యోగులను తీసుకునే యోచనలో ఉన్నాయి. గిగ్ వర్కర్లు, కాంట్రాక్ట్ అధారిత ఉద్యోగులు, అడ్వైజరీ సేవలందించే వారిని హైరింగ్ చేసుకోవాలని భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. పర్మనెంట్ ఉద్యోగులకు బదులుగా తాత్కాలిక సిబ్బందిని తీసుకునే ధోరణి పెరుగుతోందనడానికి ఇది నిదర్శనమని సర్వే పేర్కొంది. సర్వేలో పాల్గొన్న సంస్థల్లో 37 శాతం కంపెనీలు మిడ్–లెవెల్ నిపుణులను నియమించుకోనున్నట్లు తెలిపాయి. మరోవైపు, 19 శాతం కంపెనీలు ఎంట్రీ లెవెల్ ఉద్యోగులను తీసుకోవాలని భావిస్తుండగా, 18 శాతం సంస్థలు సీనియర్ లీడర్షిప్ స్థానాల్లోకి సిబ్బందిని నియమించుకునే యోచనలో ఉన్నాయి. ‘ఆర్థిక అనిశ్చితులను దాటుకుంటూ కంపెనీలు ముందుకెళ్తున్న క్రమంలో ప్రతిభావంతులైన నిపుణులకు డిమాండ్ నెలకొంది. మిడ్–సీనియర్ ప్రొఫెషనల్స్‌కి భారీగా డిమాండ్ ఉండటంతో అట్రిషన్ (ఉద్యోగుల వలసలు) రిసు్కలను అధిగమించి, సిబ్బందిని అట్టే పెట్టుకోవడంపై కంపెనీలు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. 2025–26లో కంపెనీలు సమర్ధవంతమైన విధంగా హైరింగ్ ప్రణాళికలను వేసుకునేందుకు ఈ విశేషాలు ఉపయోగపడతాయి‘ అని జీనియస్ కన్సల్టెంట్స్ చైర్మన్ ఆర్పీ యాదవ్ చెప్పారు. మరిన్ని విశేషాలు.. → 53 శాతం కంపెనీలు హైరింగ్ వృద్ధి ఒక మోస్తరుగా 5–10 శాతం స్థాయిలో ఉంటుందని అంచనా వేస్తున్నాయి. మరోవైపు 33 శాతం కంపెనీలు 10–15 శాతం అధికంగా నియామకాలు చేపట్టాలని భావిస్తున్నాయి. → పరిశ్రమలవారీగా చూస్తే రిటైల్, క్యూ–కామర్స్‌లో అత్యధికంగా 21 శాతం కంపెనీలు నియామకాలు చేపట్టనున్నాయి. లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ విభాగాల్లోనూ సుమారు 9 శాతం సంస్థలు సిబ్బందిని తీసుకోనున్నాయి. → ఆటోమొబైల్స్, ఎలక్ట్రిక్ వాహనాల విభాగాల్లో రిక్రూట్మెంట్ అధికంగా ఉంటుందని 15 శాతం కంపెనీలు భావిస్తున్నాయి. రెన్యూవబుల్స్, ఎనర్జీ, ఇంజినీరింగ్ ప్రాజెక్టుల విభాగాల్లో 11 శాతం కంపెనీలు రిక్రూట్మెంట్ చేపట్టనున్నాయి. → ఐటీ సర్వీసులు, టెలికం, టెక్నాలజీ విభాగాల్లో 13 శాతం, తయారీ, ఇంజినీరింగ్‌లో 11 శాతం, ఇన్ఫ్రా, రవాణా, రియల్ ఎస్టేట్‌లో 10 శాతం, బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా)లో 9 శాతం సంస్థలు హైరింగ్ యోచనలో ఉన్నాయి. → ఇక, ఎఫ్ఎంసీజీ, హెల్త్‌కేర్, హాస్పిటాలిటీ, మీడియా..ఎంటర్టైన్మెంట్, విద్య తదితర రంగాల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం హైరింగ్ ఒక మోస్తరుగానే ఉండవచ్చని అంచనా. -
మెగా ప్లాన్స్ : రైల్వేలో నాలుగు లక్షల ఉద్యోగాలు
సాక్షి, న్యూఢిల్లీ : రైల్వే శాఖలో రానున్న రెండేళ్ల కాలంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పించనున్నట్టు కేంద్ర రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్ ప్రకటించారు. కనీసం 2లక్షల,30వేలమందిని నియమించాలని భారతీయ రైల్వే నిర్ణయించిందని తెలిపారు. అలాగే గత ఏడాది రైల్వే ఉద్యోగాలకోసం పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన లక్షా యాభైవేల మంది ఉద్యోగాల్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. రైల్వేలో మొత్తం నాలుగు లక్షల ఉద్యోగాలను సృష్టించనునట్టు వెల్లడించారు. ఇప్పటికే నోటిఫై చేసిన ఖాళీలను భర్తీ చేసిన తర్వాత కూడా రైల్వేలో 1,32,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయనీ, దీనికి తోడు రానున్న రెండేళ్లలో దాదాపు లక్షమంది రిటైర్ కానున్నారని, ఈ పోస్టులను కూడా భర్తీ చేయాలని రైల్వే బోర్డు నిర్ణయించినట్టు తెలిపారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు. 131,328 పోస్టులకుగాను నియామక మొదటి దశ, 2019 మార్చిలో ప్రారంభమవుతుందని కేంద్రమంత్రి చెప్పారు. ప్రభుత్వ రిజర్వేషన్ పాలసీ ప్రకారం 19,715, 9,857, 35,485 ఖాళీలను వరుసగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన అభ్యర్థులకు రిజర్వ్ చేస్తామన్నారు. అలాగే పార్లమెంట్ ఆమోదించిన 103వ రాజ్యాంగ సవరణ ప్రకారం, 10 శాతం (సుమారు13,100 పోస్టులు) ఆర్థికంగా బలహీనమైన సెక్షన్ల అభ్యర్థులకు కేటాయిస్తామని, ఏప్రిల్ 20, 2020 నాటికి ఈ మొత్తం ప్రక్రియ పూర్తవుతుందని పియూష్ గోయల్ వివరించారు. -
హైదరాబాద్‌లో 24% పెరిగిన హైరింగ్
- ఆగస్టు వివరాలను వెల్లడించిన నౌకరీడాట్‌కామ్ న్యూఢిల్లీ: హైరింగ్(ఉద్యోగాలిచ్చే) ప్రక్రియ ఆగస్టులో 13 శాతం పెరిగిందని నౌకరీడాట్‌కామ్ జాబ్ పోర్టల్ తెలిపింది. రానున్న నెలల్లో హైరింగ్ మరింత జోరుగా ఉండగలదని పేర్కొంది. మెట్రో నగరాల్లో హైదరాబాద్‌లోనే అత్యధికంగా హైరింగ్ ఉందని వివరించింది. ఆగస్టులో హైరింగ్‌కు సంబంధించి ఈ సంస్థ వెల్లడించిన కొన్ని ముఖ్యాంశాలు... - ఆగస్టులో బ్యాంక్, ఆర్థిక సేవల రంగాల్లో అధికంగా ఉద్యోగాలొచ్చాయి. ఈ రెండు రంగాల తర్వాత ఆరోగ్య సంరక్షణ, ఫార్మా, సాఫ్ట్వేర్, టెలికం, మీడియా, వినోద రంగాల్లో ఉద్యోగాలొచ్చాయి. - వాహన, విడిభాగాల రంగాల్లో హైరింగ్ నిలకడగా ఉండగా, బీమా రంగంలో మాత్రం ఒకింత తగ్గింది. - మెట్రో నగరాల్లో హైరింగ్ పెరిగింది. హైదరాబాద్‌లో 24 శాతం వృద్ధి చెందింది. హైదరాబాద్ తర్వాతి స్థానాల్లో ముంబై(19 శాతం), పుణే(15 శాతం), బెంగళూరు(13 శాతం), చెన్నై(10 శాతం), ఢిల్లీ(10 శాతం) నిలిచాయి. కోల్‌కతాలో ఎలాంటి వృద్ధి నమోదు కాలేదు. - గత ఏడాది ఆగస్టుతో పోల్చితే నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ ఈ ఏడాది ఆగస్టులో 13 శాతం వృద్ధి చెంది 1,655కు పెరిగింది. - ఏప్రిల్ నుంచి చూస్తే జాబ్ మార్కెట్ నిలకడగా వృద్ధి చెందుతోంది.


